సూత్రబద్ధత లేని గాలివాటు రాజకీయాలు | politics without principles | Sakshi
Sakshi News home page

సూత్రబద్ధత లేని గాలివాటు రాజకీయాలు

Published Mon, Sep 7 2015 12:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సూత్రబద్ధత లేని గాలివాటు రాజకీయాలు - Sakshi

సూత్రబద్ధత లేని గాలివాటు రాజకీయాలు

సందర్భం:

]రాజకీయాల్లో విషయాలు నిరంతరం మారుతుంటాయి. కనీసం భారత్‌లో ఇలా జరుగుతుంటుంది. మార్పు అనేది స్థిరం, శాశ్వతం అనేంత తరచుగా ఇది జరుగుతుంటుంది. కలవటం, విడిపోవడం రాజకీయాలకు సంబంధించిన ఒక వాస్తవం. ఒక్కమాటలో చెప్పాలంటే మనవి గాలివాటు రాజకీయాలు.


             ఒకసారి 1995 కేసి వెనక్కు చూద్దాం. మహారాష్ట్రలో శివ సేన, బీజేపీ పార్టీలు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడించినప్పుడు భావజాలప రంగా తన బద్ధ శత్రువు ముందు కాంగ్రెస్ తలవంచి నట్లు కనిపించింది.. ఓడి పోయిన పార్టీ తనలోకి తాను ముడుచుకుపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక మంత్రుల ముఖాలకేసి చూ డటం కూడా ఆపివేశారు. అంటే తమ నియోజకవ ర్గాలకు సంబంధించిన అంశాలను కూడా వారు ప్రస్తా వించలేదని దీనర్థం కాదు కానీ, కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన న్యూనతకు గురైంది. కానీ 1999లో జరిగిన తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్, దాన్నుంచి చీలి కొత్తగా ఏర్పడిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పర్చాయి. కేవలం తమ మొత్తం ఓట్ల వాటాను తిరిగి పొంద గలగటం ద్వారానే అవి పాలనకొచ్చాయి.


 ఓటర్లు ఎవరిని ఎంచుకున్నారు అన్న అంశంతో సంబంధం లేకుండా, ప్రభుత్వం ప్రతి ఒక్కరి కోసం ఏర్పడిందన్న అవగాహనను తిరస్కరిస్తే అలా తిరస్క రించినవారే నష్టపోతారన్నది అస్పృశ్యతా రాజకీయా లలో ఎవరైనా నేర్చుకోవలసిన గుణపాఠం. అలాగని పాలకపార్టీకి సంబంధించిన పాపాలను ఇది తగ్గించదు. ఏమయినప్పటికీ ఎనిమిదేళ్లపాటు నితీష్‌కుమార్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న బీజేపీలో ఈ అవగా హన లోపించిందనిపిస్తోంది. బీహార్‌లో జరిగిన సమస్త పాపాలకు నితీష్ కుమార్ ఒక్కరే కారణమన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. ఇది చాలా అన్యాయం.


 రాజకీయవాదులు ఎన్ని తిరుగుళ్లు తిరిగినా వాస్తవం మారదు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం తమ అవగాహన గురించి వ్యర్థ సంభాషణలు ఎన్ని చేసినా వాస్తవ చిత్రం మారిపోదు. గతవారం భాగల్పూర్‌లో ప్రధాని నరేంద్రమోదీ నితీష్‌కుమార్‌ను ఉద్దేశించి ఒకటి రెండు ప్రశ్నలు సంధించినప్పుడు ఇలాంటి ప్రదర్శనే జరిగింది. ఆ ప్రశ్నలేమిటంటే.. జయప్రకాష్ నారాయణ్ ను తీవ్రంగా వేధించిన వారితో నితీష్ ఎందుకు కుమ్మక్కవుతున్నారు? జేపీని అరెస్టు చేసి జైల్లో పెట్టిన వారితో మీరు ఎందుకు కలిసి కూర్చుంటున్నారు? అయితే మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా ఎందుకు మారిపోతున్నారు అనే ప్రశ్నను మోదీ సంధించలేదు. లాలూ యాదవ్, నితీష్ కుమార్ అదే ప్లాట్‌ఫాంపై ఉన్నారు మరి.


 జేపీని అరెస్టు చేసిన వారు అనే భావన సోనియా గాంధీని ఉద్దేశించి ప్రస్తావించినది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిర్వహించిన ర్యాలీలో విశాల లౌకిక కూటమి వేదికపై ఆమె లాలూ, నితీష్‌లతో వేదిక పంచుకున్నారు. మోదీ విమర్శ నితీష్‌ను కుట్టి విడవ వచ్చు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం దీనికి భుజాలు ఎగురవేయవచ్చు. చాలామంది రాజకీయ నేతల కంటే లాలూ దళసరి చర్మం ఎక్కువైన నేత. మోదీ ప్రశ్న తనను ఏమాత్రం చికాకు పెట్టకపోవచ్చు కూడా.


 రాజీలనేవి రాజకీయాలకు ప్రమాణం వంటివి. అనివార్యం, తప్పనిసరి అనే రూపంలో వీటిని సమర్థి స్తుంటారు. అవి సారాంశంలో అధికార సాధనలో, లేదా అధికారంలో వాటా కోసం పరుగుపెట్టే అనివార్యతలు. నిజాయితీ కలిగిన రాజకీయనేతగా చెబుతున్న మన్మో హన్ సింగ్ కూడా సంకీర్ణ రాజకీయాల అనివార్యతల వల్లే తన ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో దెబ్బతిందని చెప్పారు. ఏమయినప్పటికీ అధికారం ప్రజల మంచికి కాదన్నది స్పష్టం.


 అయితే ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ.. రాజకీ యాలను మంచీ చెడూ మధ్య ఆటలాగా చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆ మంచీ చెడుల మధ్య ఉన్న వర్ణాల గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని మోదీ భావన కావచ్చు. రాజకీయాల్లో విషయాలు మారుతుం టాయి. కనీసం భారత్‌లో ఇలా జరుగుతుంటుంది. మార్పు అనేది స్థిరం, శాశ్వతం అనేంత తరచుగా ఇది జరుగుతుంటుంది. కలవటం, విడిపోవడం రాజకీయా లకు సంబంధించిన ఒక వాస్తవం. ఇవి గాలివాటు రాజకీయాలు. నితీష్-యాదవ్ ద్వయం కాలమే గాయాలను మాన్పుతుందని పదే పదే నిరూపించారు. బీజేపీ వంటి బలమైన ప్రత్యర్థితో ఢీకొంటున్నప్పుడు రాజీలు అవసరమే మరి.


 బీజేపీలో చేవచచ్చిన నేతలు పోటీ చేయడం వల్ల మాత్రమే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయం సాధించి స్వంతంగానే మెజారిటీలోకి రాలేదన్న వాస్త వాన్ని మోదీ మర్చిపోయారు. తమ తమ పార్టీలతో లెక్కలు తేల్చుకోవాలని బీజేపీలోకి వలస వచ్చిన వారు, మోదీలో విజేతను పసిగట్టి గెలుపొందే పార్టీ వైపు మొగ్గు చూపినవారితో ప్రస్తుతం బీజేపీ నిండి పోయింది. ఇతరు లను తనలోకి తీసుకోవడం ప్రాతి పదికనే బీజేపీ అంత పెద్ద ప్రయోజనం పొందగలి గింది. జయప్రకాష్ నారాయణ్‌ను తీవ్రంగా వేధించిన పార్టీ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలోకి వలస వచ్చిన విషయం గమనించాలి.


 భారత రాజకీయ సంప్రదాయం పూర్తిగా అలాంటి రాజీలతోనే కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అలాంటి రాజీలతో కొనసాగుతున్నదే. ప్రభుత్వాన్ని ఏర్పర్చే క్రమంలో అనేక వివాదాస్పద సమస్యలను పక్కనబెడుతున్నారు. అపహరణకు గురైన తన కుమా ర్తెను క్షేమంగా విడిపించుకోవడానికి ఉగ్రవాదుల విడుద లకు అంగీకరించిన నాటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ మ్మద్ సయీద్ నేతృత్వంలో ప్రభుత్వ స్థాపనకు సహక రించాలని బీజేపీ ఎందుకు నిర్ణయించింది?


 కానీ, రాజకీయాల్లో విషయాలు ఆ ప్రాతిపదికన పనిచేయవు. రాజకీయాలు అంటే అవకాశవాదం. దీన్ని పూర్తి స్థాయిలో మనం పార్లమెంటులో చూశాం. కొన్ని సూత్రాలను చట్టాలుగా రూపొందించడానికి వాటిని అంగీకరించి ప్రమోట్ చేసిన పార్టీలు కూడా ఇప్పుడు అవే సూత్రాలను వ్యతిరేకిస్తున్నాయి.


 సూత్ర రీత్యా గతంలో తాను ప్రతిపాదించిన దాన్ని కూడా కాంగ్రెస్ ప్రస్తుతం వ్యతిరేకిస్తోంది. అలాగే గతంలో ఒక శాసనంపై యూపీఏ ప్రతిపాదనను వ్యతి రేకించిన బీజేయే ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తోంది. అందుచేత, జేపీని మనం పూర్తిగా మర్చిపోవలసిన లేదా ఆయన ఆచరణకు పూర్తిగా మళ్లవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది.
 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement