వైభవంగా శ్రీవారి ఉగాది ఆస్థానం | Srivari as the glory of the court Ugadi | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి ఉగాది ఆస్థానం

Published Sun, Mar 22 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

వైభవంగా శ్రీవారి ఉగాది ఆస్థానం

వైభవంగా శ్రీవారి ఉగాది ఆస్థానం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీమన్మథనామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, అభిషేకం  శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. ఉదయం బంగారు వాకిలిలో నిర్వహించిన ఆస్థానంలో భా గంగా సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని వేంచేపు చేశారు. ఆలయ జీయర్ స్వాములు, టీటీడీ ఈవో సాంబశివరావు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

అనంతరం ఆ స్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు.  తిథి, వార, నక్షత్రాల తోపాటు నూతన సంవత్సర ఫలితాలు, లాభ నష్టాలు, నవ గ్రహాలు, సస్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత, అవమానాలు స్వామివారికి వినిపించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని  సంప్రదాయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement