శ్రీనగర్ : కచిదూర ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఎతిమాద్ హుసేన్ మాలిక్ సరిగ్గా ఎన్‌కౌంటర్ ముందు తన తండ్రికి చేసిన ఫోన్‌కాల్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రతా బలగాల చేతికి చిక్కడానికి కొద్ది నిమిషాల ముందు ఎతిమాద్ ఆరు నిమిషాల పాటు మాట్లాడాడు. ‘తప్పించుకోవడానికి మేము చాలా ప్రయత్నించాము. కానీ ప్రయోజనం లేకపోయింది. నన్ను క్షమించు నాన్నా’ అంటూ హుసేన్ తండ్రికి క్షమాపణలు చెప్పాడు. అయితే హుసేన్ మాటలు విన్న అతని తండ్రి స్పందించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
‘లొంగిపోవాలని నేను నిన్ను కోరడం లేదు. దేవుడు నాకు నిన్ను బహుమతిగా ఇచ్చాడు. నేను ఆయనకు తిరిగి ఇచ్చేస్తున్నాను. అల్లా నీకు మంచి చేయాలని ప్రార్థిసున్నాను’ అంటూ సంభాషణ ముగించాడు. ఆ సంభాషణ తాలుకూ ఆడియో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ఎమ్‌ఫిల్ పూర్తి చేసిన ఎతిహాద్ లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించే సమయంలోనే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతనిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. అయితే ఈ విషయంపై స్పందించిన షోపియాన్ జిల్లా ఎస్‌ఎస్‌పీ మాట్లాడుతూ.. ఫోన్ సంభాషణలో ఉన్నది ఎతిహాద్ గొంతేనని ఇంకా నిర్దారణ కాలేదని తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులతో పాటు ముగ్గురు ఆర్మీ జవానులు కూడా మరణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment