telangana health minister
-
ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరిచాం: హరీష్ రావు
దూద్‌బౌలి: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి పరిచామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు లభించని వారికి మిల్క్ బ్యాంకులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుప్రతుల్లో 55 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 20 శాతం సాధారణ ప్రసవాలు, 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్య సేవలను అందించడంలో దేశంలో మూడో స్థానంలో ఉందని చెప్పారు. పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు అందిస్తున్న సేవలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాప పుట్టిన అనంతరం కొందరు కిందిస్థాయి సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఓ పాప తల్లి ఫిర్యాదు చేయగా... అలాంటివి జరగకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చుపెడతామన్నారు. ఏ సమస్యలున్నా..డీఎంఈ ద్వారా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హరీష్‌రావు హమీ ఇచ్చారు. ఓపీ, ఇతర వార్డుల్లో తిరిగి ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పేట్లబురుజు ఆసుపత్రిలోని మహిళలకు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పసుపు బొట్టు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, పేట్లబురుజు ఆసుప్రతి సూపరింటెండెంట్ పి.మాలతి, ఆర్ఎంఓ సి.పి.జైన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నిజామాబాద్‌లో హోల్‌సేల్ చేపల మార్కెట్! -
రాష్ట్రంలో ఒకరు పాదయాత్ర.. మరొకరు మోకాళ్ల యాత్ర
సాక్షి,సిద్దిపేట: రాష్ట్రంలో అధి కారానికి ఒకరు పాదయాత్ర, మరొకరు మోకాళ్ల యాత్ర చేస్తున్నారని, ఎవరెన్ని గిమ్మి క్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విశ్వసించరని, తెలంగాణ గుండె చప్పుడు టీఆర్ఎస్ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారు మన రాష్ట్రంలోని పథకాలు కాపీ కొట్టి కేంద్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటోం దని ఆయన ఆరోపించారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభు త్వం దళితుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరిం చారు. అమర్నాథ్ యాత్రికులకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు గతంలో గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో ఇచ్చేవారని, ఈ ఏడాది నుంచి నిజామాబాద్, ఆదిలా బాద్ ఆస్పత్రుల్లో కూడా ఇస్తామని మంత్రి వెల్లడించారు. -
నెలలో ఓ రోజు ఆసుపత్రిలో నిద్రిస్తా: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘క్షేత్రస్థాయిలోని సమస్య లు తెలుసుకునేందుకు, తక్షణం పరిష్కరించి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రతినెలా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను తప్పనిసరిగా సందర్శించాలి. నెలలో ఒకరోజు రాత్రి పీహెచ్‌సీల్లో నిద్ర చేయాలి. నేను కూడా ఓ రోజు నిద్ర చేస్తాను’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నెలవారీ సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల పనితీరు, పురోగతిపై ఆదివారం ఆయన అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌ౖ వైజరీ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఎన్సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సి–సెక్షన్ల రేటు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టి–డయాగ్నొస్టిక్, ఐహెచ్ఐపీ తదితర వైద్యసేవలపై జిల్లాలు, పీహెచ్‌సీలవారీగా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం.. శిశు మరణాల రేటు 23 నుంచి 21కి తగ్గిందని, 2014లో ఇది 39 ఉండేదన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరగటం, కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మీ, 102 వాహన సేవలు, మారుమూల ప్రాంతాలకు సైతం మెటర్నిటీ సేవలు విస్తరించడం, ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు వంటి వి శిశు మరణాలరేటు తగ్గుదలకు దోహదం చేశాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 60 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, ఇవి చాలావరకు తగ్గాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్లు జరగకుండా చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో అన్ని పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్నివేళల్లో అందించాలని ఆదేశించారు. అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో అప్లోడ్ చేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్వేతామహంతి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్‌ఎంసీఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరిశ్రావుతో స్ట్రెయిట్ టాక్ ప్రోమో
-
కొత్త వేరియంట్ పై హరీష్‌రావు ఉన్నత స్థాయి సమావేశం..
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ పై జూబ్లీహిల్స్ లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ లో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి హాస్పిటల్స్‌లో మౌళిక సదుపాయాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక ఫోకస్, ట్రెసింగ్, టెస్టింగ్ తదితర అంశాలపై చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే కరోనా కొత్త వేరియెంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఒమీక్రాన్ వేరియంట్‌పై పూర్తిస్థాయి రివ్యూచేశాం.. ఒమీక్రాన్ వేరియంట్‌పై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. యూరోపియన్, హాంకాంగ్ సౌత్ ఆఫ్రికా నుండి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా .. విదేశీయులు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారా.. లేదా .. క్వారంటైన్లో పెట్టి టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కొత్త వేరియంట్ నమోదు కాలేదని, కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు వ్యాక్సిన్ పూర్తిగా వేసుకోవాలి.. రెండో డోస్ ఎవరు తీసుకోలేదో వారు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఒమి క్రాన్ వేరియంట్ ప్రభావం దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరో రెండు వారాలు పడుతుందన్నారు. ప్రజలు.. విధిగా భౌతిక దూరం పాటించాలి,మాస్కులు ధరించాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రాణాలు కోల్పోయే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొవడానికి ముందస్తు చర్యలు తీసుకున్నామని హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం.. 60 వేల వరకు బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అదే విధంగా.. 10 వేల పడకలు పిల్లల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు. రెండు డోసులు వేసుకున్న 6 నెలల తరువాత బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడో డోస్‌పై విధి విధానాలు రూపొందిస్తోందని తెలిపారు. ఆ విధివిధానాలు వచ్చాక మూడో డోస్ గురించి చెప్తామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేదు: ఈటల
-
ప్రభుత్వాసుపత్రుల కోసం స్థలాలు పరిశీలించిన లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల స్థాయిలో నగరంలో మరో రెండు ప్రభుత్వాసుపత్రులను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ పనిలో పడ్డారు. శ నివారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో మాట్లాడారు. సమావేశం అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్థలాలను, పాత భవనాలను మంత్రి పరిశీలించారు. గచ్చిబౌలి స్టేడియం పక్కన ఉన్న 14 అంతస్తుల పాత భవనాన్ని పరిశీలించారు. వెయ్యి పడకలతో రెండు పెద్ద ఆసుపత్రులు, లేదా 500 పడకలతో హైదరాబాద్‌కు నలు దిక్కులా నాలుగు ఆసుపత్రులు నిర్మించాలని సర్కారు యోచిస్తోంది. ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కింగ్‌కోఠి ఆసుపత్రిని స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం ఉదయం కూడా ఎల్బీనగర్ ప్రాంతంలో ఉండే ఖాళీ స్థలాలను మంత్రి పరిశీలిస్తారు. -
ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక సెల్
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం కోఠిలోని 104 ఆరోగ్య కేంద్రంలో ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువగా పెరగడం బాధాకరమని ఆయన చెప్పారు. -
చిన్నారి మృతిపై మంత్రి రాజయ్య స్పందన
-
మెడికల్ కాలేజీని పరిశీలించిన రాజయ్య