వెల్లివిరిసిన మతసామరస్యం | Muslim devotees prayers in the devuni kadapa | Sakshi
Sakshi News home page

వెల్లివిరిసిన మతసామరస్యం

Published Thu, Mar 30 2017 2:27 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM

వెల్లివిరిసిన మతసామరస్యం - Sakshi

వెల్లివిరిసిన మతసామరస్యం

దేవునికడపలో ముస్లిం భక్తుల పూజలు

కడప కల్చరల్‌: వైఎస్సార్‌ జిల్లాలో ఉగాది రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. పండుగ సందర్భంగా దేవునికడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లిం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని దినసరి భత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దేవతామూర్తులు, తీర్థంలో మిశ్రమాల వివరాలను అడిగి తెలుసుకుని కొబ్బరికాయలు సమర్పించారు. ముస్లిం భక్తుల్లో కొందరు తిరుమల లడ్డూలను కొనుగోలు చేశారు.

ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది అస్థానం జరిపి పంచాంగ పఠనం నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement