త్వరలో దేవాదాయ శాఖకు వెబ్‌సైట్‌ | website for endoment ministry soon | Sakshi
Sakshi News home page

త్వరలో దేవాదాయ శాఖకు వెబ్‌సైట్‌

Published Wed, Apr 12 2017 12:48 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM

website for endoment ministry soon

గుంతకల్లు రూరల్‌: దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్‌సైట్‌ను రూపొం దించి, ఆలయాల సమగ్ర సమాచారాన్ని అందులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. కర్ణాటకలోని సింధనూరులో జరిగిన బీజేపీ సమావేశాలకు హాజరైన ఆయన తిరిగి విజయవాడకు వెళ్తూ మంగళవారం సాయంత్రం గుంతకల్లులోని రైల్వే కోజీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆలయాల నిర్వహణ, ఆదాయ, వ్యయాలు, ఉద్యోగుల పనితీరు,  సీసీ కెమెరాల నిఘా విభాగం, తదితర వివరాలతో కూడిన సమగ్ర సమాచారం నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా త్వరలో ఒక వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆలయాల్లో భక్తుల సంఖ్య ఆధారంగా  ఏసీ క్యాడర్‌లో ఉన్న ఆలయాలను డీసీ క్యాడర్‌లోకి, అదేవిధంగా డీసీ క్యాడర్‌లో ఉన్న ఆలయాలను ఆర్జేసీ క్యాడర్‌లోకి మారుస్తామని చెప్పారు. కసాపురం దేవస్థానానికి త్వరలోనే టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement