కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో జరిగిన సభలో ఆయన కీలక ప్రకటన చేశారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని ప్రకటించారు. దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలని, దేశానికి తెలంగాణ చోదక శక్తి కావాలన్నారు.