సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్య వర్గ భేటీ సందర్భంగా తెలంగాణ సంస్కృ తీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రముఖు లకు స్వాగతం పలకాలని రాష్ట్ర శాఖ నిర్ణ యించింది. ఒకరోజు పూర్తిగా తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు జరగ నున్న నోవాటెల్–హెచ్‌ఐసీసీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్, సంస్థా గత వ్యవహారాల సహాయ ప్రధాన కార్య దర్శి శివకుమార్, జాతీయ కార్యదర్శి, కార్య వర్గ సమావేశాల ఇంచార్జీ అరవింద్ మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్ర రావు తదితరులు సందర్శించారు.
వివిధ కమిటీల నియామకం...
సమావేశాల నిర్వహణకు 34 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాధాన్యత ఉన్న 9 కమిటీలను మొదట వేసి, ఏర్పాట్లను పరి శీలిస్తారు. ఈ కమిటీలన్నింటిని రాష్ట్ర నేతలు సంజయ్, డా‘‘కె.లక్ష్మణ్, మంత్రి శ్రీనివాస్ పర్యవేక్షిస్తారు. సమావేశాల ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా లక్ష్మణ్ వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ కూడా వివిధ కమి టీల కార్యక్రమాలను సమన్వయపరుస్తుం ది. ఈ కమిటీల కన్వీనర్లు, సభ్యులతో జాతీ య నేతలు సమావేశమై కార్యక్రమాలను వివరించారు. ఏర్పాట్ల పరిశీలనకు ఈనెల 14న జాతీయ నేతలు మళ్లీ రాష్ట్రానికి రాను న్నారు. అప్పటికల్లా కమిటీలకు సంబంధిం చిన బ్లూప్రింట్‌ను సమర్పించాలన్నారు. కాగా, జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యా చారం కేసులో పోలీసులు సరిగా వ్యవహ రించడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. నోవాటెల్‌ను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment