
సాక్షి, అమరావతి : రాజ్యసభలో మొదట హోదా గళం వినిపించింది వెంకయ్యనాయుడేనని, చంద్రబాబు అప్పుడు నోరుమెదపలేదని మంత్రి పదవికి రాజీనామా చేసిన మాణిక్యాలరావు అన్నారు. ఏపీకి అండగా నిలవాలన్న తమ పార్టీని దోషిగా చూపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విభజన ద్వారానే రాష్ట్రానికి మేలు జరిగిందన్నారు.
బీజేపీని నిందిస్తూ టీడీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొడతామని చెప్పారు. తాను మంత్రి అయ్యేందుకు వెంకయ్యనాయుడే కారణమని అన్నారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నందుకే తాము రాజీనామా చేశామని చెప్పారు.మంత్రిగా తాను అవినీతికి తావివ్వలేదని తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హోదాకు దీటుగా ప్యాకేజితో ఏపీని ఆదుకునేందుకు బీజేపీ ముందుకొచ్చిందన్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ సహకరిస్తారని చెప్పుకొచ్చారు. మంత్రి పదవికి రాజీనామా చేసినా తన నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment