National Party
-
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
జగన్ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్
-
ఇవేం పేర్లు బాబోయ్!.. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు
ట్వంటీ20. హైటెక్. సాఫ్. సూపర్ నేషన్. జాగ్తే రహో... ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు! వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలున్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్‌లో ఏకంగా 2,597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన, పేర్లున్న పార్టీలకు కొదవ లేదు. కాకపోతే వీటిలో చాలావరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు. పార్టీ పెట్టడం యమా ఈజీ మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. రూ.10 వేలు డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు... పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకూ కొదవ లేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత్‌మాతా–పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టం అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాదీ దళ్... ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది. ప్రధాని మోదీ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది! ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక, ద రిలిజియన్ ఆఫ్ మ్యాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు! అయితే ఈ పార్టీల్లో చాలావరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపమిచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్! ...అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు. భారత్‌లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేశ్ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. అన్నట్టూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు! యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవ లేదు. సబ్ సే అచ్ఛీ అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట! ఆప్ కీ అప్నీ పార్టీ (పీపుల్స్), సుభాష్ వాదీ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీఆర్ఎస్ తో జాతీయవాదిగా మారిన కేసీఆర్
-
స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సమగ్రతను దెబ్బతీసేలా, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న బీజేపీపై ఉమ్మడి పోరు సాగించాలని పలు పారీ్టల నేతలు, రైతు సంఘాల నాయకులకు బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కలిసి నడిచేందుకు ముందుకొచి్చన పార్టీలతోపాటు భవిష్యత్తులో మద్దతుగా నిలిచే ఇతర భావసారూప్య పారీ్టలను, సంఘాలను కలుపుకొని జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్మిద్దామని పేర్కొన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన జేడీఎస్ నేత కుమారస్వామి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్, జాతీయ కిసాన్‌నేత గుర్నామ్సింగ్తోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో సీఎం కేసీఆర్ విడివిడిగా భేటీ అయ్యారు. కార్యాలయ ప్రారంభానికి ముందు, ఆ తర్వాత తుగ్లక్‌రోడ్‌లోని నివాసంలో వివిధ జాతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు ఉద్యమాలే తొలి అజెండా పార్టీ జాతీయ నినాదమైన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ దిశగా బీఆర్ఎస్ తొలి అడుగులు ఉంటాయని.. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్నే తొలి ఎజెండాగా తీసుకుందామని భేటీల్లో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచేలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు రైతు ఉద్యమాన్ని నిర్మించే అంశంపై కీలక చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ అంశంలో కేంద్రం మెడలు వంచేందుకు కలిసివచ్చే అన్ని పారీ్టలు, సంఘాలతో ఉమ్మడిగా పోరాడేందుకు తాము సిద్ధమని.. పార్లమెంట్ లోపల, బయట కూడా పోరాటాలు చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇక ధాన్యం సేకరణలో జాతీయ విధానం అవసరమని, దేశవ్యాప్తంగా సంక్షోభంలో పడిన వ్యవసాయాన్ని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ నూతన విధానం కోసం ఒత్తిడి చేస్తామని చెప్పినట్టు సమాచారం. ఢిల్లీలో సమావేశం పెట్టుకుందాం! దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు అమలు, వడ్డీలేని రుణాలు, పంటల బీమా పథకాల అమలు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టవద్దనే అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఢిల్లీలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని భేటీలలో ప్రతిపాదన వచి్చనట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఆరి్ధక ఆంక్షలు విధించి, కట్టడి చేయాలని చూడటం.. ప్రభుత్వాల్లో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పారీ్టల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను ఎండగట్టాల్సి ఉందనే అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. కేంద్ర సంస్థల దురి్వనియోగంపై ఉమ్మడి పోరాట కార్యాచరణ తీసుకుంటే తప్ప దానిని ఎదుర్కోలేమని భావన వచి్చనట్టు తెలిసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మతపర అంశాలను ఎగదోస్తూ బీజేపీ పబ్బం గడుపుకొంటోందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. మొత్తంగా అంశాల వారీగా బీజేపీ తీరును ఎండగట్టాలని, కార్పోరేట్లకు పెద్దపీట వేసే తీరుపై గళమెత్తితేనే దేశంలో గుణాత్మక మార్పు సంభవిస్తుందని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. మరో మూడు రోజులు ఇక్కడే.. సీఎం కేసీఆర్ మరో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయస్థాయి అంశాలపై వివిధ పారీ్టల నేతలు, మేధావులు, రైతు సంఘాల నేతలతో ఆయన చర్చలు జరపనున్నారని.. జాతీయ మీడియాను దృష్టిలో పెట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నాయి. -
ఢిల్లీకి కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఎల్లుండి (బుధవారం) తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సర్దార్ పటేల్ మార్గంలోని అద్దె భవనంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో కార్యాలయం బయట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి నవ చండీయాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ చండీయాగం నిర్వహించేందుకు యాగశాలను నిర్మించి అందులో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నవ చండీయాగంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం 12.37 నిమిషాల సమయంలో పూర్ణాహుతిలో పాల్గొంటారని వాస్తు నిపుణులు తేజ వెల్లడించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ వర్గాన్ని కూడా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజా ప్రతినిధులు సుమారు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వీలును బట్టి భావసారుప్యత కలిగిన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగానే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు? -
‘లోక్‌సభ’ నుంచే ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి భవిష్యత్ ప్రస్థానానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్పుచేసే ప్రక్రియ పూర్తవడంతో వీలైనంత త్వరగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నారు. ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని పటేల్ మార్గ్‌లో పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే మీడియా సమావేశంలో పార్టీ విధివిధానాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయం శాశ్వత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఈ ఏడాది డిసెంబర్ తొలివారంలోనే ఢిల్లీలో నిర్వహిస్తామని సంకేతాలిచ్చినా పేరు మార్పిడి ప్రక్రియ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. చలికాలం ముగిశాక మార్చి నెలాఖరులో ఢిల్లీలో పార్టీ శాశ్వత కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించడంతోపాటు ఆవిర్భావ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలతోనే అరంగేట్రం బీఆర్ఎస్ ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో కార్యకలాపాలకు మార్గం సుగమమైనా.. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రానికి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను వేదికగా మల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా ఎన్నికల్లో స్థానికంగా కలిసి వచ్చే భావసారూప్య పార్టీలకు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున పరిశీలక, ప్రచార బృందాలను పంపడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ తరపున కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారు. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాల్లో కన్నడ భాషపై పట్టుకలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, హన్మంత్ షిండేతో పాటు మరికొందరు నేతల సేవలను వినియోగించుకుంటామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. చేరికలు, విలీనాలతో పార్టీ విస్తరణ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నాటికల్లా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయస్థాయిలో ఆసక్తితో ఉన్న పార్టీలు, నేతలతో సంప్రదింపులు జరిపి.. కలిసి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవడం, విలీనాలు వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. పార్టీ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఆలోగా రాష్ట్రానికి చెందిన నేతలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, వివిధ రంగాల నిపుణులతో పొలిట్‌బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ప్రత్యేక పాలసీలు రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ రాజ్యాంగం, విధివిధానాల రూపకల్పనకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన అవగాహన కలిగిన వారికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. పార్టీ జాతీయ కార్యకలాపాల సమన్వయంలో తోడ్పాటు అందించడంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, దాసోజు శ్రవణ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులతో కూడిన బృందం క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు సమాచారం. త్వర లో ప్రకటించే బీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోలో వీరిలో కొందరికి ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాల విస్తరణ, పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ల నూతన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా ఉన్న సీఎం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పాలనాపరమైన అంశాలను తుదిదశకు చేర్చే యోచనలో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతోపాటు మరికొందరు నేతలతో ‘టాస్క్‌ఫోర్స్’ఏర్పాటు చేసి.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను ముమ్మరం చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. -
‘అప్పుడు అవమానించి గొంతు నులిమే ప్రయత్నాలు చేశారు’
సాక్షి, హైదరాబాద్: ‘భారత్ రాష్ట్ర సమితి అనే వెలుగు దివ్వెను దేశం నలుమూలలా విస్తరింప చేద్దాం. భరతమాత సంతృప్తి పడేలా తెలంగాణ కీర్తి కిరీటాన్ని ఆమె పాదాల వద్ద పెట్టి దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేద్దాం. భారత్ రాష్ట్ర సమితితో మన ప్రయాణం కొనసాగించి భరతమాత సంతృప్తిని కళ్లారా చూద్దాం. కొత్త రాజకీయ శక్తి అవిర్భవించినపుడు పాత శక్తులు రకరకాలుగా విమర్శలు చేస్తాయి. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు కూడా చాలామంది అవమానించి గొంతు నులిమే ప్రయత్నాలు చేశారు. అవన్నీ అధిగమించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఇప్పుడు కూడా కొంతమంది బాధలు, ఇబ్బందులు పెడతారు. పిరికితనం లేకుండా ముందుకు సాగుదాం. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం కాబట్టే తెలంగాణ సాధించాం. అదే స్ఫూర్తితో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తే ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం..’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చాలనే వినతికి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో భారతదేశ చిత్ర పటంతో కూడిన గులాబీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ, ఇతర ముఖ్య నేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ గడ్డ నుంచి బీఆర్ఎస్ పతాకం ఎగురవేయడం ఆషామాషీగా అలవోకగా, ఆవేశంలో చేస్తున్న పని కాదన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు వెనుక ప్రబల కారణముందని, ఇది ఒక ప్రారంభం మాత్రమే అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి.. తిరోగామి స్థితిలో భారత్ ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లక్ష్యంగా పిడికెడు మందితో టీఆర్ఎస్ ప్రారంభమైంది. అనేక ఛీత్కారాలు, అవహేళనలు ఎదుర్కొంటూ చిత్తశుద్ధి, అంకిత భావం, త్యాగాలతో ప్రజల దీవెనలు అందుకుంటూ ఉప్పెనలా విజృంభించి తెలంగాణ సాధించాం. 60 లక్షల మంది సభ్యులతో ఈ రోజు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేలాది మంది ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని సౌష్టవంగా నిర్మించుకుని క్రమ శిక్షణతో ప్రభుత్వాన్ని నడిపి అద్భుత ఫలితాలు సాధించాం. ఎడారిలా, మంచినీరు లేని ప్రాంతంలా పేరుపడిన తెలంగాణ ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధిస్తే.. రత్నగర్భగా అపార మానవ సంపద కలిగిన భారత్ మాత్రం తిరోగామి స్థితిలో ఉంది. 41 కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి, 70 వేల టీఎంసీల నదీ జలాలు, 109 కోట్ల మంది పనిచేసే జనం, జనాభాలో 52 శాతం యువత ఉన్నా.. దేశం దుస్థితిలో ఉంది. ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ఉగ్రవాదం లాంటివెన్నో సాగుతున్నాయి. చెన్నై వంటి చారిత్రక నగరాలు గుక్కెడు తాగునీటి కోసం విలవిల్లాడుతున్నాయి. దేశ యువతను మతోన్మాదులు నిరీ్వర్యం చేస్తూ ఉంటే మనం గుడ్లప్పగించి చూస్తున్నాం. తెలంగాణ లాంటి ప్రయత్నమే దేశ మంతటా జరిగితే అమెరికాను తలదన్నే ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదాలుస్తుంది. ఇందుకు నాందీ ప్రస్తావన మన నుంచి జరగడం సంతోషం. దేశానికి అన్ని విషయాలు వివరించి తెలంగాణ ఉద్యమ తరహాలో పరివర్తన చూస్తాం. దేశంలో గుణాత్మక మార్పు, ఆర్థిక పరిపుష్టి కోసం అంకిత భావంతో ముందుకు సాగుదాం. బీఆర్ఎస్ తొలి నినాదం అబ్ కీ బార్..కిసాన్ సర్కార్. భారత్‌లో మన ప్రభుత్వం వస్తే మారుమూల గ్రామాలు, తండాల్లో 24 గంటలు కరెంటు ఇస్తాం. ఏడాదికో 25 లక్షల కుటుంబాలకు దళితబంధుతో పాటు రైతుబంధు పథకాలు అమలు చేస్తాం..’ అని కేసీఆర్ ప్రకటించారు. కొత్త విధానాల రూపకల్పనపై కసరత్తు ‘దశాబ్దాలుగా సాగుతున్న నీటి పంచాయితీలు, ఆర్థిక పురోగతికి అవాంతరాలు, రైతాంగ సమస్యలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలో అనేక రంగాల్లో కొత్త విధానాల రూపకల్పన జరగాల్సి ఉంది. వాటర్ పాలసీ, ఎకనామిక్ పాలసీ, పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, ఎన్విరాన్మెంట్ పాలసీ, వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీలు కొత్తగా రూపొందించుకునేందుకు నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు, ఆర్థికవేత్తలతో మాట్లాడాం. ఈ పాలసీలను కొద్ది రోజుల్లో దేశ ప్రజల ముందుపెడతాం. అలాగే బీఆర్ఎస్ కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా నూతన ఆలోచన, కొత్త ఒరవడి ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేలా అద్భుత ప్రగతికి బాటలు వేసే ఆలోచనలను మేల్కొలుపుతాం. సమాఖ్య స్ఫూర్తిని పెంచేలా బీఆర్ఎస్ పనిచేస్తుంది..’ అని సీఎం తెలిపారు. కుమారస్వామి కోసం కష్టపడి పనిచేస్తాం ‘కర్ణాటక రైతులు తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలును చూస్తున్నారు. కర్ణాటక భావి ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చూస్తున్నాం. కుమారస్వామి కోసం కష్టపడి పనిచేయడంతో పాటు కర్ణాటక రైతులకు ఇక్కడి పథకాలను వివరిస్తాం. తెలంగాణ పోరాటానికి దేవెగౌడ మద్దతు ఇచ్చారు. గతంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బెంగళూరుకు వెళ్లా. ప్రగతిశీల నాయకుల వెంట ఉంటాం. కన్నడ భాష తెలిసిన ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, షిండే, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి నేతలు కర్ణాటకలో కుమారస్వామిగా మద్దతుగా ప్రచారం చేస్తారు..’ అని కేసీఆర్ చెప్పారు. పండుగలా కార్యాలయం ప్రారంభం ‘ఈ రోజు దివ్యమైన ముహూర్తం ఉంది కాబట్టే బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించుకునేందుకు ఓ రోజు ముందే చేరుకునేలా పార్టీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. టీఆర్ఎస్ ఏర్పాటు ఆనాటి అవసరం కాగా.. దేశం కోసం బీఆర్ఎస్గా మారుతున్నాం. పార్టీ సొంత కార్యాలయం పనులు వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తవుతాయి..’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. -
చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఊరట లభించింది. గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జాతీయ పార్టీ హోదాను సంపాదించేందుకు కృషి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు, దేశప్రజలకు అభినందనలు తెలిపారు. కాగా గుజరాత్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆప్ మరో స్థానంలో ముందంజలో ఉంది. గుజరాత్ ఎన్నికల్లో 13 శాతం ఓట్లను సాధించింది. ప్రస్తుతం దేశంలో ఎనిమిది పార్టీలు జాతీయ హోదా పొందాయి. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తొమ్మిదో పార్టీగా నిలిచింది. राष्ट्रीय पार्टी बनने पर आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं और सभी देशवासियों को बधाई। pic.twitter.com/sba9Q1sz1f — Arvind Kejriwal (@ArvindKejriwal) December 8, 2022 ఒక రాజకీయ పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 సీట్లు, 6శాతం ఓట్లు సాధిస్తే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆప్ జాతీయ హోదా ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆప్ నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాప్రతినిధులను కలిగి ఉంది. చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా -
విక్టరీ ఏమోగానీ.. ఆప్‌లో దానిపైనే ఉత్కంఠ
ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపీ, ఆప్ కొత్త రికార్డుల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. గుజరాత్లో వరుసగా 7వ సారి గెలిచి దేశంలో కమ్యూనిస్టు పార్టీ విజయం(పశ్చిమ బెంగాల్) రికార్డును సమం చేయనున్న బీజేపీ. అలాగే.. ఈ ఎన్నికలతో జాతీయ పార్టీగా అవతరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఏదైనా పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అర్హత పొందుతుంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఆప్. ఇక ఆ మధ్య గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు తోడు గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట 6 శాతం దాటితే జాతీయ పార్టీగా అర్హత పొందినట్లు అవుతుంది. అంటే గుజరాత్లో కనీసం రెండు సీట్లు గెలిచినా సరిపోతుంది ఆప్. ఒకవేళ జాతీయ పార్టీగా మారితే.. దేశంలో జాతీయ పార్టీ హోదా సాధించిన ఎనిమిదవ పార్టీగా ఆప్ నిలవడంతో పాటు ఈవీఎం మెషీన్లలో మొట్టమొదటి పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ ఉండనుంది. 2021లో సూరత్ మున్సిపల్ ఎన్నికలలో 28% ఓట్ల వాటాను సాధించడం ద్వారా కాంగ్రెస్ స్థానంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శనను కనబరుస్తామని ఆశిస్తోంది. 2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఆప్‌కి ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. -
Telidevara Bhanumurthy: బీఆర్ఎస్ అంటే ఏంది?
ఇయ్యాల ఆనగొట్టింది. రేపు ఎండ గొట్టొచ్చు. ఎల్లుండి సలిబెట్టొచ్చు. దినాలెప్పుడు ఒక్క తీర్గనే ఉండయి. మా తాత జమాన్ల విక్రమార్కుడు నడ్సుకుంట బొందలగడ్డ కాడ్కి బోయెటోడు. బేతాలుడు చెట్టు మీద ఉండెటోడు. గాన్ని బుజం మీదేస్కోని విక్రమార్కుడు నడ్సెటోడు. గాడు జెప్పేటి కత ఇని ఆకర్కి అడిగిన సవాల్‌కు జవాబ్ జెప్పెటోడు. మా నాయిన జమాన్ల విక్రమార్కుడు సైకిల్ మీద బొందలగడ్డ దిక్కుబోతే, సైకిలెన్క గూసోని బేతాలుడు కత జెప్పెటోడు. జమానా బదల్ గయా. గిప్పుడు విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ కాడ్కి బోయి హారన్ గొడ్తున్నడు. గాడ రొండంత్రాల బంగ్లలున్న బేతాలుడు ఇవుతల కొస్తున్నడు. మోటరెన్క సీట్ల గూసుంటున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ఎప్పటి తీర్గనే ఎన్క గూసున్న బేతాలుడు కత జెప్పబట్టిండు. మున్పటి లెక్క గాకుంట గాల్లిద్దరు ముచ్చట బెట్టుకుంట మోటర్ల బోబట్టిండ్రు. ‘అయ్యగారు బెట్టిన మూర్తంల దస్రనాడు కేసిఆర్ కొత్త పార్టీ బెట్టిండు’ అని బేతాలుడన్నడు. ‘మల్ల టీఆర్ఎస్ ఏమైంది?’ విక్రమార్కుడు అడిగిండు. ‘టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. ముల్లు బోయి కత్తి వొచ్చె ఢాంఢాం. తెలంగాన బోయి భారతొచ్చె రాంరాం’. ‘గది వీఆర్ఎస్ అయితదా?’ ‘కేటీఆర్ ముక్యమంత్రి గావాలంటె కేసీఆర్‌కు వీఆర్ఎస్ తప్పది. ఎప్పటి సందో ప్రతాని కుర్సి మీద గూసున్నట్లు గాయినకు కలలొస్తున్నయి. తెల్లారి నాలుగ్గొట్టంగ బడేటి కలలు నిజమైతయని ఒక సన్నాసి గాయినకు జెప్పిండు’. ‘కేసీఆర్ ఏం జేసిండు?’ ‘కర్నాటక రాస్ట్రం బోయిండు. కుమారస్వామిని గల్సిండు. వొచ్చె అసెంబ్లీ ఎలచ్చన్ల కోట్లు ఇస్త అన్నడు. గట్ల మాట ఇచ్చినంకనే కేసీఆర్‌తోని కుమారస్వామి ఫోట్వ దిగిండు. గని గాయిన తోని పని గాదు. అడుగు మాడదు, అట్టు పేరదు. బిహార్ ముక్యమంత్రి నితీశ్ కుమార్‌నే గాకుంట లాలూప్రసాద్ యాదవ్‌ను గుడ్క కేసీఆర్ గల్సిండు. చౌతాలను గల్సిండు. అందరం ఒక్కటై బీజేపీతోని కొట్లాడ్దామని అన్నడు. గని అస్సయ్ అంటె అదే సహి, దూలా అంటె ఇదే సహి అనె తంద్కు గాల్లు టీఆర్ఎస్ మంత్రులసొంటోల్లు గారు. కేసీఆర్ కడ్మ రాస్ట్రాల రైతు లీడర్లకు గాడి కిరాయి లిచ్చిండు. గాల్లు పట్నమొస్తె దావత్ ఇచ్చిండు. రైతుబందు పద్కంను తారీఫ్ జెయ్యమన్నడు. దేసమంత గా పద్కం బెడ్తె మంచిగుంటదని గాల్లతోని జెప్పిచ్చిండు’. ‘బేతాలా! ఏ బట్ట కాబట్ట మాస్క అయితెనే మంచి గుంటది. ఒక రాస్ట్రం పద్కం ఇంకొక రాస్ట్రంకు మంచి గుండదు.’ ‘నివొద్దే. మన్మన్ని, పెండ్లాంను దీస్కోని కేసీఆర్ యాద్గిరిగుట్టకు బోయిండు. నర్సిమ్మసామికి కిల పదారు తులాల బంగారమిచ్చిండు. దేవుడా! నన్ను ప్రతానిని జేస్తె నీ గుడినంత బంగారం జేస్త అని మొక్కిండు’ ‘ఇంకేం జేసిండు?’ ‘పట్నంల బిహార్ కూలోల్లు సస్తె గాల్ల కుటుంబాలకు తలా పది లచ్చలు ఇచ్చి వొచ్చిండు. మహారాస్ట్ర బోయి తీస్ మార్కాన్ నన్నడు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టి బెడ్తె టీఆర్ఎస్ లీడర్లు ఏం జేసిండ్రు! కొందరు దేస్ కీ నేతా కేసీఆర్ అని వొల్లిండ్రు. కొందరు గాయిన ఫోట్వలకు పాలతోని అబిసేకం జేసిండ్రు. ఇంకొందరు కోవ పేడలు బంచిండ్రు. పటాకులు గాల్చిండ్రు. వరంగల్ టీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరైతె డిస్కో డాన్సు జేసిండు. హమాలోల్లకు తలా ఒక కోడి, కోటర్ విస్కి సీస ఇచ్చిండు. కేసీఆర్ ప్రతానమంత్రి అయితున్నడని సాటిచ్చిండు. ఇగ కేసీఆర్ ప్రతాని గావాలనుకుంట చౌటుప్పల్‌ల బువ్వ దినే ముంగట మంత్రి మల్లారెడ్డి టీఆర్ ఎసోల్లకు మందు బోసిండు. గాయిన విస్కి సీసలెందుకు బంచిండు? గీయిన మందు ఎందుకు బోసిండు? గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) ‘బీఆర్ఎస్ అంటె బిరండి, రమ్ము, స్కాచ్ అనుకోని ఒకలు విస్కి సీసలు బంచితె, ఇంకొకలు గిలాసలల్ల మందు బోసిండ్రు’ అని విక్రమార్కుడు జెప్పిండు. సరింగ గప్పుడే బొందల గడ్డొచ్చింది. మోటరాగింది. మోటర్ల కెల్లి దిగి బేతాలుడు ఇంటికి బోయిండు. (క్లిక్ చేయండి: చల్నేదో బాల్ కిషన్) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
‘పార్టీ’టైమ్... కాసింత కామెడీగా!
‘జనం కమెడియన్లను సీరియస్‌గా, పొలిటీషియన్లను కామెడీగా తీసుకుంటున్నారని’... ఓ అమెరికా పెద్దమనిషి చెప్పి దాదాపు వందేళ్ల య్యింది. ఇంకా అదే ట్రెండ్ కొసాగుతున్న ట్టుంది.. ఇది చూడండి.. ముందస్తు అరెస్ట్‌లు, హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బందోబస్తు.. 100 మంది అదుపులోకి.. 3 గంటలపాటు ఉద్రిక్తత.. 1,500 మంది పోలీసుల మోహరింపు.. బారికేడ్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... కామెడీ షో ప్రశాంతంగా పూర్తయింది.. – ఇదీ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మునావర్ స్టాండప్ కామెడీ షో తీరు. 5వ తారీఖున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన గురించి ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.. ట్రంప్, పుతిన్, కిమ్‌లాంటి వాళ్లు కేసీఆర్ బ్యాచ్‌తో టచ్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ‘ప్రపంచ రాష్ట్ర సమితి’ (పీఆర్ఎస్) పార్టీ పెడితే మన పరిస్థితి ఏమిటీ అని పలువురు దేశాధినేతలు తర్జన భర్జన పడుతున్నారు.. పీఆర్‌ఎస్‌లో ఉండడమా, స్వతంత్రంగా ఉండడమా అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. – ఇదీ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్. ఇట్లా.. కామెడీ సీరియస్‌గా.. పాలిటిక్స్ కామెడీగా! ‘మన వాళ్లు వట్టి వెధవాయిలు..’ ఇందిరమ్మ సృష్టించిన ఎమర్జెన్సీ చీకట్లలో ఉదయించిన ‘జనతా’లాగా.. పంచమ స్వరాన్ని దళిత శంఖారావంలా దేశ వ్యాప్తం చేయ ప్రయత్నించిన కాన్షీరాం బీఎస్పీ లాగా... చాలా కాలం తర్వాత అలా దేశవ్యాప్త సంచలనం.. మోదీ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి విజయ దశమి నాడు గాండీవం ఎత్తిన కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. మన తెలుగు ఎన్టీయార్ కల ‘భారతదేశం’ పార్టీ భావనను ఆయన వీరాభిమాని కేసీఆర్ దేశవ్యాప్తం చేసే అద్భుత సన్నివేశం.. దీన్ని కొంతమంది.. అదీ తెలుగు వాళ్లు.. మరీ తెలంగాణ తల్లి బిడ్దలు.. ఇలా ట్రోల్ చేయడం ఆశ్చర్యమే మరి! జాతీయ పార్టీలు చిన్న మునుగోడు పైనే పడుతుంటే.. జాతీయవాదాన్ని ఎత్తుకున్న తెలు గోడిని మరో తెలుగోడు ప్రశంసించడం మాని.. పరిహసించడమా! ‘ముందుకు పోతానంటే ఎందుకు నీ విరగబాటు ఇటనే నిలుచో మందురు..’ అని శ్రీశ్రీ.. ‘మన వాళ్లు వట్టి వెధవాయిలోయ్..’.. అని గురజాడ గిరీశం ఊరికే అన్నారా పునర్భూదోషం... జ్యోతిష్యులు కూడా దీన్ని వదలక పోవడం మరింత చిత్రం.. తెలుగు నేలపై ఆధ్యాత్మిక వైభవానికి కేసీఆర్ ఎంత చేస్తున్నారో మనకు తెలుసుగా.. శుభం పలకవచ్చుగా! ధనుర్లగ్నంలోనే పార్టీ ప్రకటన జరిగిందట... ఇది అచ్చంగా రాజులు మరో సామ్రాజ్యంపై దాడిచేసేటప్పుడు పెట్టే ముహూర్తం... యుద్ధానికి ప్రతీక, విజయానికి సూచిక.. తిరుగులేదు అంటూనే.. కాస్త లో–వాయిస్‌లో కొర్రీలు చూపుతున్నారు. దుర్ముహూర్త స్పర్శా దోషం ఉంది., పునర్భూదోషం ఉంది. పలుమార్లు శ్రమించాల్సిందే, నల్లేరుపై నడక కాదు కష్టపడాల్సిందే.. అంటున్నారు. ఠాఠ్.. అదేమీ లేదు వ్యక్తిగత జాతకం అద్భుతం అని కాస్త హై–వాయిస్‌లో దబాయిస్తున్న ప్రో– జ్యోస్యులూ ఉన్నారనుకోండి! ఇదో ‘స్టార్టప్’ తరహా... ఇక సామాజిక మాధ్యమాల్లో తిష్ఠవేసిన విశ్లేషకుల ముచ్చట్లు రకరకాలు..మచ్చుకు ఒకటి.. – మన దగ్గర ఒక్క పార్లమెంట్ ఎన్నికకయ్యే ఖర్చులో బయటి రాష్ట్రాల్లో నాలుగైదు పార్లమెంట్ నియోజక వర్గాలు లాగించవచ్చు. బాగా వనరు లున్న పార్టీ కనుక చిన్నా చితకా పార్టీలను ఆకర్షించవచ్చు. వారికి ఆర్థిక సాయం చేయవచ్చు. ఇదో స్టార్టప్ తరహా వ్యవహారం.. ఇది స్టార్టప్‌ల కాలంకదా.. చూద్దాం ఇది సక్సెస్ అవుతుందో లేదో.. అని విశ్లేషణ బాల ‘పిట్టకథ’ ఇంకాస్త కరడు గట్టిన తెలంగాణ వాదులు ఓ పిట్టకథ చెబుతున్నారు. ఓ పిల్లాడిని తల్లి పిలిచి సీసా మూత తియ్యరా అంది పలుమార్లు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అన్న దాన్ని తీసుకుని ఓ రెండు మార్లు ప్రయత్నించి మూత తీసి హీరోలా తమ్ముడి వైపు చూసి వెళ్లాడు. తమ్ముడు తల్లిని అడిగాడు అన్న ఎలా తీయగలిగాడు అని.. నువ్వు చాలా చాలా సార్లు ప్రయత్నించినప్పుడే అది లూజయింది. మరోమారు నువ్వు ప్రయత్నించినా వచ్చేది అని నవ్విందట! కేసీఆర్‌దీ ఇదే తంతు. ఎన్నో దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమం కీలక దశలో జొరబడి పేరు కొట్టేశాడు అంటూ వెటకారం చేస్తూ... ప్రతిసారీ అన్ని సీసాల మూత తియ్యడం సాధ్యం కాదు... అని నర్మగర్భంగా, కాస్త వ్యంగ్యంగా.. పక్కోడి ప్రయత్నాలు, ఉద్యమాలు, ఆత్మబలిదానాలు లేకుండా అస్సలు సాధ్యంకాదని సీరియస్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు.. నామ్‌కే వాస్తే.. ఈ సీసాల గొడవ ఇలా ఉండగా.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు పేరు మార్పుపై. ‘..సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే సిరి సిరి మువ్వా..’ శ్రీశ్రీ పాటేసుకుంటున్నారు.. గొర్రెలెలా? కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఇలా డౌటేస్తున్నారు... ఫర్ సపోజ్...మన బీఆర్ఎస్ ఢిల్లీ పీఠం ఎక్కిందనుకుందాం... రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటాం. కమీషన్లకు కక్కుర్తి పడకుండా కార్పొరేట్లకు రుణ మాఫీ రద్దు చేసి..దానికి బదులు దేశమంతటా దళిత బంధు, రైతు బంధు ఇచ్చుకుందాం. రాష్ట్రానికో కాళేశ్వరం కట్టుకుందాం.. ఊర్లన్నీ పచ్చగ చేసుకుందాం.. ..కానీ, మన గొర్రెల పథకం ఉందిగా.. దేశమంతా గొర్రెలెలా పంచడం? ఇక్కడ మనకు సరిపోకే పక్క రాష్ట్రాలనుంచి తెస్తున్నామాయే! (క్లిక్ చేయండి: రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!) -
ఎడిటర్ కామెంట్ : బీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ టఫ్ టాస్క్
-
నేడు నూతన జాతీయ పార్టీని ప్రకటించనున్న కేసీఆర్
-
‘ఉద్యమ పార్టీ పేరుతో అడ్డంగా దోచుకున్నారు.. ఆ 900 కోట్లు ఎక్కడివి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, గాంధీభవన్ మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కాంక్షను విస్తరించడానికి జాతీయ పార్టీ పెడుతున్నాడు. మొదట ఉద్యమ పార్టీ అని టీఆర్ఎస్ను స్థాపించి దోచుకున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు కొంటున్నాడు.. అంటేనే కేసీఆర్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర దోపిడీ అన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏం చేశాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగితే బహుజనులకు, రైతులకు న్యాయం జరుగుతుందని ఆనాడు కేసీఆర్ అన్నాడు. కానీ, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ చేసిందేమీ లేదు. కొత్త పార్టీ మొదలైతే టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ జాతి ద్రోహి. కేసీఆర్.. తన కుమారుడు, కుమార్తె, అల్లుడి రాజ్య విస్తరణ కోసమే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒకసారి ఆలోచించాలి. 8 సంవత్సరాలు పార్టీకి 900 కోట్లు ఎలా వచ్చాయి. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ను బొంద పెట్టాలి అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేపు జాతీయ పార్టీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్
-
కేసీఆర్ జాతీయాస్త్రం
-
కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యూకే ఎన్నారైలు
లండన్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని యూకే ఎన్నారైలు ఆకాంక్షించారు. నూతన జాతీయ పార్టీ స్థాపించాలన్న ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. యూకేలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని కోరారు. ప్రస్తుతం దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే ఆయన వల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. "దేశ్ కి నేత కేసీఆర్" అంటూ భారీ కేసీఆర్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు ఎన్నారైలు పాల్గొన్నారు. -
ఉప ఎన్నికతో సంబంధం లేదు.. తగ్గేదేలే అంటున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక, గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం అఫిషీయల్‌గా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటీకీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే బరిలో నిలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. జాతీయ పార్టీ ప్రకటనపై సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్.. మునుగోడులో జాతీయ పార్టీతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీపై కసరత్తులో భాగంగా దసరా(అక్టోబర్ 5న) రోజున జరగాల్సిన సర్వసభ్య సమావేశం యథావిధిగాఘ జరుగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికతో సమావేశానికి సంబంధం లేదన్నారు. కాగా, బుధవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభంకానుంది. మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి. కేంద్రం దుర్మార్గాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు అని కామెంట్స్ చేశారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17గా ఉంది. 15న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. -
వీఆర్ఏ సమస్యలను పరిష్కరించలేని వాళ్లు దేశం కోసం ఏం చేస్తారు?
భువనగిరిటౌన్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వాటిని పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోకుండా నూతన పార్టీ పెట్టి దేశాన్ని బాగుచేస్తానని బయలు దేరుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గాంధీపార్కు వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించని వాళ్లు, దేశం కోసం పార్టీ పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. వరంగల్ పర్యటనలో భాగంగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలేని సీఎం దగ్గరికి వెళ్తే ఎలా ప్రవర్తించారో అందరూ చూశారన్నారు. ఓ వీఆర్ఏ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీ కోసం రూ.100 కోట్లు పెట్టి సొంతగా ఫ్లైట్ కొనుక్కోవచ్చు కానీ 10 వేల మంది వీఆర్ఏల సమస్యలు పరిష్కరించరా అని నిలదీశారు. రెండు రోజుల్లో వీఆర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనుంచి తప్పించుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, నాయకులు పిట్టల బాలరాజు, మహ్మద్ షరీప్ ఉన్నారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
దసరా రోజున కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్
-
టీఆర్ఎస్సే బీఆర్ఎస్..!
విషయం: భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనున్న టీఆర్ఎస్ ముహూర్తం: దసరా రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు.. వేదిక: తెలంగాణ భవన్ ఆవిర్భావ సభ: డిసెంబర్ 9న ఢిల్లీలో.. (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) జెండా: గులాబీ రంగులోనే (చిహ్నం మార్పుతో) ఎజెండా: నీళ్లు, నియామకాలు, రైతులు, అభివృద్ధి (దసరా రోజు భేటీలో కేసీఆర్ స్పష్టత ఇస్తారు) సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతోంది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5న మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు తెలంగాణ భవన్ వేదికగా కొత్త జాతీయ పార్టీ పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రకటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక భేటీలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం వారితో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో చాలా వరకు జాతీయ రాజకీయాలు, బీజేపీ పాలన తీరు, కాంగ్రెస్ పరిస్థితి, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు వస్తున్న స్పందన తదితరాలపై మాట్లాడినట్టు తెలిసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆహ్వానించినట్టు సమాచారం. దసరా రోజు విస్తృతస్థాయి సమావేశం కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్లు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, 33 జిల్లాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులనూ కలుపుకొని మొత్తం 283 మంది ప్రతినిధులు విస్తృతస్థాయి భేటీలో పాల్గొననున్నారు. జిల్లాల వారీగా ఆహ్వానితులను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను మంత్రులు, పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా.. నిర్ణయించిన ముహూర్తానికి టీఆర్ఎస్ కొత్త జాతీయ పార్టీగా మారుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు. సమావేశం ముగిశాక తెలంగాణ భవన్‌లోనే పార్టీ ప్రతినిధులతో కలిసి కేసీఆర్ భోజనం చేస్తారు. డిసెంబర్లో.. ఢిల్లీ వేదికగా.. ఈ ఏడాది డిసెంబర్ 9న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కొత్త జాతీయ పార్టీని కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి.. కొత్త జాతీయ పార్టీతో కలిసి వచ్చే నేతలు, జాతీయ స్థాయిలో భావ సారూప్య పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తారు. ఢిల్లీ బహిరంగ సభ డిసెంబర్ 9నే ఉంటుందా, లేక మరో తేదీన జరుగుతుందా అన్నదానిపై ఈ నెల 5న తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్న గులాబీ రంగు జెండా, చిహ్నం స్వల్ప మార్పులతో కొత్త జాతీయ పార్టీ కొనసాగనుంది. కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా దాదాపుగా ఖరారైనా.. ఈ నెల 5వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. కొత్త పార్టీ విధి విధానాలు, తదుపరి కార్యాచరణపై దసరా రోజు జరిగే సమావేశంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు! ‘‘బీజేపీ దుర్మార్గాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇదే ప్రభుత్వం కొనసాగితే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. బీజేపీ అధికార దాహంతో ప్రజస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్రమంగా జనాదరణ కోల్పోతోంది. మనం ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను, రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ వస్తోంది..’’ అని ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత బలంగా ఉందని.. మునుగోడు ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనితోపాటు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నందునే బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. -
కేసీఆర్ @పాన్ఇండియా
-
దసరాపై ఉత్కంఠ.. మునుగోడులో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ పార్టీ విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్.. మంత్రులు, జిల్లాలో అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఇక, ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో డిసెంబర్ 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణభవన్‌లో దసరా రోజున టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. అదే రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు.. జాతీయ స్థాయిలో వివిధ సంఘాల నేతలతో త్వరలో కేసీఆర్ భేటీ కానున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మునుగోడుపై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో అన్ని వర్గాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. మునుగోడులో అన్ని సర్వేలు టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన
-
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మొదలైన లంచ్ మీటింగ్
-
Sakshi Cartoon 02-10-2022
-
దసరా.. కొత్త పార్టీ.. ఊరూవాడా సంబురాలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఊరూవాడా సంబురాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అటు దసరా పండుగ, ఇటు కొత్త పార్టీ నేపథ్యంలో భారీ ఎత్తున ర్యాలీలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతిభవన్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులనూ ఈ సమావేశానికి రావాల్సిందిగా శనివారం ఆహ్వానం పంపారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. అయితే సమావేశ ఎజెండా ఏమిటనే దానిపై మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఊరూరా భారీగా సంబురాల కోసం జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. ఆ కొత్త పార్టీ ప్రకటన, ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక సంకేతాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిసింది. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన వెంటనే దేశవ్యాప్తంగా కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు వెలువడేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మంత్రులు, జిల్లా అధ్యక్షులకు బాధ్యతలు కొత్త పార్టీ ప్రకటనకు మరో మూడు రోజులు సమయం ఉన్నందున ఊరూరా సంబురాలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం జరిగే భేటీలో కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముంది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో పండుగ వాతావరణాన్ని ఇనుమడించేలా కొత్త పార్టీని స్వాగతిస్తూ సంబురాలు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా రోజున పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడిన వెంటనే ఊరూరా ర్యాలీలు, ఊరేగింపులు, ముఖ్య కూడళ్ల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు, సమన్వయం చేసే బాధ్యతను మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు అప్పగించనున్నట్టు సమాచారం. ఈ అంశాలన్నింటికీ సంబంధించి ఆదివారం జరిగే భేటీలో సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు జాతీయ నేతలు కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖ నేతలను కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ నుంచి ఆహ్వానాలు అందుకున్న వారిలో ఇప్పటివరకు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్), కుమారస్వామి (కర్ణాటక), శంకర్‌సింగ్ వాఘేలా (గుజరాత్) తమ రాకను ఖరారు చేశారు. 5న ఉదయం వారు ప్రగతిభవన్‌కు చేరుకుని.. అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగే టీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ భేటీలో వారు సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొననున్నారు. మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని.. వారి పర్యటన ఒకట్రెండు రోజుల్లో ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
గన్ షాట్ : గల్లీ కార్ ఢిల్లీకి
-
అక్టోబర్ 5న కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటన..?
సాక్షి, హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు వేగవంతం చేసిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 5న దసరా పండుగ పురస్కరించుకుని లాంఛనంగా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం ఉమ్మడి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. అయితే ఈ సమావేశం ఉంటుందని కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు ధ్రువీకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పార్టీ పేరు మార్పు, జాతీయ పార్టీగా విస్తరించడానికి సంబంధించి శాసనసభా పక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించేలా కసరత్తు జరుగుతోంది. కొత్త జాతీయ పార్టీ పేరుపై చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తూ ఉత్కంఠను పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తీర్మానం కాపీ సిద్ధం! ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూనే టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చేందుకు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. ఐదో తేదీన జరిగే సమావేశంలో చేయాల్సిన తీర్మానం కాపీని సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేసే అవకాశముంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటనకు ముందు కేసీఆర్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ పోటీ చేసే ప్రతి ఎన్నికలోనూ నామినేషన్ పత్రాలతో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త జాతీయ పార్టీ ప్రకటన రోజు కూడా కోనాయపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసే అవకాశముంది. అయితే పూజల నిర్వహణకు సంబంధించి స్థానిక నాయకత్వానికి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. పాటలు, సాహిత్యంపైనా కసరత్తు జాతీయ పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన సాహిత్యం, పాటలపైనా కేసీఆర్ సూచనలకు అనుగుణంగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తొలుత హిందీ భాషలో సాహిత్యాన్ని సిద్ధం చేసి, తర్వాత ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయాలని భావిస్తున్నట్లు సమాచా రం. తెలంగాణ ఉద్యమ పాటల తరహాలో ఆయా రాష్ట్రాల్లో స్థానికులను ఆకట్టుకునే బాణీల్లోనే పాటలను రూపొందించాలని రచయితలకు సూచించినట్లు తెలిసింది. అఖిలేశ్, కుమారస్వామి రాక! జాతీయ పార్టీపై ప్రకటన చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో పలువురు ముఖ్య నేతలు, రైతు, దళిత, గిరిజన సంఘాల నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ), కుమారస్వామి (జేడీఎస్)తో పాటు మరికొందరు నేతల రాక ఇప్పటికే ఖరారైంది. జాతీయ పార్టీ పేరును ప్రకటించిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను స్వాగతిస్తూ వారు అభినందనలు తెలియజేస్తారు. విమానానికి విరాళాలు! కొత్త పార్టీ ఏర్పాటును స్వాగతిస్తూ దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు, జాతీయ పత్రికలు, మీడియాలో విస్తృత ప్రకటనలు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జాతీయ స్థాయి మీడియా సంస్థలతో టీఆర్ఎస్ వర్గాలు సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కాగా జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో అవసరమైన విస్తృత పర్యటనల కోసం రూ.80 కోట్లతో 12 సీట్ల సామర్ధ్యం కలిగిన ప్రత్యేక విమానం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పార్టీ అవసరాల కోసం ప్రస్తుతమున్న హెలికాప్టర్‌ను కొనసాగించాలా? లేక కొత్తది కొనుగోలు చేయాలా? అనే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. విమానం కొనుగోలుకు గతంలో పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన నేతతో పాటు ఇటీవల రాజ్యసభ్యుడిగా ఎన్నికైన వ్యాపారవేత్త, మరో ఇద్దరు ఎంపీలు తమ వంతు విరాళాన్ని కేసీఆర్‌కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
బిగ్ క్వశ్చన్ : కేసీఆర్ స్ట్రాటజీ ఢిల్లీలో వర్కవుట్ అవుతుందా ..?
-
జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ దూకుడు
-
అసలు కేసీఆర్‌ను అక్కడ నమ్మేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పెడతానని చెప్పడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఎద్దేవా చేశారు. తన కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ రాగం ఆలపిస్తున్నారని, అయినా కేసీఆర్‌ను నమ్మే నేతలు జాతీయ స్థాయిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ల లోపాయికారీ ఒప్పందాల్లో భాగమే కేసీఆర్ జాతీయ పార్టీ అని అన్నారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
కేసీఆర్ పర్యటనల కోసం ప్రత్యేక విమానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దేశ వ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేక విమానం (చార్టర్డ్ ఫ్లైట్) కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దసరా రోజున ఈ మేరకు ఆర్డర్ ఇచ్చే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. 12 సీట్ల సామర్ధ్యం కలిగిన ఈ విమానం కొనుగోలుకు పార్టీ రూ.80 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించాలని నిర్ణయించగా, విరాళాలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విమానం అందుబాటులోకి వస్తే దేశంలోనే సొంతగా ప్రత్యేక విమానం కలిగిన పార్టీగా టీఆర్ఎస్కు గుర్తింపు దక్కనుంది. పార్టీ ఖజానాలో రూ.865 కోట్ల మేర నిధులు ఉన్నాయి. అయినా విమానం కొనుగోలుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త పార్టీ పేరును ప్రకటించిన తర్వాత విమానానికి ఆర్డర్ ఇచ్చే అవకాశముంది. దసరాకే కొత్త పార్టీ ముహూర్తం జాతీయ పార్టీ పేరుపై కొన్ని సాంకేతిక అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి దసరా రోజునే స్పష్టత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 5న టీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ ఏర్పాటు చేసి కొత్త పార్టీ ప్రకటనతో పాటు జాతీయ పార్టీ ప్రస్థానానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు ప్రకటన ఏ తరహాలో ఉండాలనే అంశంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 5న జరిగే సమావేశానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒకటి రెండురోజుల్లో అధికారికంగా సమాచారం అందించే అవకాశముంది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలోనే యాదాద్రి, భద్రకాళి ఆలయాల సందర్శనకు కేసీఆర్ వెళ్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
పొలిటికల్ కారిడార్ : జాతీయ పార్టీ ఏర్పాటుపై పూర్తయిన కసరత్తు
-
జాతీయ పార్టీపై కేసీఆర్ కసరత్తు
-
కేసీఆర్ ‘విజన్ డాక్యుమెంట్’ రైతులు, దళితుల పురోభివృద్ధికి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహాలు వేగవంతం చేసిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రైతులు, దళితులపై కొత్త పార్టీ అనుసరించే విధానంపై కసరత్తు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు దసరాను ముహూర్తంగా ఎంచుకోగా, అంతలోగానే ఈ రెండు వర్గాల అభ్యున్నతికి ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికీ ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తి జాతీయ పార్టీ ఎజెండాలో ప్రతిబింబించాలని సంకల్పిస్తున్నారు. ఈ పథకాలకు మరికొన్ని జోడించి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, ఎస్సీలతో భేటీ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల్లో ఆచరణ సాధ్యమైన వాటికి విజన్ డాక్యుమెంట్లో చోటుకల్పిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మోడల్‌ను పరిచయం చేసేలా... దేశంలో సాగుకు యోగ్యమైన భూమి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతు అనుకూల సాగు చట్టాల రూపకల్పన తదితరాల్లో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్.. వ్యవసాయ రంగంపై రూపొందిస్తున్న ‘విజన్ డాక్యుమెంట్’లో కొత్త పార్టీ విధానాలపై స్పష్టత ఇస్తారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, దళితబంధు వంటి వాటితోపాటు దేశవ్యాప్తంగా కాళేశ్వరం తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, వనరుల వినియోగం తదితరాలను ప్రస్తావిస్తారు. తెలంగాణ రైతుల కేస్ స్టడీలు, గణాంకాలు, నిపుణుల అభిప్రాయాలు తదితరాలను పొందుపరుస్తారు. త్వరలో దేశవ్యాప్తంగా దళిత సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ చేసిన డిమాండ్‌పై జాతీయస్థాయిలో చర్చ జరిగిందని, విజన్ డాక్యుమెంట్ మరింత చర్చకు దోహదం చేస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. -
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ -
జాతీయ పార్టీ కోసం పరిశీలనలో మూడు పేర్లు
-
‘దేశ భవిష్యత్తు కోసం.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: దేశ బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు. దేశంలో మోదీ సారథ్యంలోని రాక్షసపాలన అంతం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో, ఆ విధంగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న 21 మంది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని దేశ ప్రజలు భావిస్తున్నారని బాల్క సుమన్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌తో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటవుతుందని అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలన లో దేశంలోని ఏ వర్గానికీ మేలు జరగడం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతులు, యువత, మహి ళలు, దళిత, బలహీన వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా చూస్తున్నా రని చెప్పారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని లింగయ్య యాదవ్ విమర్శించారు. జిల్లాల పార్టీ అధ్యక్షులే కాదని, అన్ని స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జాతీయ రాజకీ యాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణపై మోదీ సర్కారు కుట్ర అమిత్ షా ఆగడాలకు అడ్డుకట్ట పడాలన్నా, మోదీ మెడలు వంచాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమని మాలోత్ కవిత చెప్పారు. దేశ ప్రజలంతా ఆయన రాకకోసం ఎదురుచూస్తు న్నారని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ బ్రష్టు పట్టించారని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పద్మాదేవేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చింతా ప్రభాకర్ చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ అవసరం ఉంది దేశానికి ప్రస్తుతం కేసీఆర్ అవసరం ఎంతో ఉందని, ఆయన దేశాన్ని పాలించాలని కోరుకంటి చందర్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని సంపత్‌రెడ్డి అన్నారు. దేశాన్ని ఆవహించిన చీకటిని తొలగించే కాంతి రేఖ సీఎం కేసీఆర్ అని తాత మధు చెప్పారు. ఎంతో దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని శంభీపూర్ రాజు అన్నారు. యావత్ దేశం కేసీఆర్ కోసం తెలంగాణ వైపు చూస్తున్నదని ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. పీవీ తర్వాత దేశానికి మరోసారి ప్రధానమంత్రిని అందించాలని కరీంనగర్ ఎదురు చూస్తోందని, కేసీఆర్ దేశానికి దారి చూపాలని జీవీ రామకృష్ణారావు చెప్పారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముజీబ్, తోట ఆగయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ పార్టీ పేరు, పతాకం, ఎజెండా తదితరాలపై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పార్టీ ప్రకటన ఉండాలని భావిస్తున్నారు. పార్టీ ప్రారంభానికి జాతీయస్థాయిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు, ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ ప్రకటన తర్వాత సుమారు రెండు నెలల పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో పర్యటించేలా షెడ్యూల్ కూడా రూపొందిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గులాబీ జెండా.. భారతదేశ చిత్రపటం? వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండా ఉంటుందని అంచనా. రైతులు, దళితులు, సైనికులు, యువత తదితర వర్గాలకు పార్టీ ఎజెండాలో పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ జెండా తరహాలోనే జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులో భారతదేశ చిత్రపటంతో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీకి ‘భారతీయ రాష్ట్ర్ర సమితి’గా పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా చివరి నిమిషం దాకా పేరుపై సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. జిల్లాల్లో పార్టీ నేతల తీర్మానాలు సుమారు ఏడాదిన్నరగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్లీనరీ, పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ఆమోదం కోరుతూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇదే తరహాలో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ప్రకటన చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించే అవకాశం ఉందని తెలిసింది. ఇక కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జిల్లా, మండల స్థాయిలోనూ టీఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కీలక టీమ్‌లో వినోద్, కవిత? కొత్త జాతీయ పార్టీ విస్తరణకు అవసరమైన టీమ్‌ను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. వీరితోపాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరుల సేవలను కూడా కొత్త జాతీయ పార్టీలో కేసీఆర్ ఉపయోగించుకుంటారని సమాచారం. రేపు రాష్ట్రానికి జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలువురు బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలు, ముఖ్య నేతలతో కేసీఆర్ వరుసగా భేటీలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఆహ్వానం మేరకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీలో చిన్నా, చితకా ప్రాంతీయ పార్టీలు, దేశవ్యాప్తంగా పేరొందిన కొందరు ప్రముఖ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయా పార్టీల విలీనం, చేరికలకు సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయినట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత.. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశవ్యాప్త పర్యటనల ద్వారా కొత్త పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా కృషి చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ఎన్నికలే టార్గెట్‌గా ఇన్‌చార్జ్‌ల నియామకం.. బీజేపీ మాస్టర్ ప్లాన్స్! -
జాతీయ పార్టీ గుర్తింపునకు అడుగుదూరంలో ఆప్: కేజ్రీవాల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేందుకు అడుగుదూరంలో ఉందని నొక్కి చెప్పారు పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, వలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో ఆప్‌ను రాష్ట్రస్థాయి పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన క్రమంలో ఈ మేరకు ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ‘ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత ఆప్ ఇప్పుడు గోవాలోనూ గుర్తింపు పొందిన పార్టీగా అవతరించింది. మరో రాష్ట్రంలో గుర్తింపు పొందితే.. అధికారికంగా జాతీయ పార్టీగా ప్రకటిస్తాం. కష్టపడి పని చేసిన వలంటీర్లు ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు. ఆప్, దాని భావజాలాన్ని నమ్మిన ప్రజలను కృతజ్ఞతలు.’ అని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. జన్‌లోక్‌పాల్ ఉద్యమం తర్వాత 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. 2013 ఢిల్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటం ద్వారా 49 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధఇంచారు. 2015లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆప్. 2020లోనూ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. After Del n Punjab, AAP is now a state recognised party in Goa too. If we get recognised in one more state, we will officially be declared as a “national party” I congratulate each and every volunteer for their hard work. I thank the people for posing faith in AAP n its ideology pic.twitter.com/7UmsIixF0v — Arvind Kejriwal (@ArvindKejriwal) August 9, 2022 నేషనల్ పార్టీగా గుర్తింపు రావాలంటే? నేషనల్ పార్టీగా గుర్తింపు రావాలంటే.. దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయిన ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. లేదా గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు లేదా కనీసం 2 శాతం సీట్లు సాధించాలి. అందులో ఎంపీలు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి. లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఇదీ చదవండి: ఆగస్టు 15 లోపు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి? -
ఇక ముహూర్తమే!: కొత్త జాతీయ పార్టీకి కేసీఆర్ బాస్.. చక్రం తిప్పనున్న పీకే..
ప్రత్యామ్నాయ ఎజెండా.. ‘తెలంగాణ మోడల్’ జెండా! ► టీఆర్ఎస్ జెండాను పోలిన రీతిలో కొత్త పార్టీ పతాకం.. ఎన్నికల గుర్తుగా కారును కొనసాగించేలా ఎన్నికల సంఘాన్ని కోరాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త పార్టీ ఎజెండా కూడా ఖరారైనట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో కొనసాగగా.. ఇంచుమించు ఇవే అంశాలను జాతీయ ఎజెండాలోనూ ఎత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. విద్యుత్ సమస్య, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత, వివిధ రంగాల్లో టీఆర్ఎస్ సర్కారు ప్రగతిని రోల్ మోడల్‌గా చూపనున్నట్టు సమాచారం. ► పార్టీ ఎజెండాను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా.. వివిధ రంగాలకు చెందిన వారిని కూడగట్టే పనిని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు అప్పగించినట్టు తెలిసింది. ► దేశంలోని పలువురు వ్యవసాయ, ఆర్థిక, నీటి పారుదల, విద్యుత్, పాలనా రంగాల నిపుణులతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు జరిపారు. మొత్తంగా దేశం ముందు పెట్టాల్సిన ప్రత్యామ్నా య, ఆర్థిక ఎజెండాను రూపొందించే బాధ్యతను హైదరాబాద్‌లోని ఓ సామాజిక, ఆర్థిక అధ్యయన బృందానికి అప్పగించినట్టు తెలిసింది. ► ఇక పార్టీ ఎజెండాపై విస్తృత ప్రచారం కల్పించేందుకు దేశవ్యాప్తంగా పలు వర్సిటీల్లో సదస్సులు నిర్వహించేలా ఇప్పటికే కొన్ని విద్యార్థి బృందా లను సిద్ధం చేసినట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమ వ్యాప్తి, టీఆర్ఎస్ విస్తరణలో కీలకపాత్ర పోషించిన ‘సాంస్కృతిక కళారూపాలను కొత్త పార్టీకి కూడా జోడించనున్నారు. దీనికి అవసరమైన సాహిత్యం, కళాకారులు వంటి అనేక అంశాలపై కసరత్తు జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మూడు రోజులుగా ప్రగతిభవన్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్టు తెలిసింది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’లలో ఒక పేరును ఖరారు చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో సరైన ముహూర్తం చూసి.. కొత్త జాతీయ పార్టీ పేరు, ఎజెండా, నియమావళి, జెండా, ఎన్నికల గుర్తు తదితరాలను ప్రకటించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ కొత్త జాతీయ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరించనుండగా.. ప్రశాంత్ కిషోర్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ హోదా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏర్పాట్లపై తుది కసరత్తు.. ‘భారత రాష్ట్ర సమితి’ లేదా ‘భారత నిర్మాణ సమితి’గా టీఆర్ఎస్ అవతరించే పక్షంలో.. ఆపై రాష్ట్రంలోనూ కొత్త పేరుతోనే మనుగడ సాగించనుంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు కొత్త జాతీయ పార్టీకి చెందిన గుర్తు, ఎజెండాపైనే ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు తదితరాలను కొత్త పార్టీ పేరిట మార్పిడి చేసేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు, చిక్కులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటనతోపాటు జాతీయ కార్యవర్గం/పొలిట్ బ్యూరోను కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు, సంఘాలను విలీనం చేసుకుంటూ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు సమాచారం. కొత్త పార్టీ కార్యవర్గంలో రాజకీయ నేతలకంటే వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావి వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాపై తమ చిత్తశుద్ధిని చాటాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో బహిరంగ సభ పెట్టి.. కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశాక.. జూలై మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీ లేదా పరిసర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ సభకు తెలంగాణతోపాటు ఉత్తరాది నుంచి జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఉత్తరాదిన పార్టీ విస్తరణకు అనువైన వాతావరణం ఉందని భావిస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో రాజకీయ శూన్యత లేదనే అభిప్రాయంతో ఉన్న కేసీఆర్.. సందర్భాన్ని బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు. రైతు నేత రాకేశ్ తికాయత్ సేవలను వినియోగించుకోవడం, యూపీలో ఆర్ఎల్డీ, జార్ఖండ్‌లో జేఎంఎం, బిహార్‌లో ఆర్జేడీ, యూపీలో సమాజ్‌వాదీ వంటి పార్టీలతో ఏ తరహా సంబంధాలను కొనసాగించాలనే కోణంలోనూ కేసీఆర్ కొంతమేర స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు, కలిసి వచ్చే పార్టీలు, నేతల వివరాలతో పీకే బృందం ఇప్పటికే నివేదికలు రూపొందించినట్టు సమాచారం. కొత్త పార్టీకి ‘సినీ గ్లామర్’! జాతీయ రాజకీయాల్లో వీలైనంత త్వరగా కుదురుకోవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పార్టీకి సినీ గ్లామర్‌ను కూడా అద్దుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్ కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతుండగా.. మరో నటుడు సోనూసూద్ కూడా కొత్త పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సోషల్ మీడియా దన్నుతో.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ విస్తరణ కోసం కొన్ని జాతీయ మీడియా సంస్థల సాయం తీసుకోవడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ విధానాలపై కేసీఆర్ హిందీలో చేసిన ప్రసంగాల్లోని అంశాలు ఇప్పటికే సామాజిక మాధ్య మాల ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయని.. వేల సంఖ్యలో కామెంట్లు, లైక్‌లు వస్తున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడం హాస్యాస్పదం: ఉత్తమ్
అనంతగిరి: టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చాలనుకోవడం హాస్యాస్పదమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. రైతుభరోసా యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా అనంత గిరి మండలంలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమా ల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లోక్‌సభలో 542 ఎంపీ స్థానాలుంటే.. తెలంగాణలో 16 లేదా 17 స్థానాలకు పోటీ పడుతున్న కేసీఆర్ జాతీయ స్థాయి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని.. వాటితో జాతీయ పార్టీగా రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారని ప్రశ్నించారు. జాతీయ పార్టీ విధివిధానాలపై కనీస అవగాహన లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చాలని భావించినా అది పెద్దగా సాధ్యపడదన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతారని ఉత్తమ్ హెచ్చరించారు. -
పీకే తో సీఎం కేసీఆర్ కీలక చర్చలు
-
టీఆర్ఎస్ పార్టీని చూస్తే జాతీయ పార్టీలకు వణుకు: బాల్క సుమన్
-
జాతీయస్థాయిలో కేసీఆర్‌కు స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఇస్తామంటుంటే ఆయన మాత్రం భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పెడతా మంటూ దేశమంతా తిరుగుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు స్థానం లేదని వ్యాఖ్యానిం చారు. గ్రామపంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని, నరేంద్ర మోదీ పాలనలో దళారి పాత్ర లేకుండా లబ్ధిదారుల ఖాతాలో నగదు చేరుతుండటాన్ని కేసీఆర్ సహించలేక లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఇక్కడ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంబీసీల సదస్సులో లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంబీసీ కులాలకు మోదీ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని చెప్పారు. ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న ఓబీసీలకు కేసీఆర్ కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారని, ఇదే కేసీఆర్ గొప్పగా చెప్పే సామాజిక న్యాయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాం లో ఎంబీసీ వర్గాలు మోసపోయాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను రాష్ట్ర ఓబీసీ మోర్చా నేతలు సన్మానించారు. ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ దొమ్మాట వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నేతలు సూర్యపల్లి శ్రీనివాస్, యాదగిరి, రాజేశ్వరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, గడీల శ్రీకాంత్, ఉడుత మల్లేశ్, కడకంచి రమేశ్, పూస రాజన్న, జ్ఞానేశ్వర్, నందనం దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌వి పగటికలలే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన సెవన్ స్టార్ ఫాంహౌస్‌లో కూర్చొని జాతీయ పార్టీ ఏర్పాటుపై పగటికలలు కంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగు తున్న అత్యాచారాలు, మతోన్మాద రాజకీయా లను మొదట కట్టడి చేయాలని హితవు పలికారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లా డుతూ ఇటీవల జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి సీఎం మౌనంగా ఉండటమే కాకుండా, అలాంటి వారిని కాపాడటంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. అంతేగాక ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరగడంతోపాటు నిందితుడు అందులోనే హాయిగా తిరిగాడని మండిపడ్డారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టకుండా, ఢిల్లీ వచ్చి రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా? కొత్త పార్టీ పెట్టాలను కుంటున్నారా? అని తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని కేసీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్ చేతిలోంచి అధికారం దూరం అవుతున్నందునే అధికారాన్ని కాపాడుకొనేందుకు ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. -
కేసీఆర్ మాటన్నీ హాస్యాస్పదమే: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
-
కేసీఆర్.. టైమ్‌పాస్ రాజీయాలు చేసింది చాలు: బండి సంజయ్
-
కేసీఆర్ ఇలా చేయకుంటే దుష్ఫలితాలు గ్యారెంటీ
-
ఢిల్లీ దారిలో స్పీడ్‌గా.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో విఫలమై కనుమరుగవుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చురుకుగా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఇతర రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా తెలంగాణ తరహా పథకాలను దేశమంతటా అమలు చేసేందుకు వీలు కలుగుతుంది..’’ అని మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో పార్టీ పెడితే దానికి ఏ పేరుంటే బాగుంటుందని అభిప్రాయం కోరినట్టు సమాచారం. ఆంక్షలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి రాజకీయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, పాలనాపరమైన అంశాలు, ప్రతి విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్న పరిస్థితులను అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికకు సంబంధించి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నడుమ ఏకాభిప్రాయ సాధన కోసం మరోమారు అన్ని పార్టీల నేతలతో వరుస భేటీలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సుదీర్ఘంగా భేటీ అయి.. శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు, అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు, ప్రభుత్వ విప్‌లతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జాతీయ అంశాలపై చర్చించడంతోపాటు రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. శాంతిభద్రతలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, దళితబంధు అమలు, ఆర్టీసీ చార్జీల పెంపు, డబుల్ బెడ్రూం ఇళ్లు, 57 ఏళ్లు నిండినవారికి పింఛన్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో పాలన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ప్రతీ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ మండిపడినట్టు సమాచారం. ఇక తాను ఇటీవల జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో జరిపిన భేటీ వివరాలను కూడా సమావేశంలో కేసీఆర్ వెల్లడించినట్టు తెలిసింది. ఆర్థిక ఆంక్షలతో కేంద్రం కుట్ర ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలతో విపక్ష పార్టీలను బెదిరింపులకు గురిచేస్తూ బీజేపీ గూండాయిజం చేస్తోందని సీఎం కేసీఆర్ మండిపడినట్టు సమాచారం. ఆంక్షలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి రాజకీయం చేసేందుకు, ఆర్థిక అంశాల్లో రాష్ట్రాన్ని దోషిగా చూపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని.. దీనిని ప్రజలకు విడమర్చి చెప్పాల్సి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. బాలికపై అత్యాచార ఘటన సహా అన్ని సందర్భాల్లో పోలీసు యంత్రాంగం సమర్థంగా వ్యవహరిస్తున్నా విపక్షాలు రాజకీయం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించినట్టు సమాచారం. పాలనాపరమైన విషయాలు, రాజకీయ పరిస్థితులు, కేంద్ర వైఖరి తదితర అంశాలను ప్రజలకు వివరించేందుకు త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భేటీలో సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. సభ నిర్వహణ తేదీలు, ఎజెండా వంటివి వారం రోజుల్లో ఖరారు చేయాలని.. త్వరలో కేబినెట్ భేటీ కూడా ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. తలసాని మినహా అంతా హాజరు కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగతిభవన్ భేటీకి రాలేదు. హరీశ్‌రావు, కేటీఆర్ సహా రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు. ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని, సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావుతోపాటు చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి కూడా భేటీలో పాల్గొన్నారు. గవర్నర్ తీరు వెనుక రాజకీయ ఎజెండా! ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. గవర్నర్ తమిళిసై ‘ప్రజా దర్బార్’ నిర్వహించడం వెనుక కూడా బీజేపీ రాజకీయ ఎజెండా దాగి ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం. కేంద్రం వైఫల్యాలను నిలదీస్తుంటే మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందని పేర్కొన్నట్టు తెలిసింది. కేంద్రంపై టీఆర్ఎస్ పోరు కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారని.. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. -
హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా
తెగూసిగల్పా(హోండూరస్): సెంట్రల్ అమెరికా దేశమైన హోండూరస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్ పార్టీ ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్ష లిబర్టీ అండ్ రీఫౌండేషన్ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. మంగళవారం వరకూ 52 శాతం ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53 శాతం ఓట్లు సాధించగా, అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురాకు 34 శాతం ఓట్లే వచ్చాయి. అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది. -
అజ్ఞాత విరాళాలతో రూ. 3,370 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ పార్టీలన్నీ కలిసి 2019–20 కాలంలో రూ. 3,377.41కోట్లను గుర్తుతెలియని వనరుల(అన్నౌన్ సోర్సెస్) నుంచి సమీకరించాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫా మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. పార్టీల మొత్తం ఆర్జనలో ఈ అజ్ఞాత విరాళాల ద్వారా ఆర్జించిన మొత్తం 70.98 శాతానికి అంటే ముప్పావు వంతుకు సమానమని తెలిపింది. ఈ నిధుల్లో సింహభాగం అంటే రూ. 2,642. 63కోట్లు బీజేపీ సమీకరించగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్(రూ.526కోట్లు), ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, బీఎస్పీ ఉన్నాయని తెలిపింది. మొత్తం సొమ్ములో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ద్వారా రూ. 2,993.82 కోట్లు లభించాయని ఏడీఆర్ వెల్లడించింది. 2004–05 నుంచి 2019–20 మధ్య కాలంలో ఈ అంతుచిక్కని మార్గాల్లో పార్టీలు సమీకరించిన మొత్తం రూ. 14,651. 53కోట్లని వివరించింది. 2019–20 కాలంలో పార్టీలు సేకరించిన నగదు రూపంలో సేకరించిన మొత్తం రూ.3.18లక్షలు మాత్రమే కావడం గమనార్హం. రూ.20వేలకు పైబడిన విరాళాలకు పార్టీలు రసీదులు జారీ చేయాల్సిఉంటుంది. అయితే రూ.20వేల లోపు ఇచ్చే విరాళాల దాతల వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇలా రూ. 20వేల లోపు విరాళాన్ని ఇచ్చే వర్గాలను అజ్ఞాత వర్గాలంటారు. వీటిని ఐటీ పత్రాల్లో అన్నౌన్ సోర్సుగా పేర్కొంటారు. ఈ నిధులు ఇచ్చిన సంస్థలు, వ్యక్తుల వివరాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల విక్రయాలు, రిలీఫ్ పండ్ లాంటివన్నీ ఈ అజ్ఞాత మార్గాల కిందకు వస్తాయి. -
సిక్కింలో చిన్న పార్టీలే లక్కీ
దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలే ఎక్కువగా అధికారంలో ఉంటాయి. అప్పుడప్పుడు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మొత్తం మీద చూస్తే జాతీయ పార్టీ ప్రభుత్వాలదే మెజారిటీ. సిక్కిం దీనికి పూర్తిగా మినహాయింపు. 1975లో ఈ రాష్ట్రం భారత్‌లో విలీనమైనప్పటి నుంచి ఇంత వరకు ఇక్కడ ఏ జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకున్నాయి. 1979, అక్టోబర్‌లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో నర్బహదూర్ భండారీ నాయకత్వంలోని సిక్కిం జనతా పరిషత్ (ఎస్జేపీ) 31 సీట్లకుగాను 16 సీట్లలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో రెండు ప్రాంతీయ పార్టీలు సిక్కిం కాంగ్రెస్ (రివల్యూషనరీ)11, సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకున్నాయి. తర్వాత ఎస్జేపీ కాంగ్రెస్‌లో విలీనమైంది. కొంత కాలం తర్వాత భండారీ బయటకొచ్చేసి సిక్కిం సంగ్రామ్ పరిషత్ (ఎస్ఎస్పీ) పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 30 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1989 ఎన్నికల్లో భండారీ పార్టీ మొత్తం 32 స్థానాలను గెలుచుకుంది. 1990లో ఎస్జేపీ నేత పవన్‌కుమార్ చామ్లింగ్ భండారీపై తిరుగుబాటు చేశారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1994 ఎన్నికల్లో ఆ పార్టీ 19 సీట్లు గెలుచుకుని గద్దెనెక్కింది. 1999 ఎన్నికల్లో 24 సీట్లతో ఎస్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఎస్ఎస్పీ ప్రధాన ప్రతిపక్షమైంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో కూడా చామ్లింగ్ పార్టీ ఘన విజయం సాధించి ఐదుసార్లు వరసగా అధికారం చేపట్టిన పార్టీగా రికార్డు సృష్టించింది. ఈసారి అసెంబ్లీకి, లోక్‌సభ(ఒకటే సీటు)కు కలిసి ఏప్రిల్ 11న ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 371(ఎఫ్) అధికరణం సిక్కిం ప్రజల ప్రత్యేక హక్కుల పరిరక్షణకు హామీ ఇస్తోంది. తమ హక్కులను ప్రాంతీయ పార్టీలే పరిరక్షించగలవన్న గట్టి నమ్మకం ప్రజల్లో పాతుకుపోయిందని, జాతీయ పార్టీలను వేటినీ వారు నమ్మరని, అందుకే వారు జాతీయ పార్టీలను ఆదరించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. -
కరీంనగర్లో సభలో కేసీఆర్ కీలక ప్రకటన
-
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సంచలన ప్రకటన
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్లో జరిగిన సభలో ఆయన కీలక ప్రకటన చేశారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని ప్రకటించారు. దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలని, దేశానికి తెలంగాణ చోదక శక్తి కావాలన్నారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. (3 నెలల్లో 3 వేల సార్లు తిట్టాడు: కేసీఆర్) ‘కరీంనగర్లో మీ ఆజ్ఞ తీసుకుని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణమాలను చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని స్థాపించి భారత దేశం మొత్తాన్ని ఒక్కటి చేస్తా. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలనుకున్నా. ఇది నాకు కలిసొచ్చిన పోరాటాల గడ్డ. ఎక్కడో చోట ఎవరో ఒకరు నడుంకట్టాలి. ఆనాడు నేను పూనుకోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయాల్సిన సమయం దగ్గర పడుతోంది. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ కావాలి. ఈ రెండు పార్టీలు దేశానికి ఏమీ చేయలేదు. పేదలు, రైతులను పట్టించుకోలేదు. దేశం బాగుపడాలంటే వ్యవస్థాగతమైన మార్పులు రావాలి. అటువంటి మార్పులు రావాలంటే దేశ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం కావాలి. దేశ రాజకీయాల్లో తప్పనిసరిగా తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలి. మీరు 16 మంది ఎంపీలను గెలిపిస్తే నేను 160 మంది ఎంపీలను జమచేస్తా. కరీంనగర్ ప్రజల దీవెనలతో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను బలోపేతం చేసి, ఈ దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి అద్భుతమైన భారత దేశ నిర్మాణానికి ముందడుగు వేస్తాన’ని కేసీఆర్ అన్నారు. -
‘ఏకైక’ హోదాతో ఏంచేస్తారు?
నేటి ఏకైక ‘జాతీయ’ పార్టీ హోదాతో బీజేపీ నాయకత్వం ఏం చేస్తుందో ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పటికైనా వారు వాగ్దానం చేస్తున్న ‘అభివృద్ధి’ని ఆచరణలో చూపడం కోసం ప్రయత్నిస్తారా? లేక విభజనాత్మక, ప్రతీఘాతక అజెండాతో దేశాన్ని పునర్నిర్వచించాలనే తమ కృషిలో ముందుకు సాగుతారా? సంఘ్ పరివార్ ఈ రెండూ చేయాలని కోరుకునే అవకాశం ఎక్కువ. ఉత్తమ పాలననిచ్చేదిగా బీజేపీని ప్రయోగిస్తూ, ఆర్ఎస్ఎస్, దాని అను బంధ సంస్థలూ తమ మౌలిక హిందుత్వ అంజెండాను ముందుకు నెట్టే కృషి చేయవచ్చు. తాజా శాసనసభల ఎన్నికల్లో అసోంను భారతీయ జనతా పార్టీ చేజి క్కించుకోగా, కేరళను వామపక్షాలు హస్తగతం చేసుకున్నాయి. ఇక బెంగా ల్లో మమతా బెనర్జీ, జయలలిత తిరిగి అధికారంలోకి వచ్చారు. ఒక ప్పడు దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఆధిపత్యశక్తిగా ఉన్న ప్రధాన ‘జాతీయ’ పార్టీగా కీర్తిగాంచిన కాంగ్రెస్ నేడు ఘనకీర్తిగల ప్రాంతీయ పార్టీకి మించి మరేమీ కాదనే వాస్త వాన్ని ఈ ఫలితాలు ధృవీకరించాయి. నేడు మనం చూస్తున్న ఈ కాంగ్రెస్ క్షీణత విడి విడిగా ఆ పార్టీ, ప్రత్యే కించి 2013 నుంచి ఎడతెరిపి లేకుండా ఎదుర్కొంటున్న ఎన్నికల పరాజ యాలన్నింటి మొత్తం మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం గలది. రాజస్థాన్, ఢి ల్లీలలోనే గాక ఆ పార్టీ హరియాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్‌లలో... ఇప్పుడు కేరళ, అసోంలలో అధికారాన్ని పోగొట్టుకుంది. వీటిలో ప్రతి చోటా అది తన ఓట్ల వాటాను కూడా కోల్పోయింది. ఓట్ల శాతాన్ని నిలబెట్టుకున్న లేదా విస్తరింపజేసుకోగలిగిన ప్రతి చోటా అది శక్తివంతమైన ప్రాంతీయ శక్తుల పుణ్యమే. తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమ బెంగాల్లో వామపక్షాలతో, బిహార్‌లో ఆర్జేడీ- జేడీయూ(యు)తో చెలిమి దానికి అలాగే లాభించింది. అసోం (హేమంత బిశ్వశర్మ), తమిళనాడు(జీ వాసన్), అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సీనియర్ పార్టీ నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్ ప్రాభవ క్షీణతకు అనధికా రికమైన కొలబద్ధ అవుతుంది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్ ప్రధాన శక్తి కాకుండా పోయిన నాటి తొలి క్షీణ దశలలో... ప్రాంతీయ శక్తులతో పొత్తు కలవాలా లేక ఒంటరిగా బరిలోకి దిగాలా? అనే చర్చ ఆ పార్టీలో అంతర్గతంగా జరుగు తుండేది. నేడు ప్రాంతీయ పార్టీలతో కలిసినా, విడిపోయినా దానికి పరా భవం తప్పకపోవడం ఈ క్షీణత ఎంత వేగంగా సాగుతోందో తెలుపు తుంది. అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో తెగతెంపులు చేసుకున్నా అది ఓడిపోయింది. బెంగాల్లో వామపక్షాలతో చేయికలిపి వాటి కంటే ఎక్కువ సీట్లను సంపాదించగలిగినా... ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి లభిం చిన ఓట్ల శాతంతో పోలిస్తే దాని ఓట్ల శాతం స్వల్పంగానే ఎక్కువ. అవిభక్త భారత కమ్యూనిస్టు పార్టీ ఒకప్పుడు దేశంలోని రెండవ అతి ముఖ్య జాతీయ పార్టీగా ఉండేది. కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. కానీ, పశ్చిమబెంగాల్లో వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాన్ని నివారించాలనే అవి అక్కడ కాంగ్రెస్‌తో సమస్యాత్మకమైన పొత్తుకు సిద్ధపడ్డా, అది జరగక తప్పలేదు. కేరళ గెలుపులోని సంతోషాన్ని అది హరించేసింది. విస్తరిస్తున్న కమలం ప్రధానంగా అమిత్ షా, ఆయన సలహాదారుల సముచితం కాని, విభజన వాద ప్రచారం వల్ల బీజేపీ ఢిల్లీ, బిహార్లలో పెద్ద ఎదురు దెబ్బలు తిన్నది. అయినాగానీ దేశంలోని నిజమైన ఏకైక జాతీయ పార్టీగా దాని స్వభా వాన్ని నిరాకరించలేం. అసోం గణపరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ వంటి ముఖ్య ప్రాంతీయ శక్తులతో కలసే అయినా... అసోంలో బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌తో పోల్చ దగిన స్థాయి ఓట్ల వాటాను తనకు తాను సాధించగలిగింది. పశ్చిమ బెంగాల్లో అది తన ఓట్ల వాటాను 2011తో పోలిస్తే రెట్టింపునకు పెంచు కోగలిగింది. చూడబోతే కాంగ్రెస్ ఓట్ల వాటా కంటే దానికి దాదాపు ఒక్క శాతం మాత్రమే తక్కువగా లభించినట్టుంది. ఈ ఎన్నికల్లో అది బెంగా ల్లో రెండు సీట్లను, కేరళలో ఒక్క సీటును మాత్రమే గెల్చుకున్నా... ఆ రెండు శాసనసభలలో బీజేపీ ప్రవేశం చెప్పుకోదగినదే. కేరళలో ఈసారి పోలైన ఓట్లలో దాదాపు 10.7% బీజేపీకి లభించాయి. ఇది, 2011తో పోలిస్తే ఎక్కువ కావడమే కాదు, 2014 ‘మోదీ గాలి’ కంటే కూడా ఎక్కువ. బీజేపీ ఆ రాష్ట్రంలో పై నుంచి రుద్దినదిగా కాక, స్థానిక నిర్మాణంతో అభివృద్ధి చెందుతున్న పార్టీగా ఆవిర్భవిస్తోందని ఇది సూచిస్తుంది. అయితే తమిళనాడు నేటికీ బీజేపీకి అననుకూలమైనదే. గత నాలుగు దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని రెండు ద్రవిడ పార్టీలు ఎంత సమర్థవంతంగా పంచేసుకున్నాయంటే... ‘జాతీయ’ పార్టీలు అక్కడ వాటికి తోకలుగా ఉండటానికి మించి చేయగలిగింది పెద్దగా ఏమీలేదు. జాతీయ పర్యవసానాలు నేటి ఏకైక ‘జాతీయ’ పార్టీగా బీజేపీ హోదా నిర్వివాదమైనదే. అయితే ఈ హోదాతో ఆ పార్టీ నాయకత్వం ఏం చేయాలనుకుంటుందనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఇక ఇప్పటికైనా అది తమ నేతలు వాగ్దానం చేస్తున్న ‘అభివృద్ధి’ని ఆచరణలో చూపడం కోసం ప్రయత్నిస్తుందా? లేకపోతే విభ జనాత్మక, ప్రతీఘాతక అజెండాతో దేశాన్ని పునర్నిర్వచించాలని ఇప్పుడు చేస్తున్న కృషిలో ముందుకు సాగుతుందా? సంఘ్ పరివార్ ఈ రెండు రంగాలలోనూ ముందడుగు వేయాలని కోరుకునే అవకాశం ఎక్కువ. ఉత్తమ పాలననిచ్చేదిగా బీజేపీని ఉపయోగిస్తూ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు తమ మౌలిక హిందుత్వ అజెండాను, ప్రత్యేకించి కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలలో ముందుకు నెట్టే కృషి చేయవచ్చు. బీజేపీ దురహంకారాన్ని, అసహనాన్ని పెంపొందింపజేసే పార్టీ అనే ఆరోపణను ‘ప్రజలు’ తిరస్కరించారని ప్రకటించడానికి ఈ ఎన్నికల ఫలి తాలను సహజంగానే అది జాతీయస్థాయిలో వాడుకుంటుంది. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో ఏదో ఒక రూపంలో గోమాంసాన్ని తినే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల బీజేపీ ఆ రాష్ట్రాల ఎన్నికల ప్రచారాన్ని ‘గో సంరక్షణ’కు దూరంగా ఉంచింది. అలా అని బీజేపీ తమకు లబ్ధి చేకూరు తుందనుకున్నచోట మతతత్వ పాచికను ప్రయోగించకుండా తగ్గుతుం దనేం కాదు. కేరళ, బెంగాల్‌లలో వచ్చే రెండు దశాబ్దాల కాలంలో బీజేపీ అధికారం కోసం పోటీ పడే ప్రధాన శక్తులలో ఒకటిగా ఆవిర్భవించగలదని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో అది కాంగ్రెస్ ఓట్లను రాబట్టు కున్నదని విశ్వసించడానికి తగ్గ కారణాలున్నాయి. అయితే దీర్ఘకాలంలో వామ పక్షాల ఓట్ల వాటాను కూడా లాక్కోవాలని అది ఆశిస్తుంది. బహుముఖ వైవిధ్యంగలవేగాక, పౌర (అధికారిక ఆదేశాలతో సంబంధం లేని) లౌకికవాద సంప్రదాయం దీర్ఘకాలంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో సంఘ్ బ్రాండు కఠోర దురంహంకారం పనిచేస్తుందా? అనేది వేచి చూడాలి. అసోం కొత్త ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కు ఏ మాత్రం స్వేచ్ఛ లభిస్తుందనేది కూడా అనూహ్యమైనదే. అస్సాం విద్యార్థి ఉద్యమం నుంచి పుట్టిన ఆ నేత బీజేపీలోకి ‘పక్క దారి’ గుండా (ఏజీపీ నుంచి) వచ్చి చేరినవారు. ‘బంగ్లాదేశీయుల’ పట్ల ఆయన ఎప్పుడూ కఠిన వైఖరిని తీసుకునేవారు. సోనోనాల్ తన అసోమీ జాతీయవాదం లౌకిక స్వభావాన్ని పదేపదే నొక్కి చెప్పారు. ఆర్ఎస్ఎస్, అసోంలో కొత్తగా సమకూరిన పలుకుబడిని ఎప్పుడు అణచివేత అజెండాను ముందుకు నెట్టడానికి వాడుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు అది కొత్త ముఖ్యమంత్రి రాజకీయ సత్తాకు నిజమైన పరీక్ష అవుతుంది. హిందుత్వ పాచిక పారినా పారకున్నా... కాంగ్రెస్, వామపక్షాలు రెండూ ఈ ఎన్నికల్లో దెబ్బతిన్నాయనే వాస్తవం ఆర్ఎస్ఎస్, బీజేపీలు జాతీయ స్థాయిలో మరింత తెగువను చూపడానికి సాహసించేలా చేస్తాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల దిశకు సాగుతుండగా మధ్యలోని కీలక మజిలీ అయిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందటి రానున్న నెలల్లో పార్లమెంటులోనూ, బయటా సంఘర్షణాత్మక రాజకీ యాలు తీవ్రం కావచ్చు. అక్కడి శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా నెలల గడువుంది. రాష్ట్రంలోని విభిన్న వ్యూహాత్మక ప్రాంతాల్లో హిందుత్వ పాచికను ప్రయోగిస్తుందనడానికి క్షేత్ర స్థాయి సూచనలు ఇప్పటికే కనిపి స్తున్నాయి. ఢిల్లీ, బిహార్ లలో హిందుత్వ బీజేపీకి ఉపయోగపడక పోయినా... ఉత్తరప్రదేశ్ భిన్నమైనదని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఆ పార్టీ ప్రత్యర్థులు బిహార్లోలాగా కలసి కట్టుగా బరిలోకి దిగే అవకాశాలుగానీ, వాటిలో ఒకటి ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీలా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా అవత రించే అవకాశాలుగానీ అతి స్వల్పం. ప్రధాని నరేంద్రమోదీ శాశ్వత ఎన్నికల ప్రచార పంథాలో పనిచేస్తుం డటం వల్ల ఆయన తన ‘బాధా-ముక్త్ భారత్’ (బాధల నుంచి విముక్తి చెందిన భారతం) అనే లక్ష్యానికి హామీ ఉండేలా ‘యుద్ధ ఖైదీలను పట్టుకునేది లేద’నే వైఖరిని అవలంబిస్తున్నారు. ఇది బీజేపీ తన ఇష్టానుసారం చేయడానికి అనువైన రాజకీయ, సంస్థాగత వాతావర ణాన్ని సృష్టిస్తుంది. తాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఇక ఎంత మాత్రమూ దానికి అటంకం కాదనడానికి రుజువు. ఇక మిగిలినవి ప్రాంతీయ పార్టీలు, అ హోదాకు అర్హత సంపాదించనున్న వామపక్షాలే. దీర్ఘకాలంలో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో కూడా తలపడుతుంది. జాతీయ పార్టీ హోదా తనకు మాత్రమే ఉన్నదని దానికి తెలుసు. కాబట్టి ఒకటి, రెండు రాష్ట్రాల్లో ఓడినాగానీ లేదా ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించడంలో విఫలమైనాగానీ ఆ హోదా దానికి 2019 ఎన్నికలకు కచ్చితమైన అనుకూలత అవుతుంది. thewire.in సౌజన్యంతో వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - సిద్ధార్థ వరదరాజన్ -
జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారనుంది. ఈ నెల 28న టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికకానున్నారు. హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు టీడీపీ 'మహానాడు' జరగనుంది. ఈ సమావేశాల్లో టీడీపీ జాతీయ పార్టీగా ప్రకటించకోనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 14, తెలంగాణ నుంచి 10 తీర్మానాలను టీడీపీ నేతలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో ప్రభుత్వ పథకాలు, తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగనుంది. మహానాడుకు దాదాపు 25 వేలమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. -
ఆదిలోనే హంసపాదు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కే ప్రయత్నం చేసినట్లుగా తయారైంది తెలుగుదేశం పార్టీ వాలకం. పార్టీని తమిళనాడులో విస్తరించేందుకు శుక్రవారం చెన్నైలో నిర్వహించిన సన్నాహక సమావేశం ఆదిలోనే హంసపాదు అనే విమర్శలకు తావిచ్చింది. ఆంధ్రుల ఆత్మాభిమానం నిలబెట్టాలనే లక్ష్యంతో నటరత్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారు. రాష్ట్ర చరిత్రలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ అనతికాలంలోనే అందరి అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చింది. తెలుగువారంతా తమ పార్టీ అని భావించేస్థాయికి ఎన్టీఆర్ తీసుకువచ్చారు. ఎన్టీఆర్ చేతి నుంచి బలవంతంగా పార్టీ పగ్గాలు లాక్కున్న చంద్రబాబు తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీని జాతీయపార్టీగా విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తమిళనాడుపై దృష్టి సారించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్ననాటి నుంచి తెలుగువారు తమిళనాడులో స్థిరపడిపోయారు. రాష్ట్రంలో 30 శాతానికి పైగా తెలుగువారున్నట్లు అంచనా. పొరుగు రాష్ట్రాల్లో టీడీపీని బలోపేతం చేసేందుకు తొలి అడుగును తమిళనాడులో వేశారు. తమిళనాడులో భారీఎత్తున సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ప్రాంతీయపార్టీని జాతీయస్థాయి పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తమిళనాడులోని తెలుగుదేశం అభిమానులతో సమావేశమై ఇన్చార్జ్ పేర్లను ప్రకటించి దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదుతో తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అభిమానులతో శుక్రవారం సన్నాహక సమావేశం అంటూ నిర్వహించారు. తమిళనాడు పరిశీలకులుగా నియమితులైన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో కనీసం 5 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. జాతీయ పార్టీ బీజేపీతో పోల్చుకుంటూ ఒకప్పటికి తమ పార్టీ సైతం కేంద్రంలో అధికారం చేపట్టేస్థాయికి చేరుకోవడం తథ్యమని బీరాలకు పోయారు. ఈనెల 17వ తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అంకితం కావాలని ఉద్బోధించారు. అసలుకు లేదు ఆహ్వానం ః అంతాబాగానే ఉన్నా... పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన వారిని సన్నాహక సమావేశానికి ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తరుపున అనేక కార్యక్రమాలు జరిగాయి. ఎంతో కష్టనష్టాల కోర్చి పార్టీని భుజాన వేసుకుని తిరిగినవారున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన చెన్నైకి వచ్చినపుడల్లా నీడలా వెంట తిరిగిన వారు ఉన్నారు. మౌళివాక్కంలో బహుళ అంతస్తుల మేడ కుప్పకూలిన సమయంలో సీఎం హోదాలో చంద్రబాబు పరామర్శకు రాగా ఆరోజు అనధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసిన వారు ఎందరో ఉన్నారు. అయితే పార్టీ సన్నాహక సమావేశానికి వీరెవ్వరికీ ఆహ్వానాలు కాదుకదా కనీసం సమాచారం లేదు. సాక్షాత్తు లోకేష్‌తో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశం అయిన వారు కూడా ముఖం చాటేశారు. తమిళనాడులో అత్యున్నత హోదాపరంగానేకాక కులపరంగా సైతం పెద్ద దిక్కుగా నిలిచే చంద్రబాబు సన్నిహితుడే మీడియాలో వార్త చూసే సన్నాహక సమావేశం గురించి తెలుసుకున్నానని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంబరపడిపోయిన మరెందరినో సన్నాహక కమిటి నుండి పిలుపు అందలేదు. తమిళనాడులో పార్టీ ఇంకా మొలకెత్తక ముందే ఇన్ని వర్గాలు, విభేదాలు, అవగాహనా లోపాలా అంటూ అదే పార్టీకి చెందిన నేతలు మెటికలు విరిచారు. పార్టీకోసం ఇన్నాళ్లూ ఎవరు పాటుపడ్డారో గుర్తించని స్థితిలో 5 లక్షల సభ్యత్వం ఎలా సాధ్యమని వారు ఎద్దేవా చేశారు. తాము మరుగున పడిపోతామనే భయంతోనే సన్నాహక సమావేశం నిర్వాహకులు తనను ఆహ్వానించలేదని ఒక టీడీపీ ముఖ్యనేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
జాతీయ పార్టీగా ఎదగనున్న తెలుగుదేశం
-
బలమైన జాతీయ పార్టీగా తీర్చి దిద్దుతాం
సంగారెడ్డి క్రైం : దేశంలో బీజేపీని బలమైన జాతీయ పార్టీగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడుతూ బీజేపీ గత ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా గణనీయమైన ఓట్లు సాధించిందన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. తెలంగాణ లో ప్రస్తుతం తమ పార్టీకి నాలుగున్నర లక్షల సభ్యత్వం ఉందని, దీనిని 25 లక్షలకు పెంచడమే ధ్యేయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విధానాలనే అవలంబిస్తోందని విమర్శించారు. తమ పార్టీ సుపరిపాలన, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందని తెలిపారు. మార్చి 31 తర్వాత దేశంలోనే అతి బలమైన పార్టీగా బీజేపీ అవతరిస్తుందన్నారు. మైనార్టీలు సైతం తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, అనంతరావు కులకర్ణి, విష్ణువర్దన్‌రెడ్డి, సత్తమ్మ, విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు. ధరల నియంత్రణలో విజయవంతం రామచంద్రాపురం : నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంజిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరకుల ధరలను నియంత్రించడ జరిగిందన్నారు. అందులో భాగంగానే పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. కాశ్మీర్లో సైతం బీజేపీ ఘన విజయం సాధించిందంటే ప్రజలు బీజేపీని ఎంతగా ఆదరిస్తున్నారో తెలుస్తోందన్నారు. ఉపాధి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ఒక శక్తిగా తయారవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆదెల్లి రవీందర్, గౌస్, గాలిరిగి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పార్టీగా వైఎస్సార్ సీపీ
దేశం గర్వించేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదాం: జగన్ వైసీపీ కార్యాలయంలో తెలంగాణ సంబురాలు జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించిన జగన్ 2నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులు తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ ఉన్నారని వెల్లడి హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి జాతీయ పార్టీగా కొనసాగనుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు తొలిసీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. మంచి చేసే ప్రతి పనికి వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండా ను జగన్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రెండునిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఒకే భాష, ఒకే జాతిగా ఉన్న రెండు రాష్ట్రాల ప్రజలుగా ఒకరికొకరు సహకరించుకుంటూ దేశం గర్వపడేలా తెలుగువారి ఖ్యాతిని ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పోయింది. తెలంగాణ రాకముందు అంతా కలిసి ఉండాలని.. తెలుగు వారిని చూసి దేశమంతా గర్వపడేలా ఉండాలని తాపత్రయపడ్డాం. కానీ విభజన జరిగిపోయింది. అయినా రాష్ట్రాలను వేరు చేయగలిగారుగాని తెలుగు వారి మనసులను వేరు చేయలేరని మరోసారి ఉద్ఘాటిస్తున్నా. ఈ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఆ ప్రాంతం వారు తోడుగా ఉంటారు. ఆ ప్రాంతం వారికి ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంతం వారు తోడుగా ఉంటారు..’’అని జగన్మోహన్రెడ్డి చెప్పారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ ప్రతీ ఒక్కరి గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ ప్రజల కోసం వైఎస్ గడప, గడపను తట్టారని, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా చేశారని ఆయన పేర్కొన్నారు. రైతులు 17 లక్షల పంపుసెట్ల ఆధారంగా వ్యవసాయం చేయగలుగుతున్నారంటే.. అది రాజశేఖరరెడ్డి ద్వారానే జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి వైఎస్ అండగా నిలబడ్డారు కాబట్టే, రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణలో కూడా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని కచ్చితంగా తెలంగాణలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని జగన్ చెప్పారు. తెలంగాణ నేతలతో సమావేశం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణకు చెందిన నేతలతో జగన్ అరగంట పాటు ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచనలు జరిపారు. వైఎస్ కలలు కన్న సువర్ణయుగాన్ని తెలంగాణలో తెచ్చుకునేందుకు కచ్చితమైన ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అడహక్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, హెచ్.ఎ.రెహ్మాన్, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, విజయారెడ్డి, కె.శివకుమార్, టి.వెంకట్రావ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
రంగంలోకి అమిత్ షా!
తమిళనాట కమలనాథుల్లో మరింత ఉత్సాహాన్ని నింపడంతో పాటుగా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహ రచనలు చేస్తోంది. రాష్ర్ట పార్టీ బలోపేత బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షాకు అప్పగించేందుకు నిర్ణయించారు. - బీజేపీ బలోపేతానికి వ్యూహాలు - రాష్ట్ర కొత్త అధ్యక్షుడి బాధ్యత ఆయనకే సాక్షి, చెన్నై: నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన క్షణం నుంచి రాష్ట్రంలోని కమలనాథులు ఉత్సాహంతో పార్టీ పనుల్లో నిమగ్నమయ్యూరు. ఒకప్పుడు చతికి ల బడి, దిక్కుతోచని స్థితిలో ఉన్న నాయకుల్లో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం వచ్చింది. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా, తమ మిత్రులను చేజార్చుకోకుండా కమలనాథులు జాగ్రత్త పడుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీకి సరికొత్తవ్యూహాలను రచించి ఇవ్వడంతో పాటుగా, కొత్త అధ్యక్షుడి ఎంపిక, పూర్తి స్థాయిలో బలోపేత బాధ్యతలను ఇన్చార్జ్ భుజాన వేయడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించి ఉంది. మోడీ సన్నిహితుడు: దక్షిణాదిలో తమిళనాట పార్టీ బలహీనంగా ఉన్న దృష్ట్యా, ఇక పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం తన దృష్టిని ఇక్కడ పెట్టనుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గా మురళీ ధరరావు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త బాధ్యతలను చేపట్టేందుకు అమిత్ షా సిద్ధం అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా గుజరాత్లో కీలక నేత. జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అమిత్ షా వ్యూహాలను తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రాల్లో అమలు చేయించేం దుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా తమిళనాడు మీద తొలుత అమిత్ షా తన దృష్టిని కేంద్రీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. త్వరలో ఆయన నియూమకాన్ని ధృవీకరిస్తూ అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆయన రాకతో ఎన్నికల మిత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరెవరు తమతో కలసి వస్తారన్నది తేల్చుకున్నాకే, తదుపరి వ్యూహాలను అమిత్ షా అమలు చేయనున్నట్లు సమాచారం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లోపు బలమైన శక్తిగా తమిళనాడులో బీజేపీ కూటమి అవతరించాలన్న లక్ష్యంతో అమిత్‌షా తన వ్యూహాలకు పదును పెట్టనున్నారన్న ప్రచారం కమలనాథుల్లో పుంజుకుంటోంది. ఆయన వచ్చాకే, కొత్త అధ్యక్షుడెవరన్నది తేలుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త అధ్యక్షుడెవరో: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. దీంతో రాష్ట్ర పగ్గాలు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ సీనియర్లు ఎందరో ఉన్నారు. రాష్ట్ర పార్టీలో పనిచేసినానంతరం వీరిలో అనేక మందికి జాతీయ పార్టీలో చోటు దక్కింది. ఈ దృష్ట్యా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో సేవలను అందిస్తున్న వారిలో ఒకరికి అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ రేసులో బీజేపీ ఉపాధ్యక్షుడిగా హెచ్ రాజా, ప్రధాన కార్యదర్శిగా వానతీ శ్రీనివాసన్ ఉన్న ట్టు సమాచారం. అయితే, మహిళా కార్డును తెర మీదకు బీజేపీ తెచ్చే అవకాశాలు ఉన్నా యి. వానతీ శ్రీనివాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలో చేరిన కొన్నాళ్లకే ప్రధా న కార్యదర్శి పదవిని ఆమె దక్కించుకున్నారు. ఇందుకు కారణం పార్టీ కోసం ఆమె సేవ, వాక్ చాతుర్యమే. ఆమె వాక్ చాతుర్యాన్ని బీజేపీ పెద్దలు మోడీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, సుష్మా స్వరాజ్ ప్రత్యేకంగా ప్రశంసించిన సందర్భాలు అనేకం. మహిళలకు మోడీ కేబినెట్లో పెద్ద పీట వేసిన దృష్ట్యా, ఇక్కడ కూడా మహిళను తెర మీదకు తెచ్చే అవకాశాలు ఎక్కువే. -
జాతీయ పార్టీగా తీర్చిదిద్దుకుందాం
టీడీపీ మహానాడు ఏకగ్రీవ తీర్మానం పోలవరంపై కేసీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని బాబు వ్యాఖ్య హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నిర్వహించిన మహానాడు ఏకగ్రీవంగా తీర్మానించింది. హైదరాబాద్ శివారు గండిపేటలో జరిగిన టీడీపీ 33వ మహానాడులో బుధవారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ మేరకు తీర్మానం ప్రవేశ పెట్టగా ప్రతి నిధులు ఆమోదం తెలిపారు. దేశంలో 30 శాతం తెలుగువారు ఉన్నారని, వారందరూ టీడీపీని ఎప్పుడు జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా యనమల పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామ్యంగా కొనసాగుతున్న మనం ఒక పక్క జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీకి సహకరిస్తూనే టీడీపీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో దేశ రాజకీయాల్లో టీడీపీ పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన సమస్యపై రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని మహానాడులో మరో తీర్మానాన్ని ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలనికే ంద్రం ప్రతిపాదించినప్పుడు నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అప్పట్లోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రక టించిందని.. ఈ విషయంలో అనవసర అపోహలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత ంలో సీమాంధ్ర వారి పెట్టుబడులు వద్దంటే ఈ ప్రాంత ప్రజలు నష్టపోతారని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడుతున్న నేపథ్యంలో పరస్పరం సహకరించుకోవాల్సింది పోయి రెచ్చగొట్టడం సరికాదన్నారు. సీమాంధ్రలో టీడీపీ ప్రకటించిన ప్రణాళికను తాము అమలు చేస్తామని, తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక అమలు కోసం పోరాటం చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు తాను అండగా ఉంటానన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించిన వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తామని.. తెలంగాణ ప్రభుత్వం కూడా కేసులు ఎత్తి వేయాలని, అమరవీరులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుల్లెట్లా దూసుకుపోతా.. అందుకే గెలిచా... అధైర్యం అనేది తన డిక్షనరీలో లేదని, తనది బండ, మొండి ధైర్యమని చంద్రబాబు అన్నారు. బుల్లెట్లా దూసుకుపోతానని, అందుకే ఈ ఎన్నికల్లో విజయం సాధించానని చెప్పారు. బీజేపీతో పొత్తు వద్దని పలువురు చెప్పారని.. దేశం, తెలుగుజాతి ప్రయోజనాల కోసం, కాంగ్రెస్‌ను ఓడించి భూస్థాపితం చేసేందుకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని పేర్కొన్నారు. 8న సీఎంగా ప్రమాణం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను జూన్ ఎనిమిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బాబు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11.45 గంటలకు విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. అంతకుముందు తిరుపతిలో తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని, ఈ తేదీని ఒకటి, రెండురోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రెండు రోజుల మహానాడుకు 75 వేల మందికి పైగా హాజరయ్యారన్నారు. కార్యకర్తల కోసం ప్రత్యేక నిధి: లోకేష్ సూచన పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని చంద్రబాబు కుమారుడు లోకేష్ సూచించారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని నిర్వహణ బాధ్యతను అప్పగించాలన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆరు కోట్లతో పాటు మహానాడులో విరాళంగా వచ్చిన రూ.14 కోట్లను కలిపి రూ.20 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. మహానాడులో పార్టీకి.. నేతలు రాయపాటి, గల్లా జయదేవ్, చైతన్యరాజు, పేరం హరిబాబు, ప్రత్తిపాటి పుల్లారావులు రూ.50 లక్షల చొప్పున, జీవీఎస్ ఆంజనేయులు రూ.60 లక్షలు, గంటా శ్రీనివాసరావు రూ.20 లక్షలు, చామకూర మల్లారెడ్డి రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. బాబు లేఖ వల్లే తెలంగాణ వచ్చింది: మోత్కుపల్లి సీనియర్ నేత మోత్కుపల్లి ప్రసంగిస్తూ చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. చదువుకున్న యువతకు టికెట్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. ప్రముఖులకు సన్మానం మహానాడు పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన ప్ర ముఖులు అంపశయ్య నవీన్ (సామాజిక విశ్లేషకులు), తిరునగరి (కవి, విమర్శకులు), చంద్రబోస్ (సినీ గీత రచయిత), మంతెన వెంకట రామరాజు (వసుధా ఫౌండేషన్), రాజేంద్రప్రసాద్ (సినీ నటుడు), పర్వతనేని వెంకటకృష్ణ (పాత్రికేయుడు) తదితరులకు ఎన్టీఆర్ పురస్కారాలను అందజేశారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఎన్టీఆర్‌కు ఆయన జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌లో విడివిడిగా నివాళులుర్పించారు. చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, వియ్యంకుడు బాలకృష్ణ వెంటరాగా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొనటంతో పాటు కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ.. తన సోదరులు, సోదరీమణులతో పాటు కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రాంతో కలిసి వచ్చి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి.. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మనవడు, మనవరాలితో వచ్చి నివాళులర్పించారు. సాక్షిని అనుమతించని నేతలు మహానాడు రెండోరోజు విశేషాలను కవర్ చేయడానికి కూడా తెలుగుదేశం నేతలు సాక్షిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ ఆ వివరాలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి ప్రతినిధులను సమావేశ ప్రాంగణంలోకి నేతలు అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు పాఠకులకు ఈ వార్త అందిస్తున్నాం. -
జాతీయపార్టీగా టిడిపి:మహానాడులో తీర్మానం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ఆమోదించాలని మహానాడులో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా ఆమోదించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుందన్న ధీమాను పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జాతీయపార్టీ కావాలంటే మూడు నాలుగు రాష్ట్రాలలో సగటున ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవలసి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా నమోదైన టీడీపీ ఇప్పటివరకు అలాగే కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేయాలంటే, దానికి జాతీయ పార్టీ గుర్తింపు కావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఆ పార్టీ ఆరు శాతం ఓట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మరో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లను సాధించడమే ఇబ్బంది. అయితే ఇందు కోసం ఆ పార్టీ పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలతోపాటు తెలుగువారి అధికంగా ఉన్న పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి చోట్ల కూడా ఎన్నికల్లో పోటీచేయాలన్న ఆలోచనతో ఉంది. -
జాతీయ పార్టీగా టీడీపీ ?
-
హస్తం... నిస్తేజం
సాక్షి, రాజమండ్రి : కాంగ్రెస్ శ్రేణులను నిరాశానిస్పృహలు అలముకున్నా యి. ‘పండగపూటా.. ముగ్గుకు నోచని వాకిలి’లా.. ఎన్నికల వేళా వారిలో స్తబ్దత తాండవిస్తోంది. పేరుకు జాతీయ పార్టీ అయినా.. ఏ వాడకు వెళ్లినా పన్నెత్తి పలకరించే వారే కరువయ్యారు. రాష్ట్ర విభజనకు ఒడిగట్టిన కాంగ్రెస్ అధిష్టానంపై జనంలో రగులుతున్న ఆగ్రహం ఆ పార్టీ స్థానిక నేతలను రోహిణీ కార్తెలో ఎండలా దహిస్తోంది. ‘ఇలాంటి పరిస్థితి పగవారికి సైతం వద్దురా బాబూ!’ అనుకునేంతగా ఆ పార్టీ శ్రేణులు నిర్వేదం చెందుతున్నారు. గత ఎన్నికలప్పుడు ఇదే నెలలో ప్రతి కార్యకర్తలో రెట్టించిన ఉత్తేజం, దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఇనుమడించిన సమరోత్సాహం గుర్తుకు వచ్చి ‘ఇంతలోనే ఎంత మార్పు! నాడు పెళ్లింట్లోలా కోలాహలం.. నేడు పాడె లేచిన కొంపలోలా కమ్ముకున్న వైరాగ్యం!’ అంటూ బరువెక్కిన గుండెలతో నిట్టూరుస్తున్నారు. అనేకులు అసలు ఉందో, లేదోనన్న సందేహం కలిగే స్థితిలో ఉన్న పార్టీకి ఇంకా అంటి పెట్టుకుని ఉండాలా, విడిచిపెట్టి వెళ్లాలా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే ఆయువుపట్టు. పునాదిప్రాయం. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ ఆయువుపట్టు కదిలిపోయింది. పునాది కుదుపునకు లోనైంది. తాము చెమటోడ్చి, కష్టిస్తే పదవులను అధిష్టించిన నేతలు జనానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని ముక్కలు చేసి పారేశారని, ఈ పరిణామం అనంతరం ఇక జనంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలమని కాంగ్రెస్ కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు. జిల్లాలో పలువురు ముఖ్యనేతలు పార్టీని వదిలి, తలో పార్టీ దిక్కుకూ పయనించడం కార్యకర్తలకు జీర్ణం కావడం లేదు. ‘రాష్ట్రాన్ని తుంచింది మీరు. మమ్మల్ని నట్టేట ముంచింది మీరు. పార్టీని మనుగడ కోల్పోయేలా చేసి మీరు మాత్రం మీ రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఆలంబనం వెతుక్కుంటున్నారా?’ అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తలోదారీ పడుతున్న ఎమ్మెల్యేలు జిల్లాలో ఇప్పటికే పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలోదారి వెతుక్కున్నారు. ఇక అనపర్తి, ముమ్మిడివరం, రాజోలు, రంపచోడవరం, తుని ఎమ్మెల్యేలు నల్లమిల్లి శేషారెడ్డి, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరీదేవి, కోసూరి కాశీ విశ్వనాథ్, రాజా అశోక్బాబుల్లో ఒకరిద్దరు తప్ప మిగిలినవారు కొత్త గూళ్ల కోసం అన్వేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో మిగిలిన ద్వితీయశ్రేణి నాయకుల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ నుంచి ఆహ్వానం అందుతున్నా వెళ్లేందుకు సాహసం చేయలేకపోతున్నారు. అలా చేస్తే తమ ‘చెప్పు’తో తాము కొట్టుకోవడమే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రథాలున్నా.. సారథులు లేరు మరోవైపు.. జై సమైక్యాంధ్ర పార్టీ వాలకం చూస్తే ‘గేదె ను కొనకుండా పలుపుతాడు సిద్ధం చేసిన’ చందంగా ఉంది. ‘ఓటి కుండకు చప్పుడె క్కువ’ అన్నట్టు..ఆ పార్టీ ముందుగానే ప్రచార రథాలు సిద్ధం చేసుకుంది. అయితే ఆ రథాలకు సారథులు లేక ఏం చేయాలో తోచని స్థితిలో చిక్కుకుంది. ఒకరిద్దరు మాత్రమే ఉన్న ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నేతలకు గాలం వేసి ‘చెప్పు’ల్లో కాళ్లు దూర్చమని బతిమాలుతున్నారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజమండ్రి జాంపేటలోని జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయం ముందు ఆ రథాలు సారథుల కోసం ఎదురు చూస్తున్నాయి. -
జాతీయ పార్టీకి అభ్యర్థులు కావలెను...!
గట్టుసింగారం (కూసుమంచి), న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారట...! ఈ విష యాన్ని ఆ పార్టీ నాయకులు తమ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికే నేరుగా చెప్పేశారు...!! ‘నిజమా...?! ఎప్పుడు.. ఎ క్కడ...’ అనేగా మీ ప్రశ్న..! ఇది చదవండి... కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం గట్టుసింగారం వచ్చారు. ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ‘ఎంతమంది ఎంపీటీసీలను గెలిపిస్తార’ని ప్రశ్నించారు. దీనికి, సమాధానం చెప్పలేక పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు నీళ్లు నమిలారు. ఇంతలో కొందరు నాయకులు లేచి, పార్టీ మండల నాయకత్వ వైఫల్యాన్ని రాంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 17 ఎంపీటీసీ స్థానాలకుగాను ఐదుచోట్ల అసలు అభ్యర్థులనే పోటీకి పెట్టలేదని చెప్పారు. పార్టీలోని కొందరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది వినగానే.. రాంరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ‘పోటీలో పెట్టేందుకు అభ్యర్థులే దొరకలేదా..?’ అని, మండల నాయకులను నిలదీశారు. ‘ఇంత అభివృద్ధి చేసిన మనకు అభ్యర్థులు కరువా...? మండల నాయకులు సరిగ్గా ఉంటే ఇట్లానే ఉంటుందా..?’ అని, తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఇంతలో.. కొందరు నాయకులు ఆయన చెవిలో.. ‘మీడియా వాళ్లు ఉన్నార్సార్...’ అంటూ గుసగుసలాడారు. ఆ నేత ఇదేమీ పట్టించుకోకుండా మరోసారి భగ్గుమన్నారు. ‘మీరు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడడమెందుకు..? మీరేం చే స్తారో నాకు తెలీదు. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపిం చాలి. ఎంపీపీని కైవసం చేసుకోవాలి’ అని హుకుం జారీ చేశారు. సరేనంటూ నాయకులు తలలూపారు. కొద్ది క్షణాల తరువాత... ‘మీరు ఇట్లా చేస్తే.. అసలు నేను ఎమ్మెల్యేగా పోటీలోనే ఉండను..’ అంటూ, రాంరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు...! దీంతో, అక్కడున్న నాయకులంతా అవాక్కయ్యారు. -
పంచముఖ పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : అన్ని పార్టీల్లో చర్చలు ముగిసి పొత్తులు ఖరారు కావడంతో రాష్ట్రంలో పంచముఖ పోటీగా నిర్ధారణ అరుు్యంది. రాష్ట్రం నుంచి రెండు జాతీయ, అనేక ప్రాం తీయ పార్టీలు రాజకీయాన్ని పంచుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని కూటములుగా మారిపోతాయి. ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పడిన పొత్తులు రాజకీయ విశ్లేషకులకు కావలసినంత వినోదాన్ని పంచాయి. ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ అనూహ్యంగా బలం పుంజుకుంది. మోడీ హవాకు ఆకర్షితులైన ప్రాంతీయ పార్టీలు బీజేపీలో చేరేందుకు ఉత్సుకతను ప్రదర్శించాయి. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే, కేఎన్ఎంకే అన్నీ బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యూరుు. సీట్ల కేటాయింపులో పార్టీ నేతల సహనాన్ని పరీక్షించారు. ఎట్టకేలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఆశించిన రీతిలోనే కూటమి ఏర్పడింది. పార్టీల సంఖ్యను పోల్చుకుంటే బీజేపీనే పెద్దకూటమిగా మారింది. బీజేపీ వలపన్నిన పార్టీలకే డీఎంకే సైతం వలపన్ని నేతలను కూడగట్టడంలో విఫలమైంది. రాష్ట్రంలో బలంగా ఉన్న అన్నాడీఎంకేను ఢీకొట్టాలంటే డీఎండీకే అవసరమని ఆశపడింది. కెప్టెన్ విజయకాంత్ బీజేపీవైపు మొగ్గుచూపడంతో వీసీకే, ఎంఎంకే, పుదియ తమిళగం, ఐయూఎంఎల్ వంటి చిన్న పార్టీలతోనే కూటమిని ఖరారు చేసుకుంది. వామపక్షాలను కలుపుకున్న అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు కుదర క పోవడంతో ఒంటరి పోరుకు దిగింది. ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను సైతం రప్పించి జయతో చర్చలు జరిపించిన సీపీఐ, సీపీఐ చివరకు శృంగభంగానికి గురయ్యూరుు. దీంతో చెరో 9 స్థానాల నుంచి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యూరు. వీడిపోయిన మాజీ మిత్రపక్షం డీఎంకే చేరువవుతుందని కాంగ్రెస్ చివరి వరకు ఆశించింది. కనీసం డీఎండీకేతోనైనా కలిసి నడవాలని ఎదురుచూసింది. కాంగ్రెస్‌తో జతకట్టేందుకు చిన్నపాటి పార్టీలు సైతం ముందుకు రాకపోవడంతో తప్పని సరై ఒంటరిపోరుకు సిద్ధమైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందంటూ దేశస్థాయిలో జోరుగా సాగుతున్న ప్రచారంతోపాటు రాష్ట్రంలో బలమైన కూటమి గా ఏర్పడిన బీజేపీ గట్టి పోటీనే ఇవ్వనుంది. అధికార అన్నాడీఎంకే, డీఎంకే కూడా పోటాపోటీగా రంగంలో ఉన్నాయి. ప్రధానంగా ఈ మూడు పార్టీలతో ముక్కోణపు పోటీగా చెప్పవచ్చు. రాష్ట్ర సమస్యలపై అవలంబించిన నిర్లక్ష్య ధోరణి కాంగ్రెస్‌కు శాపంగా మారి నామమాత్ర పోటీ స్థాయికి దిగజార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పార్టీ కేడర్‌లేని వామపక్షాలు సైతం ఉనికి కోసమే పోటీచేస్తున్నాయి. బలమైన, బలహీనమైన పార్టీలతో రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొంది. -
ఢిల్లీకి ‘కెప్టెన్’
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయపార్టీలు ప్రయత్నాలు ప్రారంభించారుు. ఇందులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. డీఎండీకే అధినేత విజయకాంత్ ధైర్యాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో మెచ్చుకున్నారు. పార్టీ యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ ఇది వరకే రాహుల్‌తో, ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ శనివారం ఢిల్లీకి పయనమయ్యూరు. ఇదిలావుండగా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో జాతీయపార్టీగా డీఎండీకేకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది. ఢిల్లీకి పయనం చెన్నై మీనంబాకం విమానాశ్రయంలో తన సతీమణి ప్రేమలతతో కలసి విజయకాంత్ శనివారం ప్రత్యక్షమయ్యారు. మీడియా ఆయన్ను చుట్టముట్టింది. మీడియా తన వద్దకు రాగానే చిరునవ్వులు చిందిస్తూ అడిగిన ప్రశ్నలకు కెప్టెన్ బదులిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకోవడం లక్ష్యంగానే ఈ పర్యటన సాగనుందా అని మీడియూ ప్రశ్నించింది. తమ పార్టీ సమావేశం నిమిత్తం ఢిల్లీకి వెళుతున్నట్లు కెప్టెన్ సమాధానం దాటవేశారు. ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని, ఈ నేపథ్యంలో అక్కడి పార్టీ నేతలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. మరలా పొత్తుపై ప్రశ్నించగా దాట వేయడం గమనార్హం. కామన్వెల్త్ సమావేశాలపై అసెంబ్లీలో చేసిన తీర్మానం గురించి విలేకరులు ప్రశ్నించారు. యుద్ధం పేరుతో ఈలం తమిళులు దారుణంగా హత్యకు గురవుతున్న సమయంలో వేడుక చూసిన వాళ్లంతా, ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం మిగులు విద్యుత్‌ను మరికొన్ని రోజుల్లో చూడబోతోందని ముఖ్యమంత్రి జయలలిత చేసిన ప్రసంగానికి స్పందిస్తూ వేచి చూద్దాం...చూస్తేనేగా తెలుస్తుందని ముగించారు. ఇదిలావుండగా విజయకాంత్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉందని, పొత్తుకు మార్గం సుగమం కానుందని చెబుతున్నారు.