టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు | congress,bjp competition for second position | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు

Published Tue, Sep 2 2014 2:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు - Sakshi

టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు

- రెండో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పోరాటం
- ఈ పార్టీలకు పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకడం లేదు
- నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
జిన్నారం:  మెదక్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఎంపీ బీపీ పాటిల్, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డితో కలిసి వచ్చిన ఆయన సోమవారం బొంతపల్లిని భద్రకాళీసమేత వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని ఆపే సత్తా కాంగ్రెస్, బీజేపీలకు లేదన్నారు.

ఓటమి తప్పదని తెలిసినా ఆయా పార్టీల నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలకు పలు చోట్ల పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో చేసేది లేక ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను అరువు తెచ్చుకుంటున్నార న్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి స్థాయి విశ్వాసం ఉందన్నారు.

అందుకే ప్రజలు గతంలోకన్నా అధిక మెజార్టీని టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిన్నా రం మండలంలో ముఖ్య నేతలుగా ఎదిగిన మామాఅల్లుళ్లు చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి చేరికతో ఇక్కడ టీఆర్‌ఎస్ మరింత బలోపేతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు న ర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మురళీయాదవ్, చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, గౌరీశంకర్‌గౌ డ్, శ్రీనివాస్‌రెడ్డి, భద్రప్ప, హుస్సేన్, లక్ష్మినారాయణ, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement