TBJP
-
ఆరు రోజుల ఆందోళనలకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ
-
బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఆ పార్టీ ఆశావహుల్లో రెండు, మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించింది. 52 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముందే చెప్పినట్లు అత్యధికంగా బీసీలకు 19 స్థానాల్లో అవకాశం కల్పించింది. రెడ్డి 12, వెలమ 5, ఎస్సీలకు 8, ఎస్టీలకు 6, వైశ్యులు 1, ఉత్తరాది అగర్వాల్ (లోధి)వర్గానికి చెందిన ఒకరికి చోటు లభించింది. మొత్తంగా 12 మంది మహిళలకు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలు కలుపుకుని) అవకాశం కల్పించింది. ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (కోరుట్ల), సోయం బాపూరావు (బోథ్)లను అసెంబ్లీ బరిలోకి దించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌పై ఆదివారం సస్పెన్షన్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈసారి కూడా గోషామహల్ సీటునే ఇచ్చారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మరోసారి దుబ్బాక నుంచి బరిలో నిలిచారు. అధికార బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (సిరిసిల్ల)పై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను పోటీకి దింపారు. కాగా కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, మరో ఎంపీ కె.లక్ష్మణ్‌లకు మొదటి జాబితాలో చోటు కల్పించలేదు. నెలాఖరులోగా రెండు లేదా మూడు జాబితాల్లో మిగతా 67 సీట్లకు అభ్యర్థులు ఖరారు కావొచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాలతో ఉమ్మడి జిల్లాలు అన్నీ కవర్ అయ్యేలా (పాతబస్తీ, పార్టీకి అంతగా బలం లేని ఇతర చోట్ల కలిపి), బీసీలు, మహిళలు, రెడ్డి, వెలమ ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు సీట్లు ఖరారు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో మాదిరిగా ఇక్కడ కూడా.. గతంలో పార్టీ అభ్యర్థులు 3, 4 స్థానాల్లో నిలిచిన పలు స్థానాలకు అభ్యర్థులను ముందుగా ప్రకటించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. తొలి జాబితాలో పార్టీకి చెందిన పలువురు సీనియర్లకు కూడా కోటు దక్కలేదు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ దూరం! తొలి జాబితాలో లేని అంబర్‌పేట, మునుగోడు, గద్వాల, ముషీరాబాద్, మహబూబ్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర స్థానాల్లో ఎవరికి టికెట్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి పోటీ చేస్తారో లేదో చర్చనీయాంశంగా మారింది. కిషన్‌రెడ్డితో పాటు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (ముషీరాబాద్) పోటీకి దూరంగా ఉంటామని జాతీయ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. దీంతో అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి భార్య కావ్యారెడ్డి లేదా నగర సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు డా.ఎన్.గౌతమ్‌రావు బరిలో నిలుస్తారా? మరో బీసీ నేతకు అవకాశం ఇస్తారా? వేచి చూడాల్సి ఉంది. అయితే తాను అంబర్‌పేట నుంచి పోటీ చేయాలా వద్దా? అన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, అది పార్టీ అంతర్గత వ్యవహారమని కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఇక ముషీరాబాద్ నుంచి హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. మునుగోడు, ఎల్బీనగర్ల నుంచి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆయన సతీమణి పోటీ చేయాలని భావిస్తున్నారు. గద్వాల నుంచి పోటీకి పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, మహబూబ్‌నగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి సిద్ధమైనా మొదటి జాబితాలో ఈ సీట్లు ఖరారు చేయలేదు. బలం లేని చోట్ల బీసీలకు? బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించినా పార్టీ బలంగా లేని పాతబస్తీ, ఇతర చోట్ల ఇచ్చారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్డి కులస్తులకు ఎక్కువ సీట్లు కేటాయించారని, అయితే బీసీలకు తగిన ప్రాధాన్యత లేని నియోజకవర్గాల్లో ఇచ్చారని అంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా లాంటి సీట్లు బీసీలకు ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. జనగామలో బలమైన నేత బీరప్పకు ఇవ్వలేదని చెబుతున్నారు. అయితే ఈ వాదనను ఇతర నేతలు ఖండిస్తున్నారు. బీసీలకు సంబంధించి పలువురికి గెలిచే సీట్లు, పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే అవకాశం కల్పించారని అంటున్నారు. పార్టీ బలంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పలు సీట్లు బీసీలకు కేటాయించడం వారికి పెద్దపీట వేసినట్టేనని వివరిస్తున్నారు. ఇక వరంగల్ పశ్చిమ స్థానం నుంచి టికెట్ ఆశించిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. మరోవైపు తనతో పాటు బీజేపీలోకి వచ్చిన కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమకు వేములవాడ టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీకి దూరంగా ఉంటానని ఈటల పేర్కొనడంతో ఆ నియోజకవర్గాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ‘జనసేన’పై నిర్ణయం తీసుకోలేదు: కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో జనసేనతోనూ సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందనే నాయకత్వం సంకేతాలిస్తోంది. జనసేన 12 సీట్లు కోరుతోందని, హైదరాబాద్‌లో ఒకటి, మరో రెండు సీట్లు రాష్ట్రంలోని ఇతర చోట్ల ఇవ్వాల్సి ఉంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో జనసేనకు గుర్తింపు లేకపోవడంతో పాటు నాయకులు, కేడర్ లేని పరిస్థితుల్లో ఆ పార్టీకి రెండు, మూడు సీట్లు ఇచ్చినా తమకు నష్టమేనని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. కాగా జనసేనతో పొత్తుపై ప్రాథమికంగా చర్చించామని, అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. సామాజికవర్గాల వారీగా.. – 19 మంది బీసీలలో మున్నూరు కాపు–2, ముదిరాజ్–3, యాదవ్–3, గౌడ్–3, విశ్వకర్మ–1, పద్మశాలి–1, పెరిక–2, అరే కటిక–1, అరే మరాఠా–1, లోధా–2 ఉన్నారు. – 19 ఓసీలలో 12 మంది రెడ్డి, 5 వెలమ, ఒక వైశ్య, ఒక నార్త్ ఇండియన్ అగర్వాల్ ఉన్నారు. – 8 మంది ఎస్సీలలో ఒకరు బైండ్ల, 5 మాదిగ, 2 మాల ఉన్నారు. – 6 మంది ఎస్టీల్లో 4 లంబాడా, ఒక కోయ ఒక గోండు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా.. తొలి జాబితాలో ఎక్కువగా ఉత్తర తెలంగాణ పరిధిలోని నియోకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు స్పష్టమౌతోంది. హైదరాబాద్ పరిధిలో 7 నియోజకవర్గాలు, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తొమ్మిది చొప్పున స్థానాలు, ఆదిలాబాద్‌లోని 7, నిజామాబాద్‌లోని 5, నల్లగొండ, మెదక్‌లోని నాలుగేసి చొప్పున, రంగారెడ్డిలో 3, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని రెండేసి చొప్పున నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల జాబితా: 1) సిర్పూర్ – డా.పాల్వాయి హరీశ్ బాబు 2) బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి 3) ఖానాపూర్ (ఎస్టీ) – రమేష్ రాథోడ్ 4) ఆదిలాబాద్– పాయల్ శంకర్ 5) బోథ్(ఎస్టీ) – సోయం బాపూరావు 6) నిర్మల్– ఏలేటి మహేశ్వర్ రెడ్డి 7) ముధోల్–రామారావు పటేల్ 8) ఆర్మూర్– పైడి రాకేష్ రెడ్డి 9) జుక్కల్ (ఎస్సీ) – టి.అరుణతార 10) కామారెడ్డి– కె.వెంకటరమణా రెడ్డి 11) నిజామాబాద్ అర్బన్– ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 12) బాల్కొండ – ఆలేటి అన్నపూర్ణమ్మ 13) కోరుట్ల – ధర్మపురి అర్వింద్ 14) జగిత్యాల– డా.భోగా శ్రావణి 15) ధర్మపురి (ఎస్సీ)– ఎస్.కుమార్ 16) రామగుండం– కందుల సంధ్యారాణి 17) కరీంనగర్ – బండి సంజయ్ కుమార్ 18) చొప్పదండి (ఎస్సీ)– బొడిగ శోభ 19) సిరిసిల్ల– రాణి రుద్రమరెడ్డి 20) మానకొండూరు (ఎస్సీ)– ఆరెపల్లి మోహన్ 21) హుజూరాబాద్›– ఈటల రాజేందర్ 22) నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్ 23) పటాన్చెరు –టి.నందీశ్వర్ గౌడ్ 24) దుబ్బాక – మాధవనేని రఘునందన్ రావు 25) గజ్వేల్ – ఈటల రాజేందర్ 26) కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్ 27) ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్ 28) మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్ 29) ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి 30) కార్వాన్ – అమర్‌సింగ్ 31) గోషామహల్ – టి.రాజాసింగ్ 32) చార్మినార్ – మేఘారాణి 33) చాంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్ 34) యాకుత్‌పురా – వీరేందర్ యాదవ్ 35) బహదూర్‌పురా – వై.నరేశ్ కుమార్ 36) కల్వకుర్తి – తల్లోజు ఆచారి 37) కొల్లాపూర్ – ఎ.సుధాకర్ రావు 38) నాగార్జున సాగర్ – కె.నివేదితా రెడ్డి 39) సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు 40) భువనగిరి – గూడూరు నారాయణరెడ్డి 41) తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య 42) జనగాం – డా.ఆరుట్ల దశమంత్ రెడ్డి 43) స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) – డా.గుండె విజయ రామారావు 44) పాలకుర్తి – లేగ రామ్మోహన్ రెడ్డి 45) డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత 46) మహబూబాబాద్ (ఎస్టీ) – జాథోత్ హుస్సేన్ నాయక్ 47) వరంగల్ పశ్చిమ – రావు పద్మ 48) వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు 49) వర్ధన్నపేట (ఎస్సీ)– కొండేటి శ్రీధర్ 50) భూపాలపల్లి– చందుపట్ల కీర్తి రెడ్డి 51) ఇల్లందు (ఎస్టీ) – రవీంద్ర నాయక్ 52) భద్రాచలం (ఎస్టీ) – కుంజా ధర్మారావు -
ఎడతెగని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది. వారు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. మిగతా అభ్యర్థులకు సంబంధించి పరిశీలన పూర్తిచేసి.. ఆదివారం సాయంత్రానికి 55 మంది పేర్లతో అధికారికంగా తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. తొలి జాబితా దాదాపు ఖరారైనా జాప్యం కావడం వెనుక.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంగా పునరాలోచన చేయడం, కొందరు అటూ, ఇటూ మారే అవకాశం ఉండటమే కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ రెండో జాబితా వెలువడితే.. అవకాశం దక్కనివారు బీజేపీ వైపు చూడవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయని అంటున్నాయి. అభ్యర్థులు, సీట్ల మార్పుతో.. అధికార బీఆర్ఎస్ నెలన్నర ముందే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు చాలా మందికి బీ ఫారాలు కూడా అందజేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసి, మిగతా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి అభ్యర్థులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఈ నెల 15 లేదా 16న తొలి జాబితా ఉంటుందని ముఖ్యనేతలు ప్రకటించినా విడుదల చేయలేదు. శనివారానికి దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని.. 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందని పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇందులోని దాదాపు 15 వరకు స్థానాల్లో అభ్యర్థుల మార్పు, నేతలు పోటీకి సుముఖత వ్యక్తం చేయని చోట్ల ఇతరులను ఎంపిక చేయాల్సి రావడంతో ప్రకటన ఆగిపోయినట్టు తెలిసింది. ఫోన్ చేసి సమాచారమిస్తూ.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం. సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అభ్యర్థుల తీరు ఎలా ఉంది? ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు (కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ మినహా), ఇద్దరు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావులకు తొలి జాబితాలోనే అవకాశం కల్పించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్‌తోపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ రెండు చోట్లా ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపుతున్నట్టు సమాచారం. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసి, ఆయనకు అదే స్థానంలో పోటీ చేసే అవకాశంపై ఢిల్లీలో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే దీనిపై స్పష్టత రాలేదు. మరోవైపు చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ధర్మపురి నుంచి ఎస్.కుమార్ల పేర్లు ఖరారయ్యాయని.. అయితే వివేక్ ధర్మపురి నుంచి పోటీకి మొగ్గుచూపుతుండటంతో కుమార్‌ను చెన్నూరుకు మార్చడంపై ఆలోచన జరుగుతోందని సమాచారం. ఇదే జరిగితే ఈ రెండు సీట్ల అభ్యర్థులు మారనున్నారు. మరోవైపు కాంగ్రెస్ మలివిడత జాబితా ఇంకా ప్రకటించనందున.. ఒకవేళ అక్కడ టికెట్లు దక్కని బలమైన నాయకులు, బీఆర్ఎస్లోని అసంతృప్తులు బీజేపీలోకి వచ్చే అవకాశాలను కూడా ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన పొత్తులపై అస్పష్టత ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో తెలంగాణలో బీజేపీ పొత్తుపై ప్రచారం జరిగినా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ జరిపిన చర్చల్లో రాష్ట్రంలో బీజేపీకి మద్దతివ్వాలని, పోటీ ఆలోచనను విరమించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ భేటీల్లో చర్చ జరిగినా.. ఇరువైపుల నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. నెలాఖరులోగా మిగతా జాబితాలు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాతీయ నేతలతో రాష్ట్ర ముఖ్య నేతలు చర్చించారు. అభ్యర్థుల పేర్లపై ప్రాథమిక పరిశీలన పూర్తి చేశారు. ఇందులో ఒక్కరే బలమైన అభ్యర్థులున్న సీట్లు, ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలు కలిపి 55 సీట్లలో అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని నేతలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికల్లా ఈ 55 మందితో జాబితా వెలువడే అవకాశం ఉందని తెలిపారు. నెలాఖరులోగా మిగతా అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించనున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల కంటే అధికంగా బీసీలు, మహిళలు, యువతకు సీట్లు కేటాయించేలా కసరత్తు జరిగిందని వివరించారు. -
బీజేపీ బీసీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ.. తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదంతో ఎన్నికల గోదాలో తలపడనుంది. తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని.. అవసరమైతే బీజేపీ ఆనవాయితీని పక్కనపెట్టి, ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతర పార్టీల కంటే ఎక్కువగా.. కనీసం 40 సీట్లకు తగ్గకుండా బీసీ, ఎంబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ జనాభాలో 54 శాతానికిపైగా బీసీలే ఉన్నారని.. వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నట్టు వెల్లడించాయి. అంతేగాకుండా 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీసీల ఓట్లు తోడ్పడతాయని ఆశిస్తున్నట్టు వివరించాయి. భారీ సభ వేదికగా ప్రకటన! పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదా కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నెలాఖరులోగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన బీసీగర్జన సభలోగానీ, మరోచోట నిర్వహించే బహిరంగ సభలోగానీ దీనిపై ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సాంప్రదాయం కాదని.. దానిని పక్కనపెట్టి అయినా ఓ కీలకనేత పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో బీసీ వర్గాలను అధికారంలో భాగస్వాములను చేస్తామని.. రాష్ట్ర అభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండేలా చూస్తామని అగ్రనేతలు హామీ ఇవ్వనున్నారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన స్థాయిలో పదవులు ఇస్తామన్న భరోసా కల్పించనున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా ఇప్పటికే పార్టీలో బీసీలకు ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. బీసీలకు భరోసా కల్పించేలా పలు అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించినట్టు నేతలు వివరించారు. రెడ్డి వర్గం ఫోకస్‌గా ఇంద్రసేనారెడ్డికి పదవి! బీసీ నినాదంతో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా రెడ్డి, ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకూ బీజేపీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చాక ఆ బాధ్యతలను కిషన్‌రెడ్డికే అప్పగించింది. తాజాగా పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి కట్టబెట్టింది. ఇదే సమయంలో బీసీ నేతలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా రెడ్డి, బీసీ కాంబినేషన్లో ఎన్నికలకు వెళుతున్న సంకేతాలను పార్టీ ఎప్పుడో ఇచ్చిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీసీలకు పెద్దపీట, సీఎంగా బీసీ అభ్యర్థికి అవకాశం అంశాలపై పార్టీ రాష్ట్ర ఇన్చార్జులు, ముఖ్య నేతలు పలుమార్లు కసరత్తు చేశారని.. రెడ్డి సామాజికవర్గం సహా అందరు ముఖ్య నేతలు బీసీ ఎజెండాకు మద్దతు ఇచ్చారని అంటున్నారు. బీసీ కీలక నేతల్లో.. చాన్స్ ఎవరికి? ఇప్పటికే పార్టీలో బీసీ నేతలకు కీలక పదవులు అందాయని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కె.లక్ష్మణ్‌కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని.. ఆ తర్వాత పార్టీలో కీలక పదవులైన పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యులుగా నియమించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్‌కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చారని.. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెప్తున్నారు. ఇక బీసీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ప్రాధాన్యతనివ్వడం, ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్ నియమితులయ్యారని పేర్కొంటున్నారు. మరోవైపు ఉద్యమకాలం నుంచీ బీఆర్ఎస్లో నంబర్ టూగా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని, కీలక కమిటీల బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బీసీ నేత అయిన ఈటల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సెక్షన్లు, కులసంఘాల నేతలు, ముఖ్యులను కలుస్తూ బీజేపీకి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వివరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఈ నేతల్లో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాయి. -
6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ స్టీరింగ్ కమిటీ నడుం బిగించింది. దసరా తర్వాత అక్కడ గడపగడపకూ బీజేపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదనే దానిపై చర్చించింది. మునుగోడులోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి, ఇద్దరు సహ ఇన్చార్జిల చొప్పున 24 మందిని నియమించింది. ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాన్ నారాయణపూర్‌కు ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, మునుగోడుకు చాడ సురేశ్‌రెడ్డి, మర్రిగుడెంకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కూన శ్రీశైలంగౌడ్, నాంపల్లికి ఏనుగు రవీందర్‌రెడ్డి, చండూర్‌కు నందీశ్వర్‌గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చండూర్ మున్సిపాలిటీకి ఎం.ధర్మారావులను నియమించింది. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత గురించి పార్టీపరంగా చార్జ్‌షీట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 27న చౌటుప్పల్ మండలంలో మండల ఇన్చార్జీల సమావేశం ఉంటుందన్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, కె.స్వామిగౌడ్, యెండెల లక్ష్మీనారాయణ, గరికపాటి మోహన్‌రావు, డా.దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. హెచ్‌సీఏలో గందరగోళం ఇలా.. కల్వకుంట్ల కుటుంబం కారణంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితి నెలకొందని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ ఆరోపించారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయొద్దని తనకు కేసీఆర్ సూచించారన్నారు. -
ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ.. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్
నాగోలు/లింగోజిగూడ: హిందువుల తలలు నరికి చంపుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే ఆ సంస్థ పనిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పీఎఫ్ఐ విస్తరించడానికి టీఆర్ఎస్సే కారణమని, ఆ పార్టీ నేతలు కొంతమంది చందాలిచ్చి పెంచి పోషిస్తున్నారని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండికి.. నాగోలు చౌరస్తా వద్ద స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సత్కరించారు. గొర్రెపిల్లను బహూకరించారు. కాగా నాగోలు, కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్, చైతన్యపురిలో ఆయన ప్రసంగించారు. సీఎంకు సోయి ఎందుకు లేదు? పీఎఫ్ఐకి చెందిన సంస్థలపై ఎన్ఐఏ దాడులు చేసేంతవరకు సీఎం కేసీఆర్‌కు సోయి ఎందుకు లేదని సంజయ్ ప్రశ్నించారు. యూపీకి చెందిన ఓ ముఠా బిహార్‌లో బాంబులు తయారు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పేల్చేందుకు కుట్ర చేసిందని చెప్పారు. 2040 నాటికి భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని అన్నారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు. హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. క్వారంటైన్‌కు కేసీఆర్ కుటుంబం ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర ఉంటోందని సంజయ్ అన్నారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న సీఎం.. లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసి దేశ రాజకీయాలంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి ఆయన కుటుంబం క్వారంటైన్‌కు వెళుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్జీ తదితరులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ‘బండి’ నాలుగో విడత యాత్ర పెద్దఅంబర్‌పేటలో బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగోవిడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగియనుంది. పెద్దఅంబర్‌పేట మున్సి పాలిటీలో నిర్వహిస్తున్న ముగింపు బహిరంగ సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బండి సంజయ్ గతేడాది ఆగస్టు 28న చార్మినార్ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతలుగా సాగింది. 4విడతల్లో 102 రోజుల పాటు 48 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 1,250కి.మీ. మేర యాత్ర సాగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభం.. బండి సంజయ్ మొదటివిడత పాదయాత్రను హైదరాబాద్ పాతబస్తీ భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభించారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్ మహానగరంలో, ఇతర చోట్ల వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. రెండో విడతలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని సమస్యలను ప్రస్తావించారు. మూడో విడతలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలో యాత్ర సాగింది. మల్కాజ్గిరి లోక్‌సభస్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజ వకవర్గాలు, అలాగే ఇబ్రహీంపట్నం శాసనసభా నియోజక వర్గంలో సాగిన నాలుగో విడతలో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని రోడ్లు, డ్రైనేజీలు, పరిశ్రమల కాలుష్యం, డంపింగ్ యార్డు.. వంటి సమస్యలపై గళం ఎత్తారు. టీఆర్ఎస్ వైఫల్యాలు ఎండగట్టేందుకే మొగ్గు.. పాదయాత్ర సభల్లో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, జి.కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులు, బండి సంజయ్ టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రాధాన్యతనిచ్చారు. కేసీఆర్ హామీల అమల్లో వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా, నెలలో 20 రోజుల పాటే పాదయాత్ర చేపట్టాలని, మిగతా పది రోజులు హైదరా బాద్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులను జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మొత్తం 8 విడతల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో పాదయాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదో విడత యాత్రను అక్టోబర్ 8–10 తేదీల మధ్య మొదలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. -
రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేదు: సంజయ్
దిల్సుఖ్నగర్: తెలంగాణలో బాలికలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో 5 రోజుల కిందట అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులతో కలసి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ నాయకుల వీపులను ప్రజలు త్వరలోనే పగలగొడతారని హెచ్చరించారు. జూబ్లీహి ల్స్‌లో జరిగిన సంఘటనపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే రాష్ట్రం లో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతు న్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభు త్వం దుండగుల పట్ల కఠినంగా వ్యవహరిం చకపోగా వారికి రక్షణ కల్పిస్తోందని ఆరో పించారు. అత్యాచార ఘటనలపై ముఖ్య మంత్రి కేసీఆర్ స్పం దించకపోవడం సిగ్గుచేటన్నారు. అత్యాచారాలకు సంబంధించిన సంఘటనలను మీడియా, ప్రజలు వెలుగులోకి తీసుకొస్తుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నాయ ని ప్రశ్నించారు. ఇటీవల కార్ఖానాలో ఎంఐఎం ఇలాంటి ఘటనకు పాల్పడిందని దోషులను కఠినంగా శిక్షించాలని సంజయ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సునీతారెడ్డి పాల్గొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని స్థానిక మహిళలు సంజయ్‌ను డిమాండ్ చేశారు. మాకు ఓదార్పులు అవసరం లేదని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు బయటకు వస్తే ఊరుకునే సమస్య లేదని హెచ్చరించారు. -
కేసీఆర్‌వి పగటికలలే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన సెవన్ స్టార్ ఫాంహౌస్‌లో కూర్చొని జాతీయ పార్టీ ఏర్పాటుపై పగటికలలు కంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగు తున్న అత్యాచారాలు, మతోన్మాద రాజకీయా లను మొదట కట్టడి చేయాలని హితవు పలికారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లా డుతూ ఇటీవల జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి సీఎం మౌనంగా ఉండటమే కాకుండా, అలాంటి వారిని కాపాడటంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. అంతేగాక ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరగడంతోపాటు నిందితుడు అందులోనే హాయిగా తిరిగాడని మండిపడ్డారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టకుండా, ఢిల్లీ వచ్చి రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా? కొత్త పార్టీ పెట్టాలను కుంటున్నారా? అని తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని కేసీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్ చేతిలోంచి అధికారం దూరం అవుతున్నందునే అధికారాన్ని కాపాడుకొనేందుకు ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. -
రాష్ట్రంలో ఒకరు పాదయాత్ర.. మరొకరు మోకాళ్ల యాత్ర
సాక్షి,సిద్దిపేట: రాష్ట్రంలో అధి కారానికి ఒకరు పాదయాత్ర, మరొకరు మోకాళ్ల యాత్ర చేస్తున్నారని, ఎవరెన్ని గిమ్మి క్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విశ్వసించరని, తెలంగాణ గుండె చప్పుడు టీఆర్ఎస్ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారు మన రాష్ట్రంలోని పథకాలు కాపీ కొట్టి కేంద్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటోం దని ఆయన ఆరోపించారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభు త్వం దళితుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరిం చారు. అమర్నాథ్ యాత్రికులకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు గతంలో గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో ఇచ్చేవారని, ఈ ఏడాది నుంచి నిజామాబాద్, ఆదిలా బాద్ ఆస్పత్రుల్లో కూడా ఇస్తామని మంత్రి వెల్లడించారు. -
మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా...
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్య వర్గ భేటీ సందర్భంగా తెలంగాణ సంస్కృ తీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రముఖు లకు స్వాగతం పలకాలని రాష్ట్ర శాఖ నిర్ణ యించింది. ఒకరోజు పూర్తిగా తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు జరగ నున్న నోవాటెల్–హెచ్ఐసీసీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్, సంస్థా గత వ్యవహారాల సహాయ ప్రధాన కార్య దర్శి శివకుమార్, జాతీయ కార్యదర్శి, కార్య వర్గ సమావేశాల ఇంచార్జీ అరవింద్ మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్ర రావు తదితరులు సందర్శించారు. వివిధ కమిటీల నియామకం... సమావేశాల నిర్వహణకు 34 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాధాన్యత ఉన్న 9 కమిటీలను మొదట వేసి, ఏర్పాట్లను పరి శీలిస్తారు. ఈ కమిటీలన్నింటిని రాష్ట్ర నేతలు సంజయ్, డా‘‘కె.లక్ష్మణ్, మంత్రి శ్రీనివాస్ పర్యవేక్షిస్తారు. సమావేశాల ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా లక్ష్మణ్ వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ కూడా వివిధ కమి టీల కార్యక్రమాలను సమన్వయపరుస్తుం ది. ఈ కమిటీల కన్వీనర్లు, సభ్యులతో జాతీ య నేతలు సమావేశమై కార్యక్రమాలను వివరించారు. ఏర్పాట్ల పరిశీలనకు ఈనెల 14న జాతీయ నేతలు మళ్లీ రాష్ట్రానికి రాను న్నారు. అప్పటికల్లా కమిటీలకు సంబంధిం చిన బ్లూప్రింట్‌ను సమర్పించాలన్నారు. కాగా, జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యా చారం కేసులో పోలీసులు సరిగా వ్యవహ రించడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. నోవాటెల్‌ను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. -
జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2వ తేదీన నిర్వహించిన ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కేసీఆర్‌ను కించపరిచేలా ‘స్కిట్’ చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడమేంటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు. అయితే జిట్టాను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియరాలేదు. అర్ధరాత్రి ఎలాంటి నోటీసు లేకుండా పోలీసులు తమ పార్టీ నేతను అరెస్టు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోపిడీ దొంగలమాదిరిగా తమ పార్టీ నేతను కిడ్నాప్ చేశారని ఆయన మండిపడ్డారు. వెంటనే జిట్టా ఆచూకీ తెలపాలని, ఆయనను విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నేతలను జాతీయ పార్టీ దూతలు ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, పటిష్టానికి ఈ భేటీని వినియోగించుకునే దిశగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఈ మేరకు కార్యవర్గ భేటీ సన్నాహాలపై బుధవారం రాష్ట్ర నేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తదితరులతోపాటు వివిధ కమిటీలతో సమీక్షించారు. వచ్చేనెల 2న భేటీకి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో.. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ దాకా పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనేలా రోడ్‌షో నిర్వహించాలని.. లేదా 3వ తేదీన సమావేశాల ముగింపు సందర్భంగా ఎల్బీ స్టేడియం లేదా మరోచోట బహిరంగసభ నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై గురువారం జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఐదుగురితో స్టీరింగ్ కమిటీ వచ్చే నెల 2, 3 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, సీనియర్ నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డిలతో స్టీరింగ్ కమిటీని బీజేపీ జాతీయ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఇక భేటీ ఏర్పాట్లు, సన్నాహాలు, రవాణా, భోజనం, వసతి తదితరాల కోసం కూడా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భేటీ నిర్వహణకు భారీగా ఆర్థిక వనరులు అవసరమయ్యే నేపథ్యంలో.. కొందరు పెద్ద మొత్తాల్లో ఇచ్చే విరాళాలతోపాటు క్షేత్రస్థాయిలో డెబిట్, క్రెడిట్‌కార్డుల వంటి డిజిటల్ పద్ధతుల్లో కూడా చిన్నచిన్న మొత్తాల్లో విరాళాలు సేకరించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. 8 ఏళ్ల మోదీ పాలనపై జిల్లాల్లో సభలు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా.. ఈ నెల 10 నుంచి 15దాకా అన్ని జిల్లాల్లో ‘ప్రజా సంక్షేమ పాలన సదస్సు’లు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. 10న మల్కాజిగిరి, మేడ్చల్ అర్బన్ జిల్లాలో నిర్వహించే సభలో బండి సంజయ్ పాల్గొంటారు. 11న రంగారెడ్డి రూరల్ జిల్లాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, 12న మంచిర్యాలలో ఎంపీ కె.లక్ష్మణ్. 13న యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ములుగు జిల్లాలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, 14న మెదక్ జిల్లాలో ఎన్.మురళీధర్‌రావు, నల్లగొండ జిల్లాలో డీకే అరుణ, భద్రాద్రికొత్తగూడెంలో ఎంపీ సోయం బాపూరావు, జనగామ జిల్లాలో ఏపీ జితేందర్‌రెడ్డి, 15న హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో కేంద్రమంత్రి నారాయణ్‌రాణే, ఆదిలాబాద్ జిల్లాలో బండి సంజయ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొంటారు. ఆయా సభల్లో ఇతర నేతలు కూడా పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేశారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో పోలీసులు రాజకీయ పరికరాలుగా మారారని, ముఖ్యమైన వ్యక్తులను రక్షించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. బుధవారం తరుణ్‌ఛుగ్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జంగిల్‌రాజ్ నడు స్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన, శాంతిభద్రతలు, ఆడపిల్లల సంరక్షణ ఇలా అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులిలా ఉంటే రూ.109 కోట్లు ఖర్చుచేసి వార్తాపత్రికల్లో తన ఫొటోతో ప్రకటనలిచ్చి ప్రచారం చేసుకోవడం గర్హనీయమన్నారు. గత ఏప్రిల్ 22 నుంచి మే 31 దాకా 11–17 ఏళ్ల వయసున్న అనేక మంది బాలికలు అత్యాచారానికి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా స్పందించేందుకు కేసీఆర్‌కు నోరు కూడా రావడం లేదని మండిపడ్డారు. ‘కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై, కేటీఆర్ ట్విటర్‌తో బిజీగా ఉంటే హోంమంత్రి అనే వ్యక్తి అసలు ఉన్నాడా లేడా? అనేది ఎవరికీ తెలియని దుస్థితి ఉంది’అని ఎద్దేవా చేశారు. ఓ ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరగ్గా అది ఏ శాఖది, ఎవరు ఉపయోగిస్తున్నారన్న వివరాలు ఆరా తీయకుండా.. దాంట్లో ఉన్న ఆధారాలను చెరిపేసే కుట్ర జరుగుతోందన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రాష్ట్రాన్ని పంచుకున్నాయి: సంజయ్ జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచారం కేసును ౖముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి వచి్చన ఆదేశాల మేరకే పోలీసులు నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌చేశారు. ‘ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని.. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేటీఆర్ ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు? చూడటానికి కేసీఆర్‌కే కళ్లు లేవు.. ఇక దోషుల కళ్లేం పీకుతడు?’అని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పారీ్టలు కలిసి రాష్ట్రాన్ని పంచుకున్నాయని, ఎంఐఎం నాయకులు దాడులు చేస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు హత్యలు, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుల పోరాటం వల్లే కేసులు నమోదు చేశారని, బీజేపీ స్పందించకపోతే కేసును మూసేసేవారన్నారు. న్యాయం కోరుతున్న తమ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘనందన్ రావులపై కేసు పెట్టే విషయంపై ఉన్న శ్రద్ధ.. బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసులు పెట్టే విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ‘కేసును తప్పు దోవ పట్టించేందుకు ఇందులో హిందువు ఉన్నట్లు మొదటి ఎఫ్ఐఆర్లో సూరజ్ అనే పేరు నమోదు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్ధారణ చేసుకున్నాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేసి, నిందితుల జాబితాలో చివరన చేర్చారు’అని చెప్పారు. -
జూబ్లీహిల్స్ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ కేసులో బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నగర పార్టీలోని వివిధ విభాగాలు, నాయకులతోపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు సోమవారం సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. -
పోటీనా.. పార్టీ పదవుల్లోనా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారు, అందుకు ఆసక్తి లేనివారు త్వర గా తేల్చుకోవాలంటూ రాష్ట్ర నాయకులకు బీజేపీ జాతీయ నాయకత్వం అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రస్థాయి పదాధికారులు మొదలు ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షుల దాకా అసెంబ్లీ లేదా లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆలోచన ఉంటే పార్టీ పదవులు వదులుకునే విషయంలో త్వరితంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. పోటీకి ఆసక్తి చూపని ముఖ్య, ఇతర నేతలు పార్టీ అప్పగించే బాధ్యతలను అంకితభావంతో నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఆదేశించింది. ఏడాదిన్నరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పార్టీనాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నందున ఆ దిశలో రాష్ట్రపార్టీ ఎన్నికల కార్యాచరణ, అన్ని శాసనసభ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని పోలిం గ్బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత, వివిధ స్థాయిల కమిటీల నియామకం వంటివి పకడ్బందీగా పూర్తి చేయాలని నిర్దేశించింది. తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించ డంలేదని, కార్యక్రమాల నిర్వహణలో పాత్ర ఉండటం లేదని సీనియర్ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక్కొ క్కరిని ఒక లోక్‌సభ స్థానం పరిధిలోని పోలింగ్ బూత్‌ల స్వశక్తీకరణ పర్యవేక్ష కులుగా నియమించే దిశలో రాష్ట్రపార్టీ చర్యలు చేపడుతోంది. వీరితోపాటు మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ ల స్వశక్తీకరణ్ కార్యక్రమాల నిర్వహణకు కోఆర్డినేటర్లను నియమించనుంది. కుటుంబసభ్యులకు నో టికెట్!: ఎన్నికల సందర్భంగా కుటుంబ, వారసత్వ రాజకీ యాలకు బీజేపీ దూరంగా ఉంటుం దనే స్పష్టమైన సందేశాలు, ఆదేశాలను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జారీచేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కష్టపడి పనిచేసే నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత లభిస్తుందే తప్ప నేతల కుటుంబసభ్యులకు ఎన్నికల్లో పోటీకి ప్రాధాన్యమివ్వబోమని స్పష్టం చేశారు. ఇదే పార్టీ విధానమని, దీనినే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ అమలు చేయబోతు న్నట్టు తాజాగా రాష్ట్ర నేతలకు నడ్డా స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే విధానాన్ని మధ్యప్రదేశ్, యూపీ ఎన్నికల్లోనూ అనుస రించామని, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ దీనినే పాటిస్తామని నడ్డా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కుటుంబపార్టీలతో పోల్చితే బీజేపీ కుటుంబ, వారసత్వ పార్టీ కాదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. -
సర్పంచ్ల సమస్యలపై కమలం పోరు
సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసి రాజకీయంగా బలపడేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అనేకమంది సర్పంచ్‌లు విధులు, నిధులు, అధికారాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడటం పార్టీకి బాగా కలిసొస్తుందనే అంచనాకు వచ్చింది. కొంతకాలంగా బిల్లులు రాకపోవడం వల్ల సర్పంచ్‌లు మొదలు వివిధస్థాయిల ప్రజాప్రతినిధులు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు మీడియాలో వార్తలు వస్తుండటంతో ఈ దిశలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన నేపథ్యంలో గ్రామస్థాయిలో అధికార టీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు ఇదే సరైన సమయమని నిర్థారణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా స్థానికసంస్థల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చని భావిస్తోంది. స్థానిక సంస్థలపై వివిధ రూపాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ధోరణిని ఎండగట్టి గ్రామస్థాయి నుంచి పట్టు సాధించాలని నిర్ణయించింది. త్వరలో గవర్నర్‌కు వినతిపత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సర్పంచ్ల సమస్యలను త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ నేతలు, పలువురు సర్పంచ్‌లతో కలసి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌కు వినతిపత్రం సమర్పించాలని రాష్ట్రపార్టీ నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో గవర్నర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతోపాటు దీనికి కొనసాగింపుగా అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు సర్పంచ్‌లతో కలసి బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇతరముఖ్యనేతలు మెమోరాండం సమర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల రెండోవారంలోగా సర్పంచ్ల సమస్యలపై లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద సర్పంచ్‌లతో కలసి సంజయ్ రెండుగంటల మౌనదీక్ష చేపట్టేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహణ కోసం సర్పంచ్‌లు, పార్టీనేతలతో కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
75 గంటల ‘పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్’ నిర్వహించనున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి వివిధ రూపాల్లో అందుతున్న నిధులు వంటి అంశాలపై ‘సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్’పేరిట ఈనెల 30 నుంచి జూన్ 14 దాకా రాష్ట్ర వా్యప్తంగా రాష్ట్ర బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది. దీంతో పాటు 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో వివిధ వర్గాల ప్రజలకు ఎదురైన సమస్యలు, హామీలు అమలు చేయకపోవడం, వివిధ రంగాల్లో వైఫలా్యలు తదితర విషయాలపై టీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. 75 గంటలు ప్రత్యేక కార్యక్రమాలు... ప్రతీ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు, ఆపై నాయకులు ఆయా బూత్‌లలో పబ్లిక్ ఔట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టనునా్నరు. ఇందులో భాగంగా ఒక్కో మండలంలో 75 మంది పాల్గొనేలా ఏరా్పట్లు చేస్తునా్నరు. మే 30 నుంచి జూన్ 14 వరకు ఈ నాయకులంతా ప్రతీరోజు 5 గంటల చొప్పున 15 రోజుల్లో మొత్తం 75 గంటలు పార్టీ ప్రచార, నిరే్దశిత కార్యక్రమాలకు కేటాయిస్తారు. పథకాల లబ్ధిదారులతో సంభాషణ, వికాస్ తీర్థ బైక్ ర్యాలీ, బాబాసాహెబ్ విశ్వాస్ ర్యాలీ, బిర్సా ముండా విశ్వాస్ ర్యాలీ, ప్రాంతీయ స్థాయిలో (వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్) ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. కార్యక్రమాలు ఇలా... ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళ, రైతులు, మైనారిటీలు టార్గెట్‌గా ఔట్ రీచ్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఎస్టీ నాయకులు, ఎంపీలతో కుమ్రుం భీం విశ్వాస్ ర్యాలీ, గిరిజన మేళా నిర్వహణతోపాటు ఎస్టీలు అధికంగా ఉన్న జిల్లాల్లో సమ్మేళనాలు చేపడతారు. జూన్ 6న మైనారిటీల వద్దకు ఔట్రీచ్ ప్రోగ్రామ్. జూన్ 7న యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీల ద్వారా కేంద్ర ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప్రదేశాలను సందర్శన. జూన్ 8న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బాబా సాహెబ్ విశ్వాస్ ర్యాలీ, చౌపాల్ భైఠక్ (బస్తీ సమావేశం) ఎస్సీల జనాభా ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల ద్వారా నిర్వహణ. జూన్ 9న మహిళా మోర్చా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల సమావేశాలు. జూన్ 10న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 8 ఏళ్లలో రైతుల కోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను రైతాంగానికి వివరించడం జూన్ 11న ఓబీసీ మోర్చా ద్వారా సమాజంలోని పీడిత వర్గాలకు కేంద్ర పథకాల వర్తింపుపై వివరణ జూన్ 12న వాక్సినేషన్, హెల్త్ వలంటీర్లకు సత్కారం జూన్ 13న పట్టణ మురికివాడల పర్యటన జూన్ 14న వివిధ రంగాల్లో నిష్ణాతులు, విజేతలను గుర్తించి పౌర సన్మానం. -
ముడి బియ్యం ఎంతైనా కొంటాం.. తెలంగాణ బీజేపీ ఎంపీలతో కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి గతంలో చెప్పిన మేరకు రా రైస్ (ముడి బియ్యం) ఎంతైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పేర్కొన్నట్లు తెలిసింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వమే సంతకం చేసి కేంద్రానికి లేఖ ఇచ్చిన తర్వాత దేనిని ఆశించి రాజకీయం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పార్లమెంటులో గోయల్‌ను కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. ‘అసలు రా రైస్ కొనబో మని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కాగా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా బాధ్యత. అసలు గతంలో ఇస్తామన్న బియ్యాన్నే తెలంగాణ ప్రభు త్వం ఇంతవరకు ఇవ్వలేదు. అయినా దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? పార్లమెంటు సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చా. ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్తగా డ్రామాలు ఎందుకు?’ అని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సమావేశానంతరం సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. పసుపు రైతులను ఆదుకోండి...: అరవింద్ అకాల వర్షాలతో గతేడాది పసుపు పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయం పై ఎంపీ అరవింద్ కేంద్రమంత్రి గోయల్‌తో చర్చించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సైతం ఫసల్ బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పసుపు రైతులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని గోయల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
అసంతృప్త నేతలపై ఇక కొరడా! బీజేపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: కమలంలో అసంతృప్త రేకలు విచ్చుకోకుండా అధినాయకత్వం అప్రమత్తమైంది. క్రమశిక్షణ, పార్టీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించేవారిని ఉపేక్షించబోమనే సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. అసమ్మతి నేతలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. మంగళవారం కొందరు అసంతృప్త నేతలు హైదరాబాద్‌లో జరిపిన భేటీని సీరియస్‌గా తీసుకుంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఆ నాయకులకు షోకాజ్ నోటీసులివ్వనున్నట్లు సమాచారం. ఈ నోటీసులపై సదరు నాయకులిచ్చే వివరణలు సంతృప్తికరంగా లేనిపక్షంలో వేటు వేసేందుకు కూడా వెనక్కి తగ్గేది లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు నాయకులు పదేపదే అసంతృప్త సమావేశాలు నిర్వహించడం, మీడియాలో ఆ వార్తలు రావడం వంటి అంశాలు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లాయి. అధినాయకత్వం ఆదేశాల మేరకు వారిపై రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ క్రమశిక్షణాచర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. సంజయ్ సొంత జిల్లా అయిన కరీంనగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత సుగుణాకరరావు అసంతృప్త సమావేశాలు నిర్వహిస్తున్నారని, వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన కోర్ కమిటీలు తీర్మానం చేసి కొద్దిరోజుల క్రితం జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు పంపినట్టు సమాచారం. ఇంకా ఉపేక్షిస్తే పార్టీ నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నాయి. ఈ తీర్మానాలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పరిగణనలోకి తీసుకుని క్రమశిక్షణచర్యలు తీసుకోవాలని సంజయ్‌కు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఇద్దరిలో మార్పు వస్తుందని సంజయ్ ఇంతకాలం వేచి చూసి, ఈ వ్యవహారాన్ని సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పగించారు. వారితో భేటీ అయిన ఇంద్రసేనారెడ్డి పార్టీకి నష్టం చేకూర్చే చర్యలకు పాల్పడితే ఇబ్బందులు తప్పవని సూచించినట్టు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, చింతా సాంబమూర్తి, రాములు, వెంకటరమణిలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మాపై దుష్ప్రచారం: ఆ నేతల వివరణ అసమ్మతి సమావేశాల్లో పాల్గొనలేదని, అసలు అలాంటి సమావేశాలను తాము నిర్వహించలేదని బీజేపీ అసంతృప్త నాయకులు పేర్కొన్నారు. ‘కొన్ని వార్తాచానళ్లు అసమ్మతి నాయకుల సమావేశం అని ప్రచారం చేశాయి. అది దురుద్దేశపూర్వకంగా, కుట్రతో చేస్తున్న అవాస్తవ ప్రచారం’అని గుజ్జుల రామకృష్ణారెడ్డి, చింతా సాంబమూర్తి, పాపారావు ఖండించారు. ‘అందరం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే క్రియాశీల కార్యకర్తలమే’నని వెంకటరమణి స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ దారిలోనే నడుచుకుంటాను. నేను భేటీకి వెళ్లినట్టుగా పత్రికల్లో, చానెళ్లలో వచ్చిన కథనాలు ఖండిస్తున్నాను’అని నాగూరావు నామాజీ తెలిపారు. ‘నాకు రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో ఎలాంటి అసమ్మతి లేదు. నేను ఎటువంటి అసమ్మతి సమావేశానికి హాజరు కాలేదు’అని నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. -
కమలం చేతికి చిక్కిన కాంగ్రెస్
హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా పాఠాలనే నేర్పింది. హోరాహోరీగా ఉంటుందని ఊహించిన ఎన్నికలో టీఆర్ఎస్ చతికిల పడింది. కాంగ్రెస్ నేల కరిచింది. ఈటెల రాజేందర్ బీజేపీని గెలిపించాడు. కాంగ్రెస్ ప్రభా వమున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటుబ్యాంకును తమకు అను కూలంగా మార్చుకుని కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న బీజేపీ లక్ష్యం సంపూర్ణంగా అమలు జరిగింది. ప్రజామోదం కలిగిన నాయకులను పార్టీలోకి ఆహ్వా నించి, తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో బీజేపీ కృత కృత్యమైంది. కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇది కాంగ్రెస్ సహజశైలికి విరు ద్ధంగా జరిగిన ప్రయోగం. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కబళించాలనేది బీజేపీ వ్యూహం అని తెలిసి కూడా తమ ఓటుబ్యాంకును రక్షించుకోవడం పక్కనబెట్టి టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా భావించడం వల్ల కాంగ్రెస్ ఘోరంగా నష్టపోయింది. తెరాసకు మంచి పట్టున్న నియో జక వర్గాలైన దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలలో ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్ ఓటు బ్యాంకును అనుకూలంగా మలచుకోవడంతో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ తర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే 20 శాతం ఓటుబ్యాంకు కలిగి ఉన్నదనీ, దాన్ని నిలుపుకోవడంతో పాటు, పెంచుకోగలగడం కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమైతే బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలదని విశ్లేషిం చారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. దేశంలో మరే పార్టీకి లేని అవకాశం ఒక్క కాంగ్రెస్‌కే ఉన్నదనీ, అలా చేసిన పక్షంలో ప్రాంతీయపార్టీల సహకారంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశముంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటుబ్యాంకు కలిగి ఉండటం తెరాసకు కలిసివచ్చే అంశమనీ, ఆ పార్టీ ఉనికి కోల్పో వడం తమకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందనీ దుబ్బాక ఉప ఎన్నికలోనూ, హుజూరాబాద్ ఉపఎన్నికలోనూ తెరాస గ్రహించివుంటుంది. 2018 సాధారణ ఎన్నికలలో తెరాస ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నిలిచి 61,121 ఓట్లు సాధిం చింది. ఉప ఎన్నికలో 95.07 శాతం ఓట్లు నష్టపోయి కేవలం 3,014 ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు పట్టున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కనీసం ఇలాంటి చోటైనా పార్టీ జాతీయ నాయకత్వం తమ శక్తియుక్తులు ఉపయోగించి తమ ఉనికిని కాపాడుకోవాలి. బీజేపీని వదలి, టీఆర్ఎస్ను మాత్రమే ఓడించడం లక్ష్యంగా పెట్టుకోవడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే. ఓటర్లు సహితం కాంగ్రెస్ క్యాడ ర్తో ఈటెలను తద్వారా బీజేపీని గెలిపించారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 58,107 ఓట్లను కోల్పోయింది. ఓటర్లు ఒక పార్టీనుండి ఇంకొక పార్టీ వైపు గంపగుత్తగా మొగ్గు చూపి గెలిపించిన సందర్భమిది. కాంగ్రెస్ కోల్పోయిన ఈ ఓట్లలో 75 శాతం మంది ఈటెల వైపు మొగ్గు చూపి ఉంటారనుకోవ డంలో సందేహం లేదు. ఈటెల సాధించిన మెజారిటీ 23,855. తెరాస గత ఎన్నికలతో పోలిస్తే 19 శాతం ఓటుబ్యాంకును కోల్పోయింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం 11.58 శాతంగా నిలిచింది. కాంగ్రెస్ 40 శాతం ఓటుబ్యాంకు నిలుపుకోగలిగినా పోటీ నువ్వా నేనా అనేటట్లు ఉండటమే గాక, జాతీయ ప్రత్యర్థి బీజేపీకి సవాలుగా మారివుండేది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీయే గానీ టీఆర్ఎస్ కాదు. అందుకే ఈ పరిణామాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిశితంగా పరిశీలించి, బీజేపీ వలలో ఎలా పడ్డారో విశ్లేషించుకోవాలి. ఈ ఉప ఎన్నికలో ఓడిపోవడం వల్ల టీఆర్ఎస్కు జరిగిన నష్టం పెద్దదేమీ కాదు. ప్రత్యేక పరిస్థితులలో జరిగిన ఎన్నికలలో ఇలాంటి ఓటములు సహజం. దాన్ని ఆ పార్టీ తట్టుకుని నిలబడగలదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాంటిది కాదు. ప్రతి ఎన్నిక వారికి ఒక సవాలు. హుజూరాబాద్‌లో జరిగిన నష్టం జాతీయ నాయకత్వం చిన్నదిగా భావించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టే బీజేపీ వ్యూహ కోరల్లో కాంగ్రెస్ చిక్కుకుందని మాత్రం జాతీయ నాయకత్వం కచ్చితంగా గ్రహించాలి. వ్యాసకర్త: డా. జి.వి. సుధాకర్ రెడ్డి ఏపీపీఎస్సీ సభ్యులు -
‘సాగర్’లో భారీగా పోలింగ్...ఎవరిదో గెలుపు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. గత ఎన్నికలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ ఈసారి అదనంగా మరో 2 గంటలు పోలింగ్ సమయాన్ని పెంచింది. ఈ ఉపఎన్నికలో 86.2 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదైంది. గత ఎన్నికల్లో 2,08,176 ఓట్లకు గాను, 1,79,995 ఓట్లు పోల్ కావడంతో 86.46 శాతం పోలింగ్ నమోదైంది. అంతే కాకుండా.. గత ఎన్నికల కంటే ఈసారి 12 వేల ఓట్లు కూడా పెరిగాయి. ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగింది. ఓట్లు వేయించడంలోనూ పోటాపోటీ ఇరు పార్టీలకు ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యంగా మారడంతో ఎన్నికల ప్రచారంలో పోటీ పడినట్లే.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించడలోనూ పోటీ పడినట్లే కన్పించింది. దీంతో పోలింగ్ జోరుగా సాగింది. ప్రతి ఓటును కీలకంగా భావించి.. ఆయా గ్రామాల్లో స్థానిక నేతలు శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు పల్లెల్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలోనే ఆయా పార్టీ కార్యకర్తల పోల్ చీటీలు పంచే అవకాశమిచ్చారు. దీంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రం దరిదాపుల్లో ఎవరూ లేకుండా అయ్యారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
హైదరాబాద్‌లో టి.బీజేపీ కోర్‌కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కోర్‌కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. త్వరలో జరగనున్న వరంగల్ లోక సభ స్థానానికి ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, సభ్యత్వ నమోదుతోపాటు నాగం వ్యవహారంపై కూడా కోర్‌కమిటీ చర్చిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, శాసన సభలో ఆ పార్టీ నేత కె. లక్ష్మణ్ తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు ఈ కోర్ కమిటీకి హాజరయ్యారు.