సాక్షి,సిద్దిపేట: రాష్ట్రంలో అధి కారానికి ఒకరు పాదయాత్ర, మరొకరు మోకాళ్ల యాత్ర చేస్తున్నారని, ఎవరెన్ని గిమ్మి క్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విశ్వసించరని, తెలంగాణ గుండె చప్పుడు టీఆర్‌ఎస్ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారు మన రాష్ట్రంలోని పథకాలు కాపీ కొట్టి కేంద్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటోం దని ఆయన ఆరోపించారు.
75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభు త్వం దళితుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరిం చారు. అమర్‌నాథ్ యాత్రికులకు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు గతంలో గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో ఇచ్చేవారని, ఈ ఏడాది నుంచి నిజామాబాద్, ఆదిలా బాద్ ఆస్పత్రుల్లో కూడా ఇస్తామని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment