కృష్ణమ్మకు మంత్రి మాణిక్యాలరావు పూజలు
కోడూరు :
హంసలదీవి సమీపంలోని పవిత్ర కృష్ణా సాగర సంగమ ప్రాంతం వద్ద రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సాగర సంగమాన్ని దర్శించడం పూర్వ జన్మ సుకృతమని మంత్రి అన్నారు. నదీమ తల్లికి పసుపు, కుంకుమతో పాటు నూతన వస్త్రాలు సమర్పించారు. రైస్‌మిలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు.
పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేశాం
విజయవాడ(వన్‌టౌన్) : పుష్కరాలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసిందని దేవాదాయ ధర్మాదాయ శా మంత్రి పీ మాణిక్యాలరావు అన్నారు. పుష్కరాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆయన దుర్గాఘాట్‌ను పరిశీలించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడు తూ నీటిలో ఎటువంటి బ్యాక్టిరీయా లేదని అది కేవలం పుకారు మాత్రమేనన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు.