జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం! | telugudesham party to become to national party | Sakshi
Sakshi News home page

జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం!

Published Tue, May 26 2015 8:39 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం! - Sakshi

జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం!

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారనుంది. ఈ నెల 28న టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికకానున్నారు.

హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు  టీడీపీ 'మహానాడు' జరగనుంది. ఈ సమావేశాల్లో టీడీపీ జాతీయ పార్టీగా ప్రకటించకోనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 14, తెలంగాణ నుంచి 10 తీర్మానాలను టీడీపీ నేతలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో ప్రభుత్వ పథకాలు, తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగనుంది. మహానాడుకు దాదాపు 25 వేలమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement