endowment lands
-
చంద్రబాబు దురాక్రమణ.. 30 ఎకరాల దేవాదాయ భూములపై కన్ను
-
దేవాలయాలకు మహర్దశ
-
'దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీడీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయినా పట్టించుకోలేదు. కొన్ని మఠాలలో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోలేదు. ధార్మిక పరిషత్‌కి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం. అందుకే 21 మందితో ధార్మిక పరిషత్‌ని ఏర్పాటు చేశాము. సీజీఎఫ్ కమిటీని పూర్తిస్థాయిలో నియమించాం. గతంలో నలుగురు మాత్రమే ఉన్నారు. అందులో మరో ముగ్గురిని చేర్చాం. కలికి కోదండరామిరెడ్డి, మలిరెడ్డి వెంకటపాపారావు, కర్రి భాస్కరరావులను సభ్యులుగా నియమించాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ కమిటీలను నియమించాం. చదవండి: (21 మందితో ధార్మిక పరిషత్) కనీసం గ్రామానికి ఒక దేవాలయానికి దూప, దీప నైవేధ్యం పథకం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని జిల్లాల అధికారులకు దరఖాస్తులను పరిశీలించాలని కోరాం. దీని ద్వారా ప్రతి గ్రామంలో హిందూ దేవాలయలను పరిరక్షించే బాధ్యతను తీసుకున్నాం. ట్రిబ్యునల్ కేసులకు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయాలకు 4లక్షల 9వేల ఎకరాల భూములున్నాయి. వాటిలో కొన్ని ఆక్రమణలో ఉన్నాయి. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని' మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్) -
ప్రక్షాళన : కేసీఆర్ మరో కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూశాఖ ప్రక్షళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం (రేపటి) నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. ఆలయ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభ్యులు చేసిన సూచనలకు, ప్రశ్నలకు సీఎం స్వయంగా సమాధానం చెప్పారు. (అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ !) తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టం రెవెన్యూ సంస్కరణలో తొలి అడుగు మాత్రమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పీటముడి పడి పరిష్కారం దొరకని అనేక సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. పలు చట్టాల సమూహారంగా కొత్త రెవెన్యూ చట్టం కొనసాగుతుందని పేర్కొన్నారు. సమైఖ్య రాష్ట్రంలో 160కి పైగా చట్టాలు ఉండేవని, తెలంగాణలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నామని వెల్లడించారు. ధరణి ఒక్కటే కాదనీ, మిగిలిన చట్టాలు కూడా అందుబాటులో ఉంటాయని సభలో సీఎం వివరించారు. రెవెన్యూ కోర్టుల్లో 16వేల కేసులు, హైకోర్టులో 2వేల కేసులు ఉన్నాయని, సమగ్ర సర్వే చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 57 లక్షల 90 వేలమంది రైతులకు రైతుబంధు సాయం అందించామన్నారు. కేవలం 28 గంటల్లో రూ. 7,200 కోట్లు రైతులకు అందించగలిగామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. గ్రామాల్లో ఎవరి జీవితం వారే సాగిస్తున్నారు. గ్రామాల్లో వివాదంలో ఉన్న భూములు చాలా తక్కువ అని సీఎం కేసీఆర్ అన్నారు. -
త్వరలోనే పాసుపుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయ భూములకు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ అధికారులు గుర్తించిన భూములకు ఆయా దేవాలయాల మీదే పాసుపుస్తకాలివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు సమీకృత భూరికార్డుల నిర్వహణ (ఐఎల్‌ఎంఆర్‌ఎస్) వెబ్సైట్లో ఆ భూములకు డిజిటల్ సంతకాలు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు మ్యాపింగ్ చేసిన సర్వే నంబర్లకు తహసీల్దార్ల లాగిన్ల ద్వారా డిజిటల్ సంతకాలు చేయాలని, ఈ సంతకాలు పూర్తయిన భూములకు పట్టాదారు పాసుపుస్తకం కమ్ టైటిల్‌డీడ్ ఇస్తామని సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం క్షేత్రస్థాయి రెవెన్యూ వర్గాలకు సమాచారం పంపింది. దేవాదాయ భూములకు పాసు పుస్తకాలివ్వడంతో పాటు ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను కూడా పరిష్కరించే విధంగా అదనపు ఆప్షన్లు ఇచి్చంది. దీంతో పెండింగ్ సమస్యలకు పరిష్కా రం లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
అక్కడంతా.. మామూలే
తిరుపతి సర్వే నంబర్ 212/2లో దేవదాయశాఖ భూమి ఉంది. ఆ భూమి క్రయ విక్రయాలకు నిషిద్ధం. అదే భూమిని ఏకంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘనత తిరుపతి అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి దక్కింది. దస్తావేజు నంబర్ 3329/2019లో భాగపరిష్కార దస్తావేజుకు ఏకంగా రిజిస్ట్రేషన్ కల్పించారు. స్వయార్జిత ఆస్తులు భాగపరిష్కారం చేయరాదు. సెటిల్మెంటు దస్తావేజుకు మాత్రమే అనుమతించాలి. ఏకంగా భాగపరిష్కార అగ్రిమెంటుకు రిజిస్ట్రేషన్ కల్పించారు. దస్తావేజు నంబర్ 3438/2019లో రిజిస్ట్రేషన్ శాఖ యంత్రాంగం చేతివాటం ప్రదర్శించి, ప్రజాధనానికి పోగు కావాల్సిన స్టాంప్ డ్యూటీకి ఎగనామం పెట్టింది. ఇలాంటి అక్రమాలు ఇక్కడ చాలా చోటుచేసుకున్నాయి. సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాల ఘటనలు అనేకం ఉన్నాయి. నిత్యం సరాసరి 20 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించే తీరిక, ఓపిక అక్కడి యంత్రాంగానికి లేక కాదు, చేతులు బరువెక్కితే ‘నందిని..పంది, పందిని..నంది’ చేయగల సమర్థులు అక్కడ ఉండడంతో ఏకంగా దేవదాయశాఖ, ప్రభుత్వ భూములు పరులపాలవున్నాయి. పరిధి తక్కువ.. పైరవీలు ఎక్కువ తిరుపతి అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధి చాలా తక్కువ. తిరుపతి రూరల్, అర్బన్ రెండింటికి కలిపి ఒకే కార్యాలయం ఉండగా, 2007లో అర్బన్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. కాగా తిరుపతిలో భూములకు భారీ డిమాండ్ ఉండడంతో అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ, మఠం భూములు అధికంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయ యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తోంది. నిత్యం పైరవీలతో కార్యాలయం కళకళలాడుతూ ఉంటుంది. అంతర్గత సెటిల్మెంటు తర్వాతే తుది నిర్ణయం వెలువడుతోంది. పైన పేర్కొన్న రెండు రిజిస్ట్రేషన్లు కూడా ఆ క్రమంలో భాగంగా చోటుచేసుకున్నవే. కార్యాలయంలో డాక్యుమెంటు అనుమతి పెట్టుకున్న తర్వాత నెల రోజులకు రిజిస్ట్రేషన్ చేశారు. పెద్ద ఎత్తున చేతులు మారడంతోనే ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెలకు సరాసరిగా 600 రిజిస్ట్రేషన్లు ఉంటున్నా, అంతర్గత ఒప్పందాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భారీ స్థాయిలో స్థలాలకు ధరలు ఉండడంతో అక్రమార్కులు డాక్యుమెంట్లకు లింకు డాక్యుమెంట్లు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయం సంపూర్ణ సహకారం అందిస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్ కారణంగానే కోర్టులో అనేక సివిల్ కేసులు ఉత్పన్నమవుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. ఒకరు చేసే తప్పు ఒకరి తర్వాత ఇంకొకరు ఎత్తిపోసుకోవాల్సిన దుర్గతిని రిజిస్ట్రేషన్ కార్యాలయం కల్పిస్తోందని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
దేవుడి భూములతోనూ రాజకీయాలు
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గరపడేసరికి టీడీపీ ప్రభుత్వం దేవుడి భూములతోనూ రాజకీయం మొదలెట్టింది. ఓట్లకోసం ఏకంగా 30 వేల ఎకరాల దేవుడి భూములను ఎరగా వేస్తోంది. ఇందుకోసం హైకోర్టు ఆంక్షల్ని సైతం లెక్కచేయడం లేదు. ఆలయాల బాగోగుల కోసం ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితిలో దేముడి భూములు అమ్మాల్సి వస్తే ప్రభుత్వం హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా బహిరంగవేలంలో మాత్రమే వాటిని అమ్మాలంటూ హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల వల్లే ఇంతకాలం వీటి క్రమబద్ధీకరణ జరగలేదు. అంతకుముందు ప్రభుత్వాలు క్రమబద్ధీకరణకు అంగీకారం తెలిపినా హైకోర్టు వాటిని పెండింగ్‌లో పెట్టేసింది. ఇలా ఆమోదం తెలుపుకుంటూ పోతే రాష్ట్రంలో దేవుడి భూమి కింద ఒక్క ఎకరా కూడా మిగలదన్నది హైకోర్టు అభిప్రాయం. అయితే.. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని సింహాచలం భూములను ఓటర్లకు ఎరగా వేస్తోంది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి పోటీ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఆంక్షల వల్ల ఈ నిర్ణయాలు చెల్లుబాటు కావని.. కేవలం ఓటర్లను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందంటూ అధికారులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పుష్పగిరి పీఠం భూములూ వదల్లేదు.. కడపకు చెందిన పుష్పగిరి పీఠానికి నరసరావుపేట నియోజకవర్గం లింగంగుంట్లలోనూ, చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోనూ రెండు వేల ఎకరాలున్నాయి. లింగంగుంట్లలోని పుష్పగిరి పీఠం భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తానని.. లబ్ధిపొందిన వారంతా 2019 ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని కోడెల శివప్రసాదరావు అక్కడి స్థానిక పెద్దలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి కోడెల శివప్రసాదరావు గతంలో అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ అనురాధతో సమావేశాలు నిర్వహించగా, ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అంగీకరించవని ఆమె తేల్చిచెప్పారు. ఎన్నికలు ముంచుకొచ్చేసరికి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంతో సంబంధం లేకుండా జీవో విడుదల చేయించారు. ఇప్పటికే సింహాచలం భూముల్లోని అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణ అంశం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు లింగంగుంట్ల భూములను హైకోర్టు అనుమతి తీసుకొని క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే ఇందుకు హైకోర్టు అనుమతిచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. సీఎం సన్నిహితుని కోసం 490 ఎకరాలు ఎర... చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినందున.. ఎలాగైనా ఆయన్ను గెలిపించేందుకు టీడీపీ ప్రభుత్వం దేవుడి భూములను ఎర వేస్తోంది. భీమిలితోపాటు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని రూ.2,232 కోట్ల విలువైన దాదాపు 490 ఎకరాల సింహాచలం భూముల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విశాఖ జిల్లా సింహాచలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ భూముల్లో 12,149 మంది ఇళ్లు నిర్మించుకోగా.. వాటిని క్రమబద్ధీకరించేందుకు 2008లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ముందుకురాగా.. కోర్టు ఆంక్షల వల్ల అది ఆగిపోయింది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకొని హైకోర్టు అనుమతి కోరగా.. న్యాయస్థానం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. దేవుడి భూములను ఇతరులకు కట్టబెట్టే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ 1987లో చేసిన చట్టం చెల్లదంటూ హైకోర్టు 2005లో స్పష్టం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే అధికారాన్ని శాసనసభ ద్వారా ప్రభుత్వానికి కల్పించుకుంటూ సింహాచలం భూముల క్రమబద్ధీకరణకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గత ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం చెల్లుబాటు కాదని అధికారులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం ఆయా భూములు అనుభవిస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని చూస్తోందని.. భవిష్యత్‌లో దీనిపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వారంతా ఆర్థికంగా నష్టపోతారని వారు అభిప్రాయపడుతున్నారు. -
184 ఎకరాల దేవుడి భూములు అన్యాక్రాంతమా?
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో ఉన్న 308, 332, 333 సర్వే నంబర్లలోని 184 ఎకరాల దేవాదాయ భూమి అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భూమిని ప్లాట్లుగా చేసి స్థానిక నేతలు విక్రయిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం పేటలోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి ఉన్న 184 ఎకరాల భూమి ని కొలన్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని దేవస్థానం కమిటీ, స్థానిక సర్పంచ్, స్థానిక నేతలు కలసి ప్లాట్లు వేసి అమ్మేసి కోట్ల రూపాయలు గడించారంటూ కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌కు చెందిన అరుంధతమ్మ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన న్యాయమూర్తుల పిల్ కమిటీ దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని సిఫారసు చేసింది. దీంతో ఏసీజే ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా మలచింది. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. -
పెద్దపల్లి దేవాదాయ భూముల వివాదం
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో నెలకొన్న దేవాదాయ భూముల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మండలం కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం గ్రామాలకు చెందిన 462 ఎకరాల భూమి విషయంలో నెలకొన్న వివాదాన్ని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ భూమిలో గ్రామాలు వెలిశాయని, రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, రోడ్లు, స్కూళ్లు తదితర నిర్మాణాలు కూడా వెలిసాయని ఎమ్మెల్యే చెప్పారు. అయితే, 1950కి ముందు ఇవన్నీ దేవాదాయశాఖ పరిధిలోని భూములుగా అధికారిక రికార్డుల్లో ఉంది. ఇటీవల జరిగిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఈ గ్రామాల్లో పర్యటించిన అధికారులు కూడా ఎవరు హక్కు దారులనేది తేల్చలేకపోయారు. కాస్తులో ఆయా గ్రామాల రైతులున్నారు. ఇండ్లు, స్కూళ్లు, ఇతర నిర్మాణాలున్నాయి. కానీ రికార్డుల్లో మాత్రం దేవుడి మాన్యాలుగా నమోదయ్యాయి. దీంతో అధికారులు ఈ వివాదాన్ని అప్పటికప్పుడు పరిష్కరించలేకపోయారు. పార్టు బి కింద చేపట్టడం కోసం పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఈ గ్రామాల రైతులకు యాజమాన్య హక్కులు రావడం లేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. దశాబ్దాలుగా రైతులు ఈ భూములు సాగు చేçసుకుంటున్నారని, కాస్తు లో వారే ఉన్నారని, యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని, కాస్తులో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలని ఆదేశించారు. -
ఆలయ భూములకు రక్షణ ఏదీ?
-
ఆలయ భూములకు రక్షణ ఏదీ?
అమరావతి: రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాలకు గురవుతున్నాయని అసెంబ్లీలో మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఆయన మాట్లాడారు. రాజకీయ నేతలు, ప్రైవేటు వ్యక్తులు దేవాలయ భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీటి పరిరక్షణకు బడ్జెట్లో నిధులు సరిగా కేటాయించడం లేదని, ఇలా అయితే వాటి పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గారికి దేవాదాయ ఆస్తులను కాపాడలనే చిత్తశుద్ధి ఉంటే వాటి పరిరక్షణకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. -
‘అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్’
-
‘అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్’
అమరావతి: దేవాదాయ భూములను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ. 70 కోట్లు విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థకు కారు చౌకగా ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఎకరా లక్షన్నరకు లీజుకు రాటిఫై చేయడం ధర్మమేనా అని అడిగారు. 2006లో ప్రభుత్వం లీజును రద్దు చేసిందని, దీన్ని 2010లో హైకోర్టు సమర్థించిందని వెల్లడించారు. 10 శాతం మార్కెట్ విలువ ప్రకారం ఇస్తే లీజుకు ఇస్తే ఫర్వాలేదన్నారు. ఎకరా రూ. 7 కోట్లకు లీజుకు ఇస్తే ఆక్షేపణ ఉండదని చెప్పారు. సదావర్తి భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇదే వ్యవహరించిందని ఆరోపించారు. అన్యాక్రాంతం కాని 83 ఎకరాల భూములను ఎకరా రూ. 22 లక్షలకు అమ్మేసిందని దుయ్యబట్టారు. మార్కెట్ ధర రూ. 7 కోట్లు ఉంటే రూ. 22 లక్షలకు అమ్మడం సరికాదని దేవాదాయ ప్రాంతీయ కమిషనర్ రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. సదావర్తి భూములను అప్పనంగా కట్టబెట్టడంపై కోర్టును ఆశ్రయిస్తే విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ఎకరాకు రూ. 22 లక్షల కంటే ఎక్కువ ఇస్తే రిజిస్ట్రేషన్ చేయబోమని, సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తామని టీడీపీ సర్కారు చెప్పింది. అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్ అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. సదావర్తి భూముల పాపం కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుందని వైఎస్ జగన్ అన్నారు. -
దేవాదాయ భూముల రక్షణకు చర్యలు
దేవాదాయ శాఖ ప్రత్యేక భూసంరక్షణ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి జిన్నారం: బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రత్యేక భూసంరక్షణ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బొంతపల్లి గ్రామంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిదేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదుపై ఆయన గురువారం ఇక్కడకు వచ్చి విచారణ చేపట్టారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణప్రసాద్, జిన్నారం తహసీల్దార్ శివకుమార్ సమక్షంలో వివరాలను సేకరించారు. దేవాలయ పరిధిలోని సర్వే నంబర్లు, అందులోని భూమి వివరాలను తెలుసుకున్నారు. దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని స్థానిక నాయకులు గిద్దెరాజు, తదితరులు శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయం పరిధిలో ఉన్న భూమిని సర్వే చేయిస్తామన్నారు. -
దేవదాయ భూములను స్వాధీనం చేసుకుంటాం
దేవాదాయ ధర్మదాయ గెజిటెడ్ అధికారి విజయరాజు శ్రీకాకుళం(ఘంటసాల): అన్యాక్రాంతమైన∙దేవదాయ, ధర్మదాయశాఖల పరిధిలోని ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయాశాఖల అధికారి మేడిపల్లిల విజయరాజు తెలపారు. ఆదివారం ఆయన కృష్ణాపుష్కరాల సందర్భంగా శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయ భూములు 4.53 లక్షల ఎకరాలు ఉన్నాయని వాటిలో 80 వేల ఎకరాలు అక్రమణలకు గురైనట్లు తెలిపారు. అక్రమణలకు గురైన స్థలాల్లో ఉన్న వారికి దేవదాయ యాక్టు ప్రకారం నోటీసులు అందించి తిరిగి వాటిని స్వాదీనం చేసుకుంటామన్నారు. అనంతరం ఆయన్ను ఆలయాధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు సుధాకర్, సురేష్, విజయరాజులు ఉన్నారు. -
దేవా.. ఇదేం న్యాయం
► దశాబ్దాలుగా రైతుల సాగులో 274 ఎకరాలు ►ఇనాం భూములుగా గుర్తించి గతంలో హైకోర్టు తీర్పు ► రైతుల పేరిట పాసుపుస్తకాలు కూడా మంజూరు ► ఇప్పుడేమో ఎండోమెంట్ భూములుగా రికార్డుల్లో మార్పు ► కౌలు వేలానికి దేవాదాయ శాఖ సిద్ధం.. రైతుల గగ్గోలు ► మూడు గ్రామాల్లో 274 ఎకరాల్లో సాగులో ఉన్న 200 రైతుల్లో ఆందోళన ► రికార్డుల్లో మార్పులు చేయడం తగదంటున్న రైతులు ఇంతకాలం అన్నం పెట్టిన భూములు దూరం కానుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాలుగా తమ సాగులో ఉంటున్న భూములు అసలు మీవికాదని అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంతవరకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఆ భూములను ఇప్పుడు ఎండోమెంట్ శాఖవిగా గుర్తించడంతో వాటిని వదులు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కె.కోటపాడు : మండలంలోని చౌడువాడ, పాచిలవానిపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో సుమారు 200 మంది రైతుల సాగులో 274 ఎకరాల భూమి ఉంది. గత ఏడాది నవంబర్ 30 వరకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఈ పంట పొలాలను ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎండోమెంట్ భూములుగా నమోదు చేశారు. ఈ మేరకు ఆన్లైన్ పనులు పూర్తి అయ్యాయి. మరో వైపు ఈ భూములకు ఎండోమెంట్ శాఖ వారు మూడేళ్ల కాలానికి కౌలును నిర్దేశించేందుకు గ్రామాల్లో వేలం పాటలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. ఎండోమెంట్ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 10న జీవో నంబర్ 343 జారీ చేసింది. దీని ప్రకారం ఈ మూడు గ్రామాల్లో శ్రీరాజా చింతలపాటి బుచ్చిసీతయ్యమ్మ బహద్దూర్ పేరున ఉన్న పొలాలను రెవెన్యూ అధికారులు శ్రీరాజా చింతలపాటి బుచ్చిసీతయ్యమ్మ సత్రం పేరున ఆన్లైన్ పనులు పూర్తిచేశారు. దీంతో ఆయా భూములు సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 60 ఏళ్లకు పైబడి సాగులో ఉన్న భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఎంటువంటి సమాచారం లేకుండా భూములను ఎండోమెంట్ వారి పేరుతో రికార్డుల్లో ఎలా మార్పు చేస్తారని రైతులు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. 1959 నుండి వివాదం చౌడువాడ, పాచిలవానిపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో ఉన్న 274 ఎకరాల భూములపై 1959 నుండి వివాదం నడుస్తోంది. 1959లో అప్పటి తహసీల్దార్ ఈ భూములు ఎండోమెంట్వి కాదని ఇనాంవని గుర్తించారు. దాని ఆధారంగా 1989లో అప్పటి ఆర్డీవో ఇనాం భూమిగా గెజిట్‌లో ప్రకటించారు. అయితే 1991లో భూములపై పునర్విచారణ చేయాలని డీఆర్వో ఆదేశించడంతో రైతులు హైకోర్డును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్డు 1994లో ఈ భూములను రైత్వారీ జమిందారి, ఇనాం విలేజ్‌గా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో అదే ఏడాది రెవెన్యూ అధికారులు ఈ భూములకు సంబంధించి కొంత మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఈ పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు మళ్లీ ఎండోమెంట్ భూమిగా మార్చడంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రజా ప్రతినిధులు, అధికారులు తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. హైకోర్టు రైతుల వాదననే సమర్థించింది గతంలో హైకోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించాం. ప్రస్తుతం మా సాగులో ఉన్న భూములను ఇనాం భూములుగా గుర్తించి కోర్టు తీర్పు చెప్పింది. కొందరు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఆ భూములను ఇప్పుడు ఎండోమెంటులిగా రికార్డుల్లో మార్పు చేయడం దారుణం. - పాచిల మహలక్ష్మి, రైతు, పాచిలవానిపాలెం మా కుటుంబాలు రోడ్డున పడతాయి పాచిలవానిపాలెం, చౌడువాడ, గరుగుబిల్లి గ్రామాల్లో ఇనాం భూములపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇనాం భూములకు రైత్వారీ పట్టాల కోసం రైతులు దరఖాస్తులు చేశారు. ఇనాం భూములుగా నమోదై ఉన్న భూములను ఇటీవల ఎండోమెంట్ భూములుగా నమోదు చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి - రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, చౌడువాడ -
‘రికార్డు’స్థాయిలో మాయ !
పైడితల్లి అయినా....పైడమ్మ అయినా అన్నీ ఆ అమ్మపేర్లే అనుకున్నారో ఏమో...ఏ పేరుతో రికార్డులుంటే ఏమవుతుందని భావించారో ఏమో తెలియదు గాని సుమారు రూ. 3 కోట్ల విలువైన భూమి రెవెన్యూ రికార్డుల్లో పైడితల్లి అమ్మవారి పేరుమీద నమోదై ఉండగా, ఓ టీడీపీ కౌన్సిలర్ తల్లి అయిన పైడమ్మ పేరుమీద అడంగల్‌లో నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ : దేవాదాయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయా? వ్యూహాత్మకంగా కోట్లాది రూపాయల విలువైన భూమి చేతులు మారిపోతున్నాయా?.... అంటే, వీటీ అగ్రహారంలో గల 1.70 ఎకరాల భూమి వ్యవహారాన్ని చూస్తే ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ శివారుల్లో గల దేవదాయశాఖ భూములకు రక్షణ కరువైంది. జిల్లా కేంద్రం కావటం... రోజు రోజుకు భూముల విలువ పెరిగిపోవడంతో గుళ్లు, బడులు, శ్మశానాలు ఇలా వేటినీ వదలకుండా కబ్జాచేసేస్తున్నారు. ఇదే తరహాలో స్థానిక 24వ వార్డు పరిధిలో గల వి.టి.అగ్రహారంలో కొలువుదీరిన పైడితల్మమ్మవారి పేరుపై ఉన్న 1.70 ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ మొత్తం భూమి విలువ సుమారు రూ. 3 కోట్ల పైమాటే. ఈ ప్రాంతంలో సర్వే నంబర్ 153/1లో గల 1.70 ఎకరాల భూమిని గతంలో కొందరు అమ్మవారి ఆలయానికి అందజేశారని స్థానికులు తెలిపారు. ఈ భూమిని సాగు చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో అమ్మవారి ధూప, దీప , నైవేద్యాలు జరుగుతూ ఉండేవి. ఇంతటి విలువైన భూమిపై కన్నేసిన కబ్జాదారులు ఈ ఏడాది ఆరంభంలో భూమి హద్దుల గుండా ఉన్న తాటి చెట్లను తొలగించేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే రియల్టర్లు అమ్మవారికి చెందిన సుమారు ఆరు సెంట్ల స్థలం గుండా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత జరిగినప్పటికీ దేవదాయ శాఖ అధికారులు కనీసం స్పందించలేదు. స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా.. పరిశీలన జరిపి తూతూమంత్రంగా రోడ్డుకు ఇరువైపులా వేసిన కాల్వలను తొలగించి వదిలేశారు. ఈ సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమ్మవారి భూమిని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ రొంగలి రామారావు జోక్యం ఉండంతోనే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో అమ్మవారి పేరు... అడంగల్ కాపీపై వేరే పేరు వి.టి.అగ్రహారం పైడితల్లమ్మవారికి చెందిన 1.70 ఎకరాల భూమి ఇప్పుడు ఎవరి పేరుపై ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రికార్డులో సదరు భూమి అమ్మవారి పేరుపై ఉండగా.. మీసేవా ఇటీవల జారీ చేసిన అడంగల్ కాపీలో మాత్రం రొంగలి పైడిమ్మ పేరు ఉంది. దేవాదాయ శాఖ భూమే... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ పుష్పనాథంను వివరణ కోరగా...అది అమ్మవారి ఆలయానికి చెందిన భూమేనని చెప్పారు. అండగల్‌లో పేరుమార్పు, భూమి ఆక్రమణ విషయం తనకు తెలియదని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్ఐ ఏమన్నారంటే... వి.టి.అగ్రహరం పైడితల్లమ్మవారికి చెందిన భూమి విషయంపై ఆర్ఐ కోటేశ్వరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్ 153/1 చెందిన 1.70 సెంట్ల భూమి అమ్మవారి పేరుమీద ఉందని చెప్పారు. అయితే మీసేవా ద్వారా జారీ అయిన అడంగల్ కాపీ చూసిన ఆర్ఐ ఎక్కడో తప్పు జరిగి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. తహశీల్దార్ ఏమన్నారంటే.. ఇదే భూమిలో రియల్టర్లు అక్రమంగా రోడ్డు వేయడం పట్ల విజయనగ రం తహశీల్దార్ కోరాడ.శ్రీనివాసరావును సాక్షి ప్రశ్నించగా.. ఈ విషయంపై ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన జరిపినట్లు చెప్పారు. 2008-09 సంవత్సరంలో జరిగిన తప్పులు కారణంగా రికార్డుల్లో పేరు మారి ఉండవచ్చని తెలిపారు. అయితే అక్కడ జరుగుతున్న అక్రమాలపై జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపించామని, ఆయన వద్ద నుంచి ఆదేశాల వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కౌన్సిలర్ రామారావు వివరణ ‘మా తాత( కోరాడ దాలిప్ప) పేరున ఈ భూమి ఉంది. మధ్యలో ఎవరో రికార్డులో మార్చేశారు. దానధర్మంగా ఇచ్చినట్టు చెప్పుకొస్తున్నారు. కానీ మా వద్ద డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. కోర్టులో తేల్చుకుంటాం. ’ అని కౌన్సిలర్ రొంగలి రామారావు ‘సాక్షి’ వద్ద తెలిపారు. -
ఆ ఇద్దరు!
►ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత హరీష్, శరత్పైనే ►90 శాతం వక్ఫ్, దేవాదాయ భూములు పరాధీనం ►33 వేల ఎకరాలున్నా ‘వక్ఫ్’ ఆదాయం రూ.16 వేలే.. ►లక్షలాది ఎకరాల శిఖం భూములు మాయం ►ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవుళ్లు ►సీఎం ప్రకటనతో భూముల స్వాధీనానికి కసరత్తు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గొలుసుకట్టు చెరువులు.. లక్షల ఎకరాల సర్కారీ భూములు.. మెతుకుసీమ ఆస్తులు. చెరువు నిండి చెలక పారితే.. భూమి శిస్తులతో ప్రభుత్వ ఖజానా కళకళలాడేది. నిజానికి తెలంగాణ వారసత్వ సంపద కూడా ఇవే. కాని ఇప్పుడా వైభవం లేదు. కాలంతో పాటే చెరువులు, కుంటలు, శిఖం భూములు కరిగిపోయాయి. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించి అమ్ముకున్నారు. చెరువు శిఖం భూముల నుంచి ప్రభుత్వానికి ‘దమ్మిడీ’ ఆదాయం లేదు. రాష్ట్రంలోనే ఎక్కువ వక్ఫ్ బోర్డు ఆస్తులున్న జిల్లాలో నెల రాబడి కేవలం 16,500 రూపాయలే. ధూపదీప నైవేద్యానికి నోచుకోని ఆలయాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొలుసుకట్టు చెరువుల పునర్నిర్మాణం, ఆక్రమిత భూముల స్వాధీనం సవాల్‌గా మారింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం, కేసీఆర్ సొంత జిల్లాలోనే వేలకు వేల ఎకరాలు ఆక్రమణకు గురై ఉండటం అటు మంత్రి హరీష్‌రావుకు, ఇటు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు ఓ సవాల్‌గా మారింది. అబ్బో.. ఎంత భూమో..! జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కలిపి 23 వేల ఎకరాల వక్ఫ్ భూములున్నట్లు ఇటీవల ప్రభుత్వం జరిపిన ప్రాథమిక సర్వేలో బయటపడింది. ఇందులో 99 శాతం భూమి కబ్జా అయింది. వీటికి సరైన రికార్డు లేకపోవడం, ఆస్తులు రెవెన్యూ అధికారుల అజమాయిషీలో కాకుండా ముతావలీల చేతిలో ఉండటంతో సులువుగా ఆక్రమణకు గురయ్యాయి. దాదా పు 20 వేల ఎకరాలకు పైగా ఉన్న దేవాదాయ భూములు చివరకు 3,651 ఎకరాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 180 దేవాలయాల కింద 3,651 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు దేవాదాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత భూమి కబ్జా అయిందనే సమాచారం అధికారుల వద్ద లేదు. 6,789 చెరువుల కింద 1,03,468.14 ఎకరాల శిఖం భూమి ఉంది. చెరువు ఎఫ్టీఎల్ భూములను కలుపుకుంటే ఇది 2.5 లక్షల ఎకరాలకు మించి ఉంటుంది. అన్ని రకాల భూములను కలుపుకుంటే జిల్లాలో 3,60,381.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ట్లు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో 60 శాతం భూమి ‘వైట్ కాలర్’ దోపిడీదారుల గుప్పిట్లో పడి నలిగిపోయింది. వేల ఎకరాల భూములు తిరిగి రావాలంటే జిల్లా భౌగోళిక స్వరూపం, భౌతిక పరిస్థితులతో పాటు రెవెన్యూ రికార్డులు, భూ సర్వే మీద బాగా పట్టున్న అధికారులు అవసరం. అయితే నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు జిల్లా భౌగోళిక పరిస్థితులపై మంచి పట్టుంది. హరీష్‌కు సవాలే...! జిల్లా ఇన్చార్జి మంత్రిగా హరీష్ గొలుసుకట్టు చెరువుల మీద ద ృష్టి సారించారు. గొలుసుకట్టు చెరువులు తెలంగాణ సంస్కృతిలో భాగమంటున్న హరీష్ .. అడ్డంకులను అధిగమించి చెరువుల పునర్నిర్మాణం చేస్తామని అంటున్నారు. ప్రతి చెరువును రక్షించి తీరుతామంటున్నారు. చెరువుల పూడికతీత పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై సర్వే చేయించినట్లు సమాచారం. పటాన్‌చెరులోని 9 చెరువు పనుల్లో జరిగిన అక్రమాలను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆక్రమించిన వక్ఫ్ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమణదారులు ఎంతటి పెద్దవాళ్లయినా వదలబోమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే ప్రకటించిన మంత్రి, సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే వక్ఫ్ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చివేసి ఆక్రమణదారులకు బలమైన సంకేతాలు పంపించారు. శరత్‌కు సాధ్యమేనా? ఆక్రమిత భూముల పరిరక్షణకు రెవెన్యూ, సర్వే, భూ రికార్డులే ఆధారం. ఈ రికార్డులపై మంచి పట్టున్న అధికారిగా శరత్‌కు గుర్తింపు ఉంది. ప్రభుత్వ భూముల కోసం ఒక ప్రత్యేక ఫార్ములా రూపొందించి, దాని ఆధారంగా గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిని మొత్తం 15 కేటగిరీలుగా విభజన చేశారు. ఏ కేటగిరీలో ఎంత భూమి ఉందో స్పష్టంగా రికార్డులు తయారు చేసిపెట్టారు. నిజానికి ప్రభుత్వ భూమి ఎక్కడ ఎంత ఉంది? ఎవరి ఆధీనంలో ఉందో శరత్‌కు తెలిసినంతగా ఇతరులకు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆయన సేవలను వినియోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు యోచిస్తున్నట్టు సమాచారం. -
ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం!
కడప : నెల రోజుల్లో తిరుమలలో సామాన్య భక్తుడు రెండు గంటల్లో స్వామివారిని దర్శించుకునేలా చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆయన బుధవారం వైఎస్ఆర్ జిల్లాలో దేవుని కడప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సత్వర దర్శనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే భూకబ్జాకు గురైన దేవాలయ భూముల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.