
ఎస్వీయూ సమీపంలో బస్సులో ఫోన్లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతూ బిజీబిజీగా గడిపారు. ‘ఓటుకు కోట్ల’ వ్యవహారం నేపథ్యంలో వీలు చిక్కినప్పుడల్లా ఏకాంతంగా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ముగిశాక నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. తిరుపతికి 4.30 గంటలకు చేరుకున్న తర్వాత ఖాళీ సమయంలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. సెనెట్ హాలు వద్ద బస్సు ఆగినా కూడా బాబు దిగకుండా ఫోన్ మంతనాలు సాగించారు.
ప్రెస్‌మీట్‌ను సైతం బాబు పొడి పొడిగా అయిదు నిమిషాల్లోనే ముగించారు. మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ పక్కనే ఉన్నా వారిని కూడా పట్టించుకోకుండా ఫోన్ సంభాషణలోనే సీఎం కనిపించారు. టీడీపీ వర్గాలు కూడా దీనిపై ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది.