Operation Moinabad Farmhouse: MLA Rohith Reddy And Swamiji Audio Viral - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల ఎపిసోడ్‌.. స్వామీజీ-రోహిత్‌ రెడ్డి సంభాషణ వైరల్‌

Published Fri, Oct 28 2022 1:32 PM | Last Updated on Fri, Oct 28 2022 2:55 PM

Operation Moinabad Farmhouse: MLA Rohith Reddy Swamiji Audio Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్‌ హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనలో తాజాగా ఓ ఆడియో బయటకొచ్చింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఫామ్‌హౌజ్‌ మీటింగ్‌కు ముందు రామచంద్రభారతితో రోహిత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. 

ఫోన్‌ సంభాషణ
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: నమస్తే స్వామీజీ ఎలా ఉన్నారు.
స్వామీజీ: బాగున్నాను. మీరెలా ఉన్నారు.
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: నేను బాగున్నాను.
స్వామీజీ: నందు మేము మాట్లాడుకున్నాము. మాకు కొన్ని వివరాలు చెప్తే సార్‌తో మాట్లాడతాను. ఇప్పటికే మాట్లాడాను
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: హా స్వామిజీ
స్వామీజీ: పేరు పంపితే బాగుంటుంది.
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి:పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టం. ఇప్పటికి ఇద్దరు కర్ఫర్మేషన్‌ ఇచ్చారు. కలిసి మాట్లాడితే బాగుంటుంది స్వామిజీ.
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: ప్రస్తుతం మేం ముగ్గురం రెడీగా ఉన్నాం.

స్వామీజీ: మీరు నెంబర్‌-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా 
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: నెంబర్‌ 2 ముందు పేర్లు చెబుతాను. ఈ విషయం బయటపడితే మా పని అయిపోతుంది
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దూకుడుగా ఉంటారు.
స్వామీజీ: నెంబర్‌-1, నెంబర్‌-2.. బీఎల్‌ సంతోష్‌ ఇంటికి వచ్చి అన్నింటిపై చర్చిస్తారు. బీఎల్‌ సంతోష్‌ మా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ.. ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు. ఏ నిర్ణయమైనా బీఎల్‌ సంతోషే తీసుకుంటారు.

స్వామీజీ: సంతోష్‌తో కలిసి మనం నెంబర్‌-2 దగ్గరకు వెళదాం. ఒకరిద్దరు ముందుగా వస్తే బాగుంటుంది.
స్వామీజీ:  24వ తేదీ వరకు నేను బెడ్‌ రెస్ట్‌లో ఉండాలి. తర్వాత నేను హైదరాబాద్‌ వస్తాను. వచ్చాక కూర్చొని మాట్లాడుకుందాం
స్వామీజీ: 25న గ్రహణం ఉంది కాబట్టి.. ఆ తర్వాత కలుద్దాం.
స్వామీజీ: 26 తర్వాత ఎక్కడైనా కలుద్దాం.. హైదరాబాద్‌లో మాత్రం వద్దు.
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: సమస్య ఏంటంటే స్వామీజీ, ప్రస్తుతం ఎలక్షన్‌ ఉంది కదా వాళ్లు మమ్మల్ని గమనిస్తున్నారు. సో హైదరాబాదే మంచి ప్లేస్‌.
స్వామీజీ: అలాగే, అలాగే హైదరాబాద్‌లోని ఏదో చోటికి వస్తాను. కలుద్దాం.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: స్వామిజీ మీరు క్లారిటీ తీసుకోండి.. నేను మరికొంత మందికోసం ప్రయత్నిస్తా..
స్వామీజీ: నేను డైరెక్టుగా బీఎల్‌ సంతోష్‌తోనే మాట్లాడతా.. మధ్యవర్తులు ఎవరూ లేరు
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: దయచేసి ఇదంతా టాప్‌సీక్రెట్‌గా పెట్టండి.. లేకపోతే నాపనైపోతుంది.
స్వామీజీ: ఏమైనా చిన్న తేడా వచ్చినా మేము కవర్‌ చేస్తాం. మేం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం.
స్వామీజీ: ఈడీ నుంచి ఐటీ వరకు, మీ భద్రతను కూడా మేముచూసుకుంటాం
స్వామీజీ: మీరంతా మా స్కానర్‌లో ఉన్నారు.. మీరేమి కంగారుపడొద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement