పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా తనపై విమర్శలు చేసిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌పై మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని చెప్పుకొచ్చారు.