సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి గురైన బాధితులు చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గతంలో తమపై దాడులు చేసిన చింతమనేని ప్రభాకర్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ చింతమనేనిపై ఉన్న పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న చింతమనేని ఆచూకి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా ఎస్పీ నవదీప్‌సింగ్ కేసును సీరియస్‌గా తీసుకోవడంతో చింతమనేనికి సహకరించిన కొందరు పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment