పంచముఖ పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : అన్ని పార్టీల్లో చర్చలు ముగిసి పొత్తులు ఖరారు కావడంతో రాష్ట్రంలో పంచముఖ పోటీగా నిర్ధారణ అరుు్యంది. రాష్ట్రం నుంచి రెండు జాతీయ, అనేక ప్రాం తీయ పార్టీలు రాజకీయాన్ని పంచుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని కూటములుగా మారిపోతాయి. ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పడిన పొత్తులు రాజకీయ విశ్లేషకులకు కావలసినంత వినోదాన్ని పంచాయి.
ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ అనూహ్యంగా బలం పుంజుకుంది. మోడీ హవాకు ఆకర్షితులైన ప్రాంతీయ పార్టీలు బీజేపీలో చేరేందుకు ఉత్సుకతను ప్రదర్శించాయి. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే, కేఎన్‌ఎంకే అన్నీ బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యూరుు. సీట్ల కేటాయింపులో పార్టీ నేతల సహనాన్ని పరీక్షించారు. ఎట్టకేలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఆశించిన రీతిలోనే కూటమి ఏర్పడింది. పార్టీల సంఖ్యను పోల్చుకుంటే బీజేపీనే పెద్దకూటమిగా మారింది.
బీజేపీ వలపన్నిన పార్టీలకే డీఎంకే సైతం వలపన్ని నేతలను కూడగట్టడంలో విఫలమైంది. రాష్ట్రంలో బలంగా ఉన్న అన్నాడీఎంకేను ఢీకొట్టాలంటే డీఎండీకే అవసరమని ఆశపడింది. కెప్టెన్ విజయకాంత్ బీజేపీవైపు మొగ్గుచూపడంతో వీసీకే, ఎంఎంకే, పుదియ తమిళగం, ఐయూఎంఎల్ వంటి చిన్న పార్టీలతోనే కూటమిని ఖరారు చేసుకుంది. వామపక్షాలను కలుపుకున్న అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు కుదర క పోవడంతో ఒంటరి పోరుకు దిగింది. ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను సైతం రప్పించి జయతో చర్చలు జరిపించిన సీపీఐ, సీపీఐ చివరకు శృంగభంగానికి గురయ్యూరుు. దీంతో చెరో 9 స్థానాల నుంచి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యూరు.
వీడిపోయిన మాజీ మిత్రపక్షం డీఎంకే చేరువవుతుందని కాంగ్రెస్ చివరి వరకు ఆశించింది. కనీసం డీఎండీకేతోనైనా కలిసి నడవాలని ఎదురుచూసింది. కాంగ్రెస్‌తో జతకట్టేందుకు చిన్నపాటి పార్టీలు సైతం ముందుకు రాకపోవడంతో తప్పని సరై ఒంటరిపోరుకు సిద్ధమైంది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వమే వస్తుందంటూ దేశస్థాయిలో జోరుగా సాగుతున్న ప్రచారంతోపాటు రాష్ట్రంలో బలమైన కూటమి గా ఏర్పడిన బీజేపీ గట్టి పోటీనే ఇవ్వనుంది. అధికార అన్నాడీఎంకే, డీఎంకే కూడా పోటాపోటీగా రంగంలో ఉన్నాయి.
ప్రధానంగా ఈ మూడు పార్టీలతో ముక్కోణపు పోటీగా చెప్పవచ్చు. రాష్ట్ర సమస్యలపై అవలంబించిన నిర్లక్ష్య ధోరణి కాంగ్రెస్‌కు శాపంగా మారి నామమాత్ర పోటీ స్థాయికి దిగజార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పార్టీ కేడర్‌లేని వామపక్షాలు సైతం ఉనికి కోసమే పోటీచేస్తున్నాయి. బలమైన, బలహీనమైన పార్టీలతో రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొంది.