వర్షాల కోసం పూజలు చేయండి
రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇంకేముంది, వర్షాలు పడతాయని రైతన్నలు ఎంతగా ఎదురు చూసినా చుక్క వర్షం కూడా కురవలేదు. దీంతో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 19, 20, 21 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో వరుణ జపాలు, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికారులకు ఆదేశాలిచ్చారు.
కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండటం, ఎండలు మండిపోతూ వడదెబ్బకు పలువురు మృత్యువాత పడుతుండటంతో వర్షాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాలుగు వర్షపు చినుకులు ఎప్పుడు పడతాయో, వాతావరణం ఎప్పటికి చల్లబడుతుందోనని జనం అల్లాడిపోతున్నారు. మళ్లీ వర్షాలు పడని రోజులు వచ్చేశాయంటూ వాపోతున్నారు.