
ప్రకృతి విపత్తుల నివారణకు కొత్త ప్రాజెక్టు
ఏలూరు (సెంట్రల్) : రాష్ట్రంలో రూ.1,200 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో నూతన ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెల్లడించారు. స్థానిక జిల్లా పరి షత్ అతిథి గృహంలో గురువారం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ప్రకృతి విపత్తుల నివారణ పథకం కింద రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు వెచ్చించడానికి ప్రపంచబ్యాంకు సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు.
గత ఏడాది పై-లీన్ తుపాను, భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న నిర్మాణాల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రూ.1,200 కోట్లమేర ఆర్థిక సాయం చేయనుందని, ఈ పనులకు తగు అంచనాలు రూపొందించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఈ పథ కం కింద జిల్లాలోని తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, తుపానుల వల్ల దెబ్బతిన్న గ్రామాల్లోని ప్రధాన రహదారులను పునరుద్ధరించేందుకు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీమన్నారాయణ, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆర్థిక సంఘం నిధులు తెచ్చేందుకు కృషి
ఏలూరు : 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.16 కోట్ల నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి చెప్పారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగే 14వ ఆర్థిక సంఘ సమావేశానికి తనను ఆహ్వానించారని తెలిపారు. మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి మన జిల్లాకు మొదటి దఫాగా రూ.6.60 కోట్లు మంజూరయ్యూయని చెప్పారు.
ఈ నిధులు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతున్నాయని, రోడ్లు, డ్రెరుున్లు తదితర పనుల కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి ఇచ్చే నిధులను పెంచాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరతామని జెడ్పీ చైర్మన్ చెప్పారు. ఆర్ అండ్ బీ, పంచా యతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా జిల్లాకు వివిధ పనుల నిమిత్తం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని అడుగుతామన్నారు.