![ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51404888474_625x300.jpg.webp?itok=PrjaJxOC)
ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం!
కడప : నెల రోజుల్లో తిరుమలలో సామాన్య భక్తుడు రెండు గంటల్లో స్వామివారిని దర్శించుకునేలా చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆయన బుధవారం వైఎస్ఆర్ జిల్లాలో దేవుని కడప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సత్వర దర్శనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే భూకబ్జాకు గురైన దేవాలయ భూముల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.