national working meet
-
మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే
న్యూఢిల్లీ: ‘‘కేంద్రం ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు మాత్రమే. పలు కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోనూ ఇదే స్పష్టమైంది’’ అని బీజేపీ పేర్కొంది. సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు ఈ మేరకు చేసిన రాజకీయ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. ‘‘రఫేల్, పెగసస్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, నోట్ల రద్దు, ఈడబ్ల్యూఎస్ కోటా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర దుష్ప్రచారం సాగించాయి. కానీ వీటికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ కేంద్రం వైఖరిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. విపక్షాలు చెబుతున్నదంతా అబద్ధమేనని దీంతో తేలిపోయింది’’ అని ఆమె అన్నారు. మోదీపై వారి నిరాధార ఆరోపణలను చట్టపరంగా తిప్పికొట్టామన్నారు. ‘‘దేశం కోసం పనిచేస్తున్న మోదీకి ప్రపంచదేశాల్లో గౌరవం లభిస్తోంది. దేశ ప్రతిష్టను ఆయన పెంచారు’’ అన్నారు. 2023 ఎన్నికలు కీలకం: నడ్డా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023లో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాల్లో ఒక్కదాన్నీ బీజేపీ కోల్పోరాదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతోందని కొనియాడారు. మోదీకి ఘన స్వాగతం అంతకుముందు కార్యవర్గ సమావేశానికి వస్తున్న మోదీకి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ దాకా పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానిపై పూలు చల్లారు. నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ విజయాలను తెలుపుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద మోదీకి నడ్డా స్వాగతం పలికారు. -
అతి(ర)థులోస్తున్నారు! స్టార్ హోటళ్లలో నో రూమ్స్ బోర్డ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి స్టార్ హోటళ్లన్నీ నో రూమ్స్ బోర్డ్‌లు పెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకానున్నారు. వీరంతా రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. దీంతో నగరంలోని స్టార్ హోటల్స్ అన్నీ ముందస్తు బుకింగ్స్ అయిపోయాయి. అన్ని స్టార్ హోటళ్లలో బుకింగులు.. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల కోసం నగరంలోని హెచ్ఐసీసీ, నోవాటెల్ వంటి 48–50 స్టార్ హోటల్స్ బుకింగ్ చేసినట్లు తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ నాగరాజు తెలిపారు. స్థానిక, ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలు, చిన్న లీడర్ల కోసం ఓయో గదులు, గెస్ట్ హౌస్‌లను బుకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒకటే గదులు ఇద్దరు ముగ్గురు వసతికి వీలుంటుందనే ఉద్దేశంతో వీటిని బుకింగ్ చేసినట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకూ ఎగ్జిక్యూటివ్, సుపీరియర్, డీలక్స్, ప్రీమియర్ గదులన్నీ బుకింగ్ చేసేశారని ఆ స్టార్ హోటల్ ప్రతినిధి తెలిపారు. ప్రతినిధుల కోసం వంటకాలు, ఇతరత్రా ప్రత్యేక ఏర్పాట్ల కోసం ప్రణాళికలు చేసినట్లు సమాచారం. పోలీసుల సమీక్ష... జులై 2, 3 తేదీల్లో గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అలాగే బీజేపీలోని కీలక నేతలు నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు. దీంతో హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ యాజమాన్యంతో సోమవారం సైబరాబాద్ పోలీసులు సమావేశం నిర్వహించనున్నారు. ఆయా హోటల్స్‌లోని బుకింగ్స్ వివరాలు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హెచ్ఐసీసీ, నోవాటెల్‌తో పాటు కేంద్ర మంత్రులు బస చేయనున్న ఆయా హోటల్స్ భద్రతా ఏర్పాట్లపై పోలీసులు బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. (చదవండి: ప్రధాని బస ఎక్కడా?) -
మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా...
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్య వర్గ భేటీ సందర్భంగా తెలంగాణ సంస్కృ తీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రముఖు లకు స్వాగతం పలకాలని రాష్ట్ర శాఖ నిర్ణ యించింది. ఒకరోజు పూర్తిగా తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు జరగ నున్న నోవాటెల్–హెచ్ఐసీసీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్, సంస్థా గత వ్యవహారాల సహాయ ప్రధాన కార్య దర్శి శివకుమార్, జాతీయ కార్యదర్శి, కార్య వర్గ సమావేశాల ఇంచార్జీ అరవింద్ మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్ర రావు తదితరులు సందర్శించారు. వివిధ కమిటీల నియామకం... సమావేశాల నిర్వహణకు 34 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాధాన్యత ఉన్న 9 కమిటీలను మొదట వేసి, ఏర్పాట్లను పరి శీలిస్తారు. ఈ కమిటీలన్నింటిని రాష్ట్ర నేతలు సంజయ్, డా‘‘కె.లక్ష్మణ్, మంత్రి శ్రీనివాస్ పర్యవేక్షిస్తారు. సమావేశాల ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా లక్ష్మణ్ వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ కూడా వివిధ కమి టీల కార్యక్రమాలను సమన్వయపరుస్తుం ది. ఈ కమిటీల కన్వీనర్లు, సభ్యులతో జాతీ య నేతలు సమావేశమై కార్యక్రమాలను వివరించారు. ఏర్పాట్ల పరిశీలనకు ఈనెల 14న జాతీయ నేతలు మళ్లీ రాష్ట్రానికి రాను న్నారు. అప్పటికల్లా కమిటీలకు సంబంధిం చిన బ్లూప్రింట్‌ను సమర్పించాలన్నారు. కాగా, జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యా చారం కేసులో పోలీసులు సరిగా వ్యవహ రించడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. నోవాటెల్‌ను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. -
సదస్సుకు ఎజెండా సిద్ధం
బెంగళూరు: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సులో చేపట్టాల్సిన అంశాలను (ఎజెండాను) ఖరారు చేసేందుకు బీజేపీ జాతీయ పదాధికారులు గురువారం బెంగళూరులో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. దాదాపు 10 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా నమోదు చేయించటంతో బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఏడెనిమిది రెట్లు ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగిందంటూ.. ఇందుకు కృషి చేసిన పార్టీ విభాగాలను షా అభినందించారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడి కృషిని పలువురు పార్టీ నేతలు ప్రశంసించారు. ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై ఈ భేటీలో చర్చించారు. ఇందులో ఒకటి దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, మోదీ ప్రభుత్వం నేతృత్వంలో సాధించిన విజయాలను గురించిన తీర్మానం. రెండోది.. మోదీ సారథ్యంలో దేశ విదేశాంగ విధానం విజయవంతం కావటాన్ని గురించి చెప్పే తీర్మానం. ఈ నెల 6వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, 14వ తేదీన అంబేద్కర్ జయంతి నిర్వహణలతో పాటు.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది నిండే సందర్భంగా మే 26న చేపట్టాల్సిన కార్యక్రమాలను, జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపైనా పదాధికారుల భేటీలో చర్చించారు. పార్టీ అత్యున్నతం.. ప్రభుత్వం సాధనం పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధానిమోదీ గురువారం మధ్యాహ్నానికే చేరుకున్నారు. ఆయన సాయంత్రం 4 గంటల సమయంలో పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరయ్యారు. పదాధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ఓటర్లు పార్టీ సభ్యులుగా మారటం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీయే అత్యున్నతమని.. దాని లక్ష్యాలను సాధించటానికి ప్రభుత్వం ఒక సాధనమని అభివర్ణించారు. నేడు, రేపు జాతీయ కార్యవర్గ భేటీ... బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు శుక్రవారం బెంగళూరులో ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభోపన్యాసం చేస్తారని, ప్రధానమంత్రి మోదీ సదస్సుకు అధ్యక్షత వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సీనియర్ నేతలతో పాటు 111 మంది సభ్యుల కార్యవర్గం, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ఆహ్వానితులు హాజరవుతారు. అలాగే.. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నగరంలోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో పార్టీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఇదిలావుంటే.. పార్టీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముగింపు ప్రసంగం చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలూ సెలవు తీసుకున్నట్లున్నారు... సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా సెలవు తీసుకున్నట్లున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్హుసేన్ ఎద్దేవాచేశారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి బీజేపీ తప్పుడు సమాచారం ఇస్తూ అతిపెద్ద పార్టీ అని గొప్పలు చెప్పుకుంటోందన్న కాంగ్రెస్ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ పై విమర్శలు చేయడం మానేసి తమ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవడం పై దృష్టి సారిస్తే బాగుంటుంది’’ అని విమర్శించారు.