సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన సెవన్ స్టార్ ఫాంహౌస్‌లో కూర్చొని జాతీయ పార్టీ ఏర్పాటుపై పగటికలలు కంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగు తున్న అత్యాచారాలు, మతోన్మాద రాజకీయా లను మొదట కట్టడి చేయాలని హితవు పలికారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లా డుతూ ఇటీవల జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి సీఎం మౌనంగా ఉండటమే కాకుండా, అలాంటి వారిని కాపాడటంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.
అంతేగాక ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరగడంతోపాటు నిందితుడు అందులోనే హాయిగా తిరిగాడని మండిపడ్డారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టకుండా, ఢిల్లీ వచ్చి రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా? కొత్త పార్టీ పెట్టాలను కుంటున్నారా? అని తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని కేసీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్ చేతిలోంచి అధికారం దూరం అవుతున్నందునే అధికారాన్ని కాపాడుకొనేందుకు ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment