భర్త మృతిపై భార్య అనుమానం
కశింకోట, న్యూస్‌లైన్: భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్థంతరంగా శవదహనాన్ని నిలిపి వేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసింగబిల్లికి చెందిన కోన నూకినాయుడు(70) మాణిక్యం దంపతులు. స్పర్ధలు రావడంతో భర్తతో విడిపోయి మాణిక్యం దూరంగా ఉంటోంది. దీంతో నూకినాయుడు ఏకైక కుమార్తె సత్యవేణిని పెంచి, పెళ్లి చేశారు. అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 2011లో పక్షవాతం వచ్చి నూకినాయుడు మంచాన పడటంతో తన పేరున ఉన్న ఎకరం భూమిని కుమార్తె పేరున రాసిచ్చారు. విషయం తెలియడంతో భార్య కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో నూకునాయుడు శనివారం మృతి చెందారు. దహనసంస్కారాలకు తీసుకెళుతుండగా శవాన్ని చూపాలని మాణిక్యం అడ్డుకోగా ఇది సంప్రదాయం కాదంటూ బంధువులు దహనసంస్కారాలు జరిపించారు. దీంతో భర్త మృతిపై అనుమానాలున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ కె.రమామణి ఆధ్వర్యంలో కాలుతున్న శవాన్ని నీటితో ఆర్పించి, పోస్టుమార్టం నిర్వహించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు.
అర్ధంతరంగా శవదహనం నిలిపివేత
Published Sun, Jan 26 2014 3:09 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM
Advertisement
Advertisement