నరసాపురం: ‘రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని సీఎం చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదంటూ ఆయన ఎందుకు వ్యాఖ్యానించారో అర్థం కావడం లేదు’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అంత్య పుష్కరాల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.