
సాక్షి, కర్నూలు: పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికార టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమ పార్టీకి ఓటేయ్యాలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం హుస్సేనపురంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వీరంగం సృష్టించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటు వెయ్యాలంటూ బెదిరింపులుకు పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు రాజశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. ఐదేళ్లలో తాగు, సాగునీటి సమస్యను తీర్చని టీడీపీ ప్రభుత్వానికి తాము ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రాజశేఖర్, ఆయన అనుచరులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment