
భూములపై విచారణ చేపడుతున్న శ్రీనివాస్‌రెడ్డి
- దేవాదాయ శాఖ ప్రత్యేక భూసంరక్షణ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
జిన్నారం: బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రత్యేక భూసంరక్షణ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బొంతపల్లి గ్రామంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిదేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదుపై ఆయన గురువారం ఇక్కడకు వచ్చి విచారణ చేపట్టారు.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణప్రసాద్, జిన్నారం తహసీల్దార్ శివకుమార్ సమక్షంలో వివరాలను సేకరించారు. దేవాలయ పరిధిలోని సర్వే నంబర్లు, అందులోని భూమి వివరాలను తెలుసుకున్నారు. దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని స్థానిక నాయకులు గిద్దెరాజు, తదితరులు శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయం పరిధిలో ఉన్న భూమిని సర్వే చేయిస్తామన్నారు.