phone conversation
-
‘సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లే.. ’
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లే ఉన్నారు. ఏం చేస్తాం? ఒక పక్క నుంచి పీక్కుంటూ వస్తున్నాం. ఒకరా.. ఇద్దరా ఆపడానికి. వారం ఆగితే అందరినీ రిమూవ్ చేస్తాం. వారం పదిరోజుల్లో మొత్తాన్ని తీసి పారనూకుతాం. వాళ్లిష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ పోయారు. మనోళ్లకు రాలేదు. వాడి మీద ఫిర్యాదు పెట్టు.. వాడి జాబ్ తీయించి పారనూకుతాను’ అంటూ సచివాలయ ఉద్యోగుల గురించి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆ పార్టీ కార్యకర్తతో చేసిన ఫోన్ సంభాషణ. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుట్రలో భాగంగానే హల్చల్పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కిషోర్ మాజీ కార్పొరేటర్ రామయ్యకు ఫోన్ చేసి.. వరద నష్ట పరిహారం అందలేదని చెప్పాడు. ఫలానా వాళ్లకు రూ. 1.25లక్షలు పడ్డాయి. మన వాళ్లు మొత్తం కోల్పోయినా రూ. 3వేలు పరిహారం ఇచ్చారంటూ రామయ్యతో ఫోన్లో మాట్లాడాడు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి రూ. లక్ష, రెండు లక్షలు వేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఏమీ ఇవ్వలేదు. ఇదేం న్యాయమంటూ రామయ్యను అడిగాడు. దీంతో రామయ్య ఒక్కసారిగా.. సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లేనంటూ రెచ్చిపోయాడు. ఫోన్ సంభాషణతో నియోజకవర్గంలోని సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ సంభాషణలో వాడిన భాష, సచివాలయ ఉద్యోగులను వాడు వీడు అంటూ మాట్లాడిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి ఆడియోలు రికార్డు చేసి వాటిని వైరల్ చేయడం రామయ్యకు అలవాటేనని, సచివాలయ ఉద్యోగులంతా వైఎస్సార్ సీపీ వాళ్లేనంటూ బెదిరించి వారిని తన ఆధీనంలో పెట్టుకునే కుట్రలో భాగంగానే ఆడియో వైరల్ చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో వాళ్ల పార్టీ నాయకులు ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియోలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయని నాయకులు చర్చించుకుంటున్నారు. -
వైఎస్ఆర్సీపీ పై షర్మిల కుట్ర.. ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయింది..
-
ఢిల్లీ వెళ్లేముందు తండ్రి కేసీఆర్‌తో మాట్లాడిన కవిత..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలో కూతురికి కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఆందోళనపడాల్సిన అవసరం లేదని, బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదామని పేర్కొన్నారు. పార్టీ అన్ని విధాలుగా ఉంటుందని హామీ ఇచ్చారు. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు అని కవితకు కేసీఆర్ సూచించారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు పంపించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 9న(గురువారం) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత.. ఈనెల 10న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా విచారణకు హాజరుకాలేనని, ఈనెల 15న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీని కోరారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోడవంతో ఆమె ఢిల్లీ బయలుదేరారు. వాస్తవానికి కవిత గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే వెళ్తుండటంతో ఈడీ విచారణ కోసమే వెళ్తున్నారా? అనే చర్చ మొదలైంది. కవితకు ఈడీ నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. మహిళా దినోత్సవం రోజే సీఎం కేసీఆర్ కుమార్తెకు నోటీసులు పంపడం కేంద్రం దుర్మార్గపు చర్య అని మండిపడ్డాయి. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు తగిన బుద్ది చెబుతారని ధ్వజమెత్తాయి. మరోవైపు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. దర్యాప్తు సంస్థలతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పారు. కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థిత వచ్చిందని కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కాం నిందితులు తనకు తెలుసునని కవితలో గతంలోనె చెప్పారని పేర్కొన్నారు. ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కాగా.. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాను కవితకు బినామీనంటూ పిళ్లై ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లోనూ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఆ మరునాడే ఆమెకు నోటీసులు పంపింది. చదవండి: లిక్కర్ స్కామ్ హీట్: సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే..! పిళ్లై రిమాండ్ రిపోర్టులో సంచలనాలు -
అతన్ని సీనియర్లేమీ అనట్లేదు..
ఎంజీఎం: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి తన తల్లితో చివరిసారిగా మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేస్తున్న వైనాన్ని వివరించింది. అతన్ని సీనియర్లు ఏమీ అనడంలేదని.. ఒకవేళ అతనిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లు తనకు ఏమీ నేర్పించకుండా దూరంపెడతారని తల్లికి చెప్పుకొని బాధపడింది. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఇలా.. ప్రీతి: హలో అమ్మా.. తల్లి: అయిపోయిందా డ్యూటీ. ప్రీతి: లేదమ్మా నైట్ డ్యూటీ. 2, 3 గంటల తర్వాత ఎవరైనా వస్తారు.. వస్తే గాంధీకి వెళ్లాలి. అక్కడ కూడా నైట్ డ్యూటీ. తల్లి: బండి తీసుకుపోలేదా? ప్రీతి: తీసుకెళ్లినా.. తల్లి: డాడీ వచ్చిండంట కదా.. ప్రీతి: ఆ వచ్చిండు.. ఆస్పత్రి దగ్గర దించిండు. మళ్లీ హెచ్ఓడీ దగ్గరకు వెళ్లి మాట్లాడినా.. చూసుకుంటా అన్నాడు. తల్లి: నువ్వు ఒక్కదానివే వెళ్లినవా.. డాడీ కూడా వచ్చాడా. ప్రీతి: నేనే వెళ్లినా.. డాడీ పనిలో ఉండే.. నేను వెళ్లినా.. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా.. ప్రిన్సిపాల్ సర్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అని హెచ్ఓడీ అడిగాడు. ఆయనను పిలిచి ఏం మాట్లాడిండో తెలియదు. వాని గురించి డాడీకి ఫోన్ చేయాలి.. నన్ను ఏం చేస్తారు? అంటున్నాడు. ఆయన పేరు కంప్లైంట్ చేసినా సీనియర్లు నాకు ఏమీ నేర్పించకుండా దూరం పెడతారు. తల్లి: సెకండియర్ అంతా ఒక్కటేనా.. అందరూ అలాగే ఉంటారా..? ప్రీతి: అందరూ ఆయనలాగా ఉండరు.. తల్లి: వాళ్లు అతన్ని ఏమీ అనడం లేదా.. అలా ఎందుకు చేస్తున్నావని..? ప్రీతి: అలా ఎవరూ అనడం లేదు. తల్లి: వీడు అంత ఇదా.. హెచ్ఓడీ మాట కూడా వినడా..? ప్రీతి: ఏం తెలియదు.. తల్లి: నువ్వేపోయి చెప్పినావా..? ప్రీతి: లేదు.. ప్రిన్సిపాల్‌కు డాడీ ఎవరితో చెప్పించిండో తెలియదు.. హెచ్ఓడీ పిలిపించి అడిగిండు. ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అన్నాడు. నేను పడుతున్న ఇబ్బంది గురించి హెచ్ఓడీకి చెప్పినా. తల్లి: ఏం భయపడకు.. మనం వరంగల్‌లోనే ఉన్నాం. ఎక్కడో దేశంలో లేం.. రెండు, మూడు రోజుల్లో కాలేజీకి వస్తాం. రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సైఫ్‌పై వస్తున్న ఆరోపణలతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసులపై మంగళవారం కేఎంసీలో యాంటీ ర్యాంగింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. సైఫ్ ఘటనలో జరిగిన వివరాలను చర్చించి ఢిల్లీ యాంటీ ర్యాగింగ్ కమిటీతోపాటు కాళోజీ ఆరోగ్య వర్సిటీకి సైతం నివేదిక సమర్పించనున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు సైఫ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. -
ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్
కీవ్: సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న క్రమంలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ క్రమంలోనే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడినట్లు సోమవారం ప్రకటించారు. తన శాంతి ఫార్ములాను అమలు చేయడంలో భారత్ పాలుపంచుకుంటుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. జీ20 దేశాల సదస్సుకు భారత్ విజయవంతంగా అధ్యక్షత వహించాలని మోదీకి శుభాకాంక్షలు తెలిపినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడాను. జీ20 ప్రెసిడెన్సీని విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించాను. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా నేను శాంతి ఫార్ములాను ప్రకటించాను. దానిని అమలు చేసేందుకు భారత్ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా. ఐక్యరాజ్య సమితిలో మానవతా సాయం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాను.’ - వొలొదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ విషయంపై భారత్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు జెలెన్స్కీతో పలు సందర్భాల్లో మాట్లాడారు. ప్రస్తుతం యుద్ధాలు చేసే సమయం కాదని, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు మోదీ. I had a phone call with @PMOIndia Narendra Modi and wished a successful #G20 presidency. It was on this platform that I announced the peace formula and now I count on India's participation in its implementation. I also thanked for humanitarian aid and support in the UN. — Володимир Зеленський (@ZelenskyyUa) December 26, 2022 ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
స్వామీజీ-రోహిత్ రెడ్డి సంభాషణ వైరల్
-
ఎమ్మెల్యేల ఎపిసోడ్.. స్వామీజీ-రోహిత్ రెడ్డి సంభాషణ వైరల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటనలో తాజాగా ఓ ఆడియో బయటకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఫామ్‌హౌజ్ మీటింగ్‌కు ముందు రామచంద్రభారతితో రోహిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఫోన్ సంభాషణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నమస్తే స్వామీజీ ఎలా ఉన్నారు. స్వామీజీ: బాగున్నాను. మీరెలా ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నేను బాగున్నాను. స్వామీజీ: నందు మేము మాట్లాడుకున్నాము. మాకు కొన్ని వివరాలు చెప్తే సార్‌తో మాట్లాడతాను. ఇప్పటికే మాట్లాడాను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: హా స్వామిజీ స్వామీజీ: పేరు పంపితే బాగుంటుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి:పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టం. ఇప్పటికి ఇద్దరు కర్ఫర్మేషన్ ఇచ్చారు. కలిసి మాట్లాడితే బాగుంటుంది స్వామిజీ. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: ప్రస్తుతం మేం ముగ్గురం రెడీగా ఉన్నాం. స్వామీజీ: మీరు నెంబర్-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నెంబర్ 2 ముందు పేర్లు చెబుతాను. ఈ విషయం బయటపడితే మా పని అయిపోతుంది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దూకుడుగా ఉంటారు. స్వామీజీ: నెంబర్-1, నెంబర్-2.. బీఎల్ సంతోష్ ఇంటికి వచ్చి అన్నింటిపై చర్చిస్తారు. బీఎల్ సంతోష్ మా ఆర్గనైజింగ్ సెక్రటరీ.. ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు. ఏ నిర్ణయమైనా బీఎల్ సంతోషే తీసుకుంటారు. స్వామీజీ: సంతోష్‌తో కలిసి మనం నెంబర్-2 దగ్గరకు వెళదాం. ఒకరిద్దరు ముందుగా వస్తే బాగుంటుంది. స్వామీజీ: 24వ తేదీ వరకు నేను బెడ్ రెస్ట్‌లో ఉండాలి. తర్వాత నేను హైదరాబాద్ వస్తాను. వచ్చాక కూర్చొని మాట్లాడుకుందాం స్వామీజీ: 25న గ్రహణం ఉంది కాబట్టి.. ఆ తర్వాత కలుద్దాం. స్వామీజీ: 26 తర్వాత ఎక్కడైనా కలుద్దాం.. హైదరాబాద్‌లో మాత్రం వద్దు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: సమస్య ఏంటంటే స్వామీజీ, ప్రస్తుతం ఎలక్షన్ ఉంది కదా వాళ్లు మమ్మల్ని గమనిస్తున్నారు. సో హైదరాబాదే మంచి ప్లేస్. స్వామీజీ: అలాగే, అలాగే హైదరాబాద్‌లోని ఏదో చోటికి వస్తాను. కలుద్దాం. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: స్వామిజీ మీరు క్లారిటీ తీసుకోండి.. నేను మరికొంత మందికోసం ప్రయత్నిస్తా.. స్వామీజీ: నేను డైరెక్టుగా బీఎల్ సంతోష్‌తోనే మాట్లాడతా.. మధ్యవర్తులు ఎవరూ లేరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: దయచేసి ఇదంతా టాప్సీక్రెట్గా పెట్టండి.. లేకపోతే నాపనైపోతుంది. స్వామీజీ: ఏమైనా చిన్న తేడా వచ్చినా మేము కవర్ చేస్తాం. మేం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. స్వామీజీ: ఈడీ నుంచి ఐటీ వరకు, మీ భద్రతను కూడా మేముచూసుకుంటాం స్వామీజీ: మీరంతా మా స్కానర్‌లో ఉన్నారు.. మీరేమి కంగారుపడొద్దు -
తైవాన్‌పై జోక్యం చేసుకోవద్దు
బీజింగ్: తైవాన్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చైనా అధినేత జిన్‌పింగ్ గట్టిగా హెచ్చరించారు. వ్యూహాత్మక కారణాలతో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య విభేదాలు మంచిది కాదని కూడా జిన్ పింగ్ పేర్కొన్నట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి వైఖరి ప్రపంచ ఆర్థిక పురోగతిపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ‘చైనా ప్రధాన భూభాగం నుంచి వేరుపడేలా తైవాన్ను ప్రేరేపించే వెలుపలి శక్తులను ఎదుర్కొంటాం. 140 కోట్ల చైనా ప్రజల అభీష్టమైన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటాం. నిప్పుతో ఆడాలనుకుంటే భస్మం అవుతారు’అంటూ గట్టి హెచ్చరికలు పంపింది. ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని తగ్గించడం, స్థూల ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, కోవిడ్‌తో పోరాటం, ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించుకోవడం వంటి వాటిపై సహకరించాలని అమెరికాను జిన్‌పింగ్ కోరారని చైనా ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలో తైవాన్ సందర్శిస్తారంటూ వస్తున్న వార్తలపై చైనాలింకా స్పందించలేదు. అయితే, బైడెన్, జిన్‌పింగ్ నవంబర్‌లో ఇండొనేసియాలో జరిగే జి–20 భేటీలో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. -
నిప్పుతో చెలగాటం ఆడొద్దు.. బైడెన్‌తో జిన్‌పింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం ఫోన్లో సుదీర్ఘంగా వాడీవేడిగా సంభాషణలు సాగాయి. రెండు దేశాల అధ్యక్షుల మధ్య గురువారం జరిగిన ఐదో విడత చర్చలు ఉదయం 8.33 నుంచి 10.50 గంటల వరకు కొనసాగినట్లు శ్వేతసౌధం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ చర్చల్లో తైవాన్ అంశమే ప్రధానంగా నిలిచింది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణతకు అమెరికానే కారణమంటూ ఎప్పటి మాదిరిగానే చైనా నిందించింది. తైవాన్ ఎప్పటికైనా తమదేనంటూ చర్చల సందర్భంగా జిన్‌పింగ్ గట్టిగా చెప్పారని చైనా పేర్కొంది. ‘‘నిప్పుతో ఆడుకునే వారు దానివల్లే నాశనమవుతారు. ఈ విషయం అమెరికా తెలుసుకోవాలి‘ అంటూ బైడెన్ వద్ద జిన్‌పింగ్ ప్రస్తావించినట్లు.. చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో.. ‘అమెరికా–చైనా సంబంధాలను వ్యూహాత్మక పోటీదారు కోణంలో చూడటం, చైనాను ప్రధాన ప్రత్యర్థిగా భావించడం వంటి వాటిని బైడెన్‌తో జిన్‌పింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి విధానం అంతర్జాతీయ సమాజాన్ని, రెండు దేశాల ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని, ఇరు దేశాల సంబంధాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని జిన్‌పింగ్ అన్నారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్–బైడెన్ చర్చలకు సంబంధించి శ్వేతసౌధం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: మరో ఆరేళ్లు అమెరికాతో ప్రయాణం- రష్యా ప్రకటన -
యుద్ధ నేరాలకు... సాక్ష్యాలివిగో
కీవ్: రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడితో 50 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్న రష్యాపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ కోరింది. బుచాను తలపించే ఈ మారణకాండకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బాధ్యున్ని చేసి తీరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. రష్యా యుద్ధ నేరాలకు కావాల్సినన్ని రుజువులు దొరికాయని చెప్పారు. ‘‘మా పౌరులను ఎలా అపహరించింది, ఎలా నిర్దాక్షిణ్యంగా కాల్చేసిందీ, చేతికందిన వాటినల్లా ఎలా దోచేసిందీ రష్యా సైనికులు తమ కుటుంబీకులకు చెప్తున్న ఫోన్ సంభాషణలను రికార్డు చేశాం. మాకు పట్టుబడ్డ రష్యా పైలట్ల దగ్గర పౌర నివాస ప్రాంతాలున్న మ్యాపులు దొరికాయి కూడా’’ అన్నారు. ప్రధాన కారకుడైన పుతిన్‌తో పాటు ఈ దారుణాలకు ప్లాన్ చేసిన, ఆదేశాలిచ్చిన, వాటిని అమలు చేసిన వారందరిపైనా విచారణ జరిగి కఠినాతి కఠినమైన శిక్షలు పడాల్సిందేనన్నారు. ఈ ఘోరాన్ని వర్ణించేందుకు మాటలే లేవని కీవ్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. రష్యా శాడిజం నానాటికీ పరాకాష్టను చేరుతోందని దుయ్యబట్టారు. అయితే తనను దోషిగా చూపేందుకు ఉక్రెయినే రైల్వేస్టేషన్‌పై దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. బుచాలో పౌరులను రష్యా దళాలు సామూహికంగా పొట్టన పెట్టుకున్న కనీసం మూడు చోట్లను తాజాగా గుర్తించినట్టు నగర మేయర్ చెప్పారు. ఒక చోట సామూహికంగా ఖననం చేసిన 70 శవాలను బయటికి తీశామన్నారు. ఈ మారణకాండలో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ హస్తముందని జర్మనీ అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా తన సైనిక శక్తిలో కనీసం 20 శాతాన్ని కోల్పోయిందని అమెరికా తాజాగా అంచనా వేసింది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలిస్తామని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం కీవ్‌లో జెలెన్స్కీతో భేటీ అయ్యారు. మరోవైపు, ఉక్రెయిన్‌లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ కూడా తమ రాయబారిని కీవ్‌కు తిరిగి పంపించింది. ఇటలీ కూడా త్వరలో కీవ్‌లో తమ ఎంబసీని తెరుస్తామని ప్రకటించింది. ఆదుకోండి: ప్రియాంక శరణార్థులను ఆదుకోవాలని నటి, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రపంచ నేతలను కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘20 లక్షలకు పైగా ఉక్రెయిన్ చిన్నారులు దేశం విడిచారు. 30 లక్షలకు పైగా స్వదేశంలోనే నిరాశ్రయులుగా మిగిలారు. కనీవినీ ఎరగని సంక్షోభమిది. యుద్ధం మిగిల్చిన ఈ తీరని వేదన వారి మనసుల్లోంచి ఎన్నటికీ పోయేది కాదు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. తన అభిమానులు, ఫాలోవర్లు కూడా వీలైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రతామండలి నుంచి రష్యాను బహిష్కరించలేం: అమెరికా ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా బహిష్కరణ సాధ్యం కాదని అమెరికా అభిప్రాయపడింది. రష్యా అందులో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశమ ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి గుర్తు చేశారు. రష్యాకు భారత్ దూరమవాలి: అమెరికా రష్యాతో జి77 అలీన భాగస్వామ్య బంధం నుంచి భారత్ తప్పుకోవాలని అమెరికా విదేశాంగ ఉప మంత్రి వెండీ షెర్మన్ సూచించారు. అమెరికా–భారత్ మధ్య రక్షణ వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎం తో అవకాశముందన్నారు. ‘అమెరికా, ఆస్ట్రేలి యా, జపాన్‌లతో కూడిన క్వాడ్ కూటమిలో కూ డా భాగస్వామి అయినా భారత్ వెంటనే రష్యాతో బంధానికి దూరమైతే మేలు’ అన్నారు. -
టీడీపీ నాయకుల బూతుపురాణం.. వాట్సాప్‌లో వైరల్
సాక్షి, మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించిన ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య సెల్ఫోన్లో సాగిన బూతుపురాణం వాట్సప్‌ల్లో వైరల్ అవుతోంది. టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, మండల సీనియర్ నాయకులు డి.శ్రీనివాసులు ఫోన్లో బూతులు తిట్టుకున్న తీరు విన్నవారి చెవులు తుప్పు వదిలిపోయేలా ఉంది. మదనపల్లె తెలుగుదేశం పార్టీలో కొద్దిరోజులుగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, శ్రీరామ్‌చినబాబు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గ తెలుగుయువత కమిటీ నియామకంకు సంబంధించి వీరిద్దరి మధ్య రాజుకున్న వివాదమే శుక్రవారం మండల సీనియర్ నాయకుడికి, శ్రీరామ్‌చినబాబు బూతులకు కారణమైంది. శ్రీరామ్‌చినబాబు ప్రకటించిన కమిటీ చెల్లదని, తాను వేసిన కమిటీనే చెల్లుతుందని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఇటీవల ప్రకటించారు. దీంతో శ్రీరామ్‌చినబాబు రెండురోజులక్రితం తన కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి తెలుగుయువతకు సంబంధించి తన నిర్ణయమే ఫైనల్ అని మదనపల్లెకు ఇన్‌చార్జ్‌లు లేరని ప్రకటించారు. దీంతో ఇన్చార్జ్గా ప్రచారం చేసుకుంటున్న దొమ్మలపాటి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాసులు శ్రీరామ్చినబాబుతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బూతుపురాణంగా మారింది. పత్రికల్లో రాయలేని విధంగా ఇద్దరు ఒకరిపై ఒకరు బూతులు మాట్లాడుకోవడమే కాకుండా మధ్యలో పార్టీ అధినేత చంద్రబాబును, తల్లిలాంటి పార్టీని దూషించారు. నీవు డబ్బులకు అమ్ముడుపోయావని ఒకరంటే.. నీవు జనసేనలో చేరుతున్నావని మరొకరు..ఎన్నిపార్టీలు మారుతావురా, సిగ్గులేదానీకు అంటూ ఒకరంటే.. నా....లో పార్టీ అంటూ బూతులు మాట్లాడుకున్నారు. చదవండి: ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు.. టీడీపీ ద్రోహం ప్రతిసారీ వేదికల మీద క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని చెప్పుకునే చంద్రబాబు తెలుగుతమ్ముళ్ల బూతుపురాణంపై ఏ విధంగా స్పందిస్తారని పట్టణంలో పలువురు చర్చించుకుంటున్నారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు బీసీ నాయకుడు కావడంతో ఎక్కడ తనకు పోటీఅవుతారోనని, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటిరమేష్ తన అనుచరుడితో రెచ్చగొట్టేలా మాట్లాడించి బూతులు తిట్టించారని ప్రచారం జరుగుతోంది. అధినేత తమ్ముళ్ల బూతుపురాణంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.. -
సైబర్ క్రైమ్: ఫోన్లో గూఢచర్యం..
ఊరు నుంచి వచ్చాక అల్మారా తెరిచి చూసిన సుమిత్ర(పేరుమార్చడమైనది) షాక్ అయ్యింది. తను భద్రంగా ఉంచిన బంగారం కనిపించలేదు. అల్మరా తాళాలు ఎక్కడ పెట్టిందో తనకు మాత్రమే తెలుసు. అవి ఎక్కడ ఉంచిందో అక్కడే జాగ్రత్తగా ఉన్నాయి కూడా. ఇంట్లో కొడుకు కోడలిని అడిగితే తమకేమీ తెలియదని, పెద్ద కోడలికి ఇచ్చారేమో అంటూ నిష్టూరంగా మాట్లాడారు. సుమిత్రకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. భర్త సంపాదించినది, తన దగ్గర ఉన్న బంగారం ఇంకా పిల్లలకు పంచలేదు. ఇద్దరు కొడుకులు ఉద్యోగ రీత్యా మంచి స్థాయిలో ఉండటంతో వారు సొంతిళ్లు కట్టుకుని ఉంటున్నారు. చిన్నకొడుకు ఆర్థికంగా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సుమిత్ర, ఆమె భర్త రఘునాథం సర్దుకుపోయేవారు. కానీ, ఈ మధ్య ఆస్తి వ్యవహారంలో కొడుకుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. కోడలు ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. బంగారం పోవడంతో పోలీసులను సంప్రదించారు సుమిత్ర, ఆమె భర్త. ఫోన్ సంభాషణతో చౌర్యం ఇంటి పరిస్థితి కనుక్కుంటే కొన్ని నెలలుగా తమ కొడుకు, కోడలు తమపై గూఢచర్యం చేస్తున్నారని, తమ పిల్లలతోనూ, బంధువులతోనూ తాము ఫోన్లో మాట్లాడుకున్న విషయాలు కూడా వారికి తెలిసిపోతున్నాయని, ఇంట్లో ప్రశాంతత కోల్పోయామని చెప్పుకున్నారు సుమిత్ర దంపతులు. వారి దగ్గర ఉన్న ఫోన్ చెక్ చేసి చూస్తే అందులో చిన్న కోడలు స్పై యాప్‌ని ఇన్స్టాల్ చేసి, రికార్డర్ వాయిస్‌ను తన ఈ మెయిల్‌కు లింక్ చేసినట్టుగా గుర్తించారు. దీని ద్వారా కుటుంబంలో మిగతావారితో జరిగే ఫోన్ సంభాషణ అంతా కొడుకు, కోడలు వినేవారని తెలిసింది. అందులో భాగంగా సుమిత్ర తన కూతురి తో ఫోన్లో మాట్లాడినప్పుడు అల్మరాలో ఉంచిన బంగారం, రహస్యంగా ఉంచిన తాళాల గురించి చెప్పింది. అది తెలుసుకున్న కొడుకు కోడలు ఆ బంగారాన్ని దొంగతనం చేసి, తమకేమీ తెలియదని, మిగతా కొడుకులకు, కూతురుకు ఇచ్చి ఉంటారని దురుసుగా మాట్లాడారు. ఇదో మానసిక జాడ్యం కుటుంబ సంబంధాలలో అనుమానాలు ఉంటేనే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకుంటే పొరబాటే. బయటి వారు కూడా ఇతరులను ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి చర్యలకు పూనుకోవచ్చు. వారిలో అత్యంత సన్నిహితులు అనదగిన వారు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఎన్ఆర్ఐ మ్యారేజీ విషయాల్లో కాబోయే భాగస్వామి పట్ల అనుమానంతో ఇలాంటి గూఢచర్యం చేస్తుంటారు. భార్యాభర్తల సంబంధం విషయంలోనూ అనుమానం వల్లే ఇలాంటి స్పైవేర్లు పుట్టుకు వస్తాయి. ఫోన్ సర్వీస్ పాయింట్లలోనూ ఇలాంటి స్పై కెమరా యాప్‌లు ఇన్స్టాల్ చేసి, వాటి ద్వారా అమ్మాయిల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. యాంటీ స్పై వేర్... ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మన ఫోన్ ఇవ్వకుండా ఉండటం మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ► మాల్వేర్ లేదా స్పై వేర్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ► ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతుంటుంది. ► పాప్ అప్ యాడ్స్ నిరంతరం వస్తూ ఉంటాయి. ► డేటా వినియోగం పెరిగినట్టుగా చూపుతుంది. ► ఇతర పాప్ అప్ యాప్ నోటిఫికేషన్స్ విరివిగా వస్తుంటాయి. ► మాల్వేర్ లేదా స్పై వేర్ ఉందని అనుమానించినట్లయితే యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయాలి. ఫోన్‌ని స్కాన్ చేయాలి. అవసరం లేని యాప్స్‌ను తొలగించాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ బోధన్/ బాన్సువాడ: ‘బలిసిందా నీది.. ఊరుకో బే బాడ్ఖావ్.. ఏం మాట్లాడుతున్నావు..’ అంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ ఓ కిరాణా వ్యాపారిని బూతులు తిట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సరిగ్గా మాట్లాడండి’ అంటూ వ్యాపారి వారించినా వినకుండా ఎమ్మెల్యే ఆగ్రహంతో దూషణలకు దిగారు. డబ్బులు ఇచ్చానంటూ గద్దించారు. దీంతో మసీదు ఎక్కి ఆ మాట చెప్పాలని వ్యాపారి పేర్కొన్నారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తాను మధ్యతరగతికి చెందిన వాడినని వాపోయారు. ఈ నేపథ్యంలోనే తనకు ఎమ్మెల్యే నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, లేదంటే ఎమ్మెల్యే నివాసం ఎదుట నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మురళీధర్ అనే ఈ వ్యాపారి సోమవారం బోధన్ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు బోధన్ పోలీసులు నిరాకరించడంతో గురువారం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, తనకు ఎమ్మెల్యేతో ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎప్పుడో రంజాన్ తోఫా కిట్ల డబ్బులు.. 2018లో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు సరుకులతో కూడిన తోఫా కిట్ల సరఫరాకు సంబంధించి వ్యాపారి మురళీధర్‌తో ఎమ్మెల్యే షకీల్ రూ.36 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.12 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.24 లక్షలు 3 నెలల్లో ఇస్తామని చెప్పారు. కానీ ఈ డబ్బుల కోసం తాను పలుమార్లు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినా స్పందించలేదని మురళీధర్ వాపోతున్నారు. అలాగే, 2019లో ఫుడ్ క్యాటరింగ్‌కు సంబంధించి మరో రూ.5 లక్షలు కూడా తనకు రావాలన్నారు. ఈ డబ్బుల కోసం పలుమార్లు హైదరాబాద్‌కు వెళ్లి అడిగినా.. ఎమ్మెల్యే దాటవేశారని తెలిపారు. చివరకు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతో, ఎమ్మెల్యే స్నేహితుడికి ఫోన్ చేసి తన బాధను వెళ్లగక్కానని, స్నేహితుడి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే తనతో మాట్లాడారని వ్యాపారి తెలిపారు. బూతు మాటలతో తిట్టడంతో పాటు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పారన్నారు. తాను అప్పులు తెచ్చి సరుకులు సరఫరా చేశానని, తన వద్ద డబ్బులు లేక అవి తీర్చలేదని, వడ్డీ కూడా కట్టకపోవడంతో తన షాపు వేలం వేస్తున్నారని వాపోయారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: ఎమ్మెల్యే తాను మురళీధర్‌కు పది పైసలు కూడా బాకీ లేనని, ఇదంతా తన రాజకీయ ప్రత్యర్థులు చేసిన కుట్ర అని షకీల్ అమేర్ సాక్షి ప్రతినిధితో అన్నారు. ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే ఇలా చేస్తున్నారని చెప్పారు. అతనికి తానే లిఫ్ట్ ఇచ్చానని, ఇప్పుడు తననే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. తాను 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదలను ఆదుకున్నానని, తాను బాకీ ఉన్నానని అనడం తప్పు మాట అని అమేర్ పేర్కొన్నారు. -
ట్రంప్–మోదీ ఫోన్ సంభాషణ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుకున్నట్లు వైట్‌హౌజ్ మంగళవారం తెలిపింది. అమెరికా–భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ భద్రతా వ్యవహారాలను సమీక్షించినట్లు తెలిపింది. భారత ప్రజలకు ట్రంప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారని, భారత్‌తో ద్వైపాక్షిక అంశాలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని ట్రంప్ చెప్పినట్లు వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త ఏడాది ప్రారంభమయ్యాక ఇరుదేశాల నేతలు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్ కమాండర్ సులేమానీని అమెరికా చంపిన నేపథ్యంలో వీరి ఫోన్‌కాల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్–మోదీల ఫోన్ కాల్‌పై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా స్పందించింది. అమెరికా–భారత్ మైత్రి బలపడటమేగాక, ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారని తెలిపింది. నమ్మకం, గౌరవం, అర్థంచేసుకోవడం వంటి అంశాలతో ఇరు దేశాలు కలసి కట్టుగా ముందుకు వెళుతున్నట్లు మోదీ చెప్పారని వెల్లడించింది. వీరిరువురి ఫోన్ కాల్‌కు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. -
మేం తలచుకుంటే.. ఏముందమ్మా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మేం తలచుకున్నంక ఏముంటదమ్మా.. డీజీపీకి చెప్పి ఎక్కడున్నదో క్యాంపు చూడుమంటే ఏంచేస్తడు. బస్సును తీసుకపోయి పోలీస్‌స్టేషన్ లోపల పెడతడు’ ‘యూసఫ్ది లాండ్ ఇష్యూ ఉంది. దాన్ల ప్రాబ్లం క్రియేటవుతది. గవర్నమెంట్ కబ్జా చేస్తది. రమేష్ లాండ్ గుడ గవర్నమెంట్ హాండోవర్ అవుతది. ఆడ బోర్డు బెడతరు’ ‘సుధ వాళ్ల భర్త బెల్లంపల్లి ఓసీల జాబ్ చేస్తుండు. ఆయన్ను రెండు రోజు లల్ల తీసుకుపోయి మణుగూరుల పడేస్తం. కేటీఆర్ తలచుకున్నంక ఎంతసేపమ్మ. ఒక్క మాట చెప్తే రేప్పొద్దున ట్రాన్స్ఫర్ చేసేస్తడు’ ‘కలెక్టర్ ఏం జేస్తడు. గవర్నమెంట్‌కు ఫేవర్గ చేస్తడు కద. అఫీషియల్‌గ ప్రొలాంగ్ చేపించుడో, పోస్ట్‌పోన్ చేయించుడా ఏదో చేస్తం’ బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుతో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడిన మాటలు ఇవి. బెల్లంపల్లి మున్సి పల్ చైర్పర్సన్ సునీతారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు పార్టీలకు అతీతంగా పాలకమండలిలోని 29 మంది కౌన్సిలర్లు కొద్దిరోజులుగా అజ్ఞాతంగా క్యాంపులో ఉన్నారు. అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేయడానికి రంగంలోకి దిగారు. కౌన్సిలర్ల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురుతో తొలుత మాట్లాడిన ఎమ్మెల్యే క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ఒప్పిం చమని చెప్పారు. తల్లితో మాట్లాడిన కూతురు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పేందుకు ఫోన్ చేయగా మంత్రి కేటీఆర్ పేరును ఉపయోగిస్తూ భయ పెట్టేలా సంభాషణ జరిపారు. కేటీఆర్ తలచుకుం టే ఏమైనా జరుగుతుందని, కౌన్సిలర్లకు ఇబ్బం దులు కలుగుతాయని స్పష్టం చేశారు. మాట వినకపోతే కౌన్సిలర్ల అధీనంలో ఉన్న వివాదాస్పద భూములను సర్కార్ కబ్జా చేసుకుంటుందని, బెల్లంపల్లి ఓపెన్‌కాస్ట్‌లో పనిచేస్తున్న సుధ అనే కౌన్సిలర్ భర్తను మణుగూరుకు రెండు రోజుల్లో బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఫోన్ కాల్ లీక్ అయి గురువారం ఉదయాన్నే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడి కావడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. బెల్లంపల్లి ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన సంభాషణలో మంత్రి కేటీఆర్ పేరును పలుమార్లు వాడుకున్నారు. ‘గవర్నమెంట్ తలచుకుంటే ఏమన్న అయితది. కేటీఆర్ ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి క్యాంప్ అయింది’ అని ఎమ్మెల్యే సంభాషణ సాగించారు. ‘క్యాంపు నుంచి రాకుంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ టైట్ చేసేసి తీసు కొస్తం’ అని మాట్లాడటం చర్చనీయాంశమైంది. అవిశ్వాసానికి ఏడుగురు సభ్యుల నోటీసు బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవి శ్వాసం ప్రకటిస్తూ పాలక మండలిలోని ఏడు గురు సభ్యులు జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు కు నోటీసు అందజేశారు. గురువారం కలెక్ట ర్ కార్యాలయంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నూనే టి సత్యనారాయణ (టీఆర్ఎస్) నేతృత్వంలోని సభ్యులు సతీష్, ఆర్.శారద (కాంగ్రెస్), బి.రాజేశ్, డి.సుజాత (టీఆర్ఎస్), టి.వంశీకృష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్ (ఇండిపెండెంట్లు) జేసీని కలసి అవిశ్వాసం నోటీసు అందజేశారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం పాలకమండలిని సమావేశపర్చాలని వారు కోరారు. 29 మంది సభ్యులు అవిశ్వాసం నోటీస్‌పై సంతకాలు చేశారు. -
‘నాన్నా..నన్ను క్షమించు’
శ్రీనగర్ : కచిదూర ఎన్కౌంటర్లో మృతిచెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఎతిమాద్ హుసేన్ మాలిక్ సరిగ్గా ఎన్కౌంటర్ ముందు తన తండ్రికి చేసిన ఫోన్‌కాల్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రతా బలగాల చేతికి చిక్కడానికి కొద్ది నిమిషాల ముందు ఎతిమాద్ ఆరు నిమిషాల పాటు మాట్లాడాడు. ‘తప్పించుకోవడానికి మేము చాలా ప్రయత్నించాము. కానీ ప్రయోజనం లేకపోయింది. నన్ను క్షమించు నాన్నా’ అంటూ హుసేన్ తండ్రికి క్షమాపణలు చెప్పాడు. అయితే హుసేన్ మాటలు విన్న అతని తండ్రి స్పందించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘లొంగిపోవాలని నేను నిన్ను కోరడం లేదు. దేవుడు నాకు నిన్ను బహుమతిగా ఇచ్చాడు. నేను ఆయనకు తిరిగి ఇచ్చేస్తున్నాను. అల్లా నీకు మంచి చేయాలని ప్రార్థిసున్నాను’ అంటూ సంభాషణ ముగించాడు. ఆ సంభాషణ తాలుకూ ఆడియో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ఎమ్‌ఫిల్ పూర్తి చేసిన ఎతిహాద్ లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించే సమయంలోనే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అయితే ఈ విషయంపై స్పందించిన షోపియాన్ జిల్లా ఎస్ఎస్పీ మాట్లాడుతూ.. ఫోన్ సంభాషణలో ఉన్నది ఎతిహాద్ గొంతేనని ఇంకా నిర్దారణ కాలేదని తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులతో పాటు ముగ్గురు ఆర్మీ జవానులు కూడా మరణించిన విషయం తెలిసిందే. -
విజయ్ గురించి మామ - కోడలు ఫోన్ సంభాషణ
-
‘దేశం’లో లుకలుకలు!
పీవీ రమణను సస్పెండ్ చేయాలని పట్టణ పార్టీ తీర్మానం అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే నిర్ణయం ద్వితీయశ్రేణికి చెందిన ముగ్గురు నాయకుల ఫోను సంభాషణ బయటపడటమే కారణం ఒకరినే సస్పెండ్ చేయాలని తీర్మానించడంపై కార్యకర్తల అభ్యంతరం శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పీవీ రమణను సస్పెండ్ చేయాలని శ్రీకాకుళం పట్టణ పార్టీ తీర్మానం చేయడమే దీనికి కారణం. సస్పెండ్‌కు సంబంధించిన తీర్మానాన్ని అధినాయకుని దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన వెంట తీర్మాన ప్రతిని తీసుకువెళ్లడం చర్చనీయాంశమైంది. ఇటీవల పట్టణస్థాయి సమావేశం జరగ్గా.. దీనిపై ముగ్గురు నాయకులు ఫోన్లో చేసుకున్న సంభాషణ వాట్సాఫ్‌లో హల్చల్ చేసింది. పీవీ రమణ, గుమ్మా నాగరాజు, మావూరి శ్రీనివాసరావులు చేసుకున్న సంభాషణ జిల్లా వ్యాప్తంగా వాట్సాఫ్‌లో ప్రత్యేక్షమైంది. సమావేశంలో జామి భీమశంకర్ తనకు ఏయూ పాలకమండలి సభ్యునిగా నియమించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, ఇతర పార్టీల నుంచి ఎవరైనా టీడీపీలోకి రావాలని యోచిస్తే వారిని అడ్డుకునేలా పార్టీయే తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు మాదారపు వెంకటేష్ తనతో చెప్పినట్లు పీవీ రమణతో గుమ్మా నాగరాజు చెప్పినట్టు సమాచారం. ఇదే సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు.. మున్సిపల్ మాజీ చైర్మన్ వరంను గాని, వారి కుటుంబ సభ్యులనుగాని టీడీపీలోకి తీసుకువచ్చే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే భయపడుతున్నారని కూడా రమణతో నాగరాజు అన్నట్టు సమాచారం. ఏప్రిల్ మాసాంతంలో, మే మొదటి వారంలోగాని శ్రీకాకుళం నగరపాల సంస్థకు ఎన్నికలు జరుగుతాయని, ఈలోగా మున్సిపాలిటీకి మంజూరైన రూ. 28 కోట్లు ఖర్చు చేయాలని, పనులన్నీ పార్టీ కార్యకర్తలతోనే చేయించాలని నిశ్చయించినట్లు ఎమ్మెల్యే సమావేశంలో తెలిపారని కూడా రమణ దృష్టికి నాగరాజు తీసుకొచ్చారు. అయితే ఈ నిధులు మంజూరైనట్లు సమావేశం ముందురోజునే తాను మీ దృష్టికి తీసుకువచ్చాను కదా అని నాగరాజును రమణ ప్రశ్నిస్తూ తనకు ఈ విషయాన్ని మంత్రి ముందురోజే చెప్పారని రమణ అనడం కూడా ఆ సంభాషణలో ఉంది. దీనికి నాగరాజు బదులిస్తూ మంత్రి ప్రస్తావననే ఎమ్మెల్యే తీసుకురాలేదని, తానే మున్సిపల్ మంత్రి నారాయణను, ముఖ్యమంత్రిని అడిగి మంజూరు చేయించానని చెబుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కొందరు గ్యాంగ్‌గా తయారయ్యారని, అలాంటి వారిని పెట్టుకొని వెళితే నగరపాలకసంస్థ ఎన్నికల్లో గెలవడం కష్టమని కూడా నాగరాజు సంభాషణలో అభిప్రాయపడ్డారు. నాన్నకు ప్రేమతో తరహాలో కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి అమ్మకు ప్రేమతో అన్నట్లుగా పనిచేయాలని గ్యాంగ్ సభ్యులంతా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ కౌన్సిలర్ మావూరి శ్రీనివాసరావు.. రమణతో అన్నారు. నాగరాజు చెప్పిన వివరాలను కూడా ఆయన ధ్రువీకరించారు. ఇలా ముగ్గురి మధ్య సంభాషణ జరగ్గా పీవీ రమణను మాత్రమే సస్పెండ్ చేయాలని తీర్మానించడంపై కార్యకర్తలు అభ్యంతరం చెబుతున్నారు. సమావేశంలోని నాయకులు, కార్యకర్తలంతా ముగ్గురినీ సస్పెండ్ చేయాలని పట్టుబట్టగా, త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తన మాటను ఏ ఒక్కరూ కాదనవద్దని ఎమ్మెల్యే చెప్పినట్లు భోగట్టా. గుమ్మా నాగరాజు, మావూరి శ్రీనివాసరావులు ఎమ్మెల్యేకు అనుచరులు కావడం, తొలినుంచీ పీవీ రమణను ఎమ్మెల్యే దూరంగా ఉంచడమే ప్రస్తుత నిర్ణయానికి కారణమని టీడీపీలో చర్చ జరుగుతోంది. కారణమేదైనప్పటికీ సంభాషణలో ఎక్కువగా ఆరోపణలు చేసింది నాగరాజు, శ్రీనివాసరావులు కాగా రమణను సస్పెండ్ చేయడంపై టీడీపీలోని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో.. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఓ నాయకుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నానా దుర్భాషలాడటం, ఈ సంభాషణ కూడా అప్పట్లో రికార్డు చేసి సీడీల ద్వారా ప్రచారం జరగడాన్ని ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అటువంటి వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, ఓ సమావేశంపై ముగ్గురు చర్చించుకొని తమ అభిప్రాయాలను చెప్పుకుంటే ఒకరిని సస్పెండ్ చేయాలని తీర్మానం చేయించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. కాగా విషయాన్ని ఇప్పటివరకు పార్టీ జిల్లా నేతలు, మంత్రి, శాసనసభ్యుల దృష్టికి తీసుకురాకుండా తీర్మానం చేసి రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని నిశ్చయించడం పట్ల పలువురు నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. -
'అమ్మా.. నేను సూసైడ్ మిషన్‌లో ఉన్నాను'
చండీగఢ్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఓ టెర్రరిస్ట్ తన తల్లికి చేసిన కాల్ వివరాలు తెలిసి అధికారులు అశ్యర్యపోయారు. అర్థరాత్రి 1:58 గంటలకు వచ్చిన ఈ 70 సెకన్ల కాల్ రికార్డ్ వివరాలను అధికారులు సేకరించారు. అయితే, ఈ వివరాలపై స్పష్టత లేకపోవడంతోనే వైమానిక స్థావరంపై దాడులు జరగకుండా అప్రమత్తం కాలేకపోయినట్లు తెలుస్తోంది. టెర్రరిస్ట్ తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ.. 'నేను సూసైడ్ మిషన్‌లో ఉన్నాను. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు' అని చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అర్ధరాత్రి 12:30 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చిన కాల్స్ వివరాలను డీకోడ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులు ఫోన్లో పంజాబీ, ముల్తానీ భాషల్లో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. 87 సెకన్లపాటు జరిగిన ఓ కాల్ సంభాషణలో.. అంతా కంట్రోల్లో ఉందా అని ఓ వ్యక్తి అడగగా, అవును అని ఫోన్లో అవతలి వ్యక్తి సమాధానమిచ్చినట్లు గుర్తించారు. ఎయిర్ ఫోర్స్ ఆస్తులు, చాపర్స్, ఇతర విమానాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. శనివారం చోటుచేసుకున్న ఉగ్రదాడులు, భారత బలగాల ఎదురుకాల్పుల ఫలితంగా ముగ్గురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోగా, నలుగురు తీవ్రవాదులు హతమైన విషయం అందరికీ తెలిసిందే. -
జాగ్రత్తగా బ్రీఫ్ చేయాలి...
‘ఓటుకు కోట్లు’ సంఘటనలో ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ లాంటి పదాలు తరహా లాంటివి కాకుండా, కేంద్రంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇంగ్లీషు పదప్రయోగం ఎలాంటి పొరపాట్లు లేకుండా కరెక్ట్‌గా ఉండాలని ఇటీవల తరచూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తి విభజన హామీలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న ఈ తరుణంలో అధికార యంత్రాంగం కేంద్రానికి పంపే ప్రతిపాదనల్లో సరైన పదాలు, పరిభాష సరిగా ఉండాలని బాస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయట. ఎప్పుడూ లేనిది ఇదేందబ్బా.. అని ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. ఇంగ్లీషు పదప్రయోగానికి సంబంధించి తాజాగా జారీ అయిన ఓ ఆదేశాన్ని ఉటంకిస్తున్నారు. అదేంటంటే.. రాజధానికి ఉద్యోగుల తరలింపు అంశంలో ‘స్థానికత’ కు కేంద్రం సవరణలు చేయాల్సి ఉంది. స్థానికతపై కేంద్రం సవరణలు చేస్తే ఒక్క ఉద్యోగులకు మాత్రమే స్థానికత వర్తించదు. ఉద్యోగులతో పాటు ఏపీకే చెందిన తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకి ఈ ఉత్తర్వు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా సవరణకు సంబంధించి సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్రానికి సిఫారసు చేసేందుకు ఎలాంటి తప్పులు లేకుండా, స్థానికత ఒక్క ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వర్తింపచేసే అవకాశం ఉంటుందా? అన్న కోణంలో సమగ్ర పరిశీలన జరిపి, సరైన ఇంగ్లీషు పదాలు వాడాలని బాస్ నుంచి ఉన్నతాధికారులకు సూచనలు అందాయట. ఈ సూచనలు ఆసాంతం విన్న ఉన్నతాధికారులకు అసలు విషయం అప్పుడు అర్ధమైందట. ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ఇంగ్లీషు ప్రపంచానికి అర్ధమై బాగా పాపులారిటీ సంపాదించుకున్న దరిమిలా ఇప్పడాయన ఆదేశాలు సచివాలయంలోని ఉన్నతాధికారుల్లో పెద్ద చర్చకు దారితీసింది. -
ఫోన్లో చంద్రబాబు బిజీ బిజీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతూ బిజీబిజీగా గడిపారు. ‘ఓటుకు కోట్ల’ వ్యవహారం నేపథ్యంలో వీలు చిక్కినప్పుడల్లా ఏకాంతంగా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ముగిశాక నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. తిరుపతికి 4.30 గంటలకు చేరుకున్న తర్వాత ఖాళీ సమయంలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. సెనెట్ హాలు వద్ద బస్సు ఆగినా కూడా బాబు దిగకుండా ఫోన్ మంతనాలు సాగించారు. ప్రెస్‌మీట్‌ను సైతం బాబు పొడి పొడిగా అయిదు నిమిషాల్లోనే ముగించారు. మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ పక్కనే ఉన్నా వారిని కూడా పట్టించుకోకుండా ఫోన్ సంభాషణలోనే సీఎం కనిపించారు. టీడీపీ వర్గాలు కూడా దీనిపై ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. -
మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!
-
మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్, సంభాషణల రికార్డింగ్ ఘటనలు సృష్టించిన ప్రకంపనలు ఆగకముందే దాదాపు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంభాషణను ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త రికార్డ్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఇది గమనించిన మంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే జరిగిన ఈ ఘటనపై మంత్రి షాక్ తిన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీశైలం పాలక మండలిలో పార్టీకి చెందిన ఓ నేతకి అవకాశం కల్పించే విషయాన్ని మంత్రి మాణిక్యాల రావు కర్నూలు జిల్లా నేతలు, ఇతర కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఓ కార్యకర్త రహస్యంగా ఈ సంభాషణలను రికార్డు చేశాడన్న వార్త కలకలం రేపింది. -
ఎన్‌కౌంటర్‌పై పోలీసుల సంభాషణ!