నిరుపేదలకు అండగా ప్రభుత్వం
దిలావర్పూర్(నిర్మల్): ఆడపిల్లల వివాహానికి ఆర్థికసాయం అందిస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్డీవో ప్రసూనాంబా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆడపిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయా లని సూచించారు.
18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రిని రైతులు సన్మానించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పాల్దె లక్ష్మి, సర్పంచ్ నంద అనిల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మండల కన్వీనర్ రాజేశ్వర్, నాయకులు రమణారెడ్డి, సంభాజీరావు, నర్సారెడ్డి, రేఖ, కవిత, రవి, నర్సయ్య, భూమన్న, మనేశ్, సుధాకర్‌రెడ్డి, గుణవంత్‌రావు, అనిల్, గంగారాం, భుజంగ్‌రావు, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.