భూమాపై కేసులు అక్రమం | Cases of illegal bhuma | Sakshi
Sakshi News home page

భూమాపై కేసులు అక్రమం

Published Mon, Jul 6 2015 12:49 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

భూమాపై కేసులు అక్రమం - Sakshi

భూమాపై కేసులు అక్రమం

ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
 
పామర్రు : కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డినిఅధికార పార్టీ నాయకులు స్థానిక అధికారులతో కలిసి కక్ష సాధింపుతో అరెస్టు చేయించడం నీచ రాజకీయానికి నిదర్శనమని పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన దుయ్యబట్టారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆయనపై అక్రమ కేసులు, వేధింపులు చేస్తూనే ఉన్నదన్నారు. భూమా ఆరోగ్యం బాగుండలేకపోయినా 12 గంటలపాటు పోలీ స్‌స్టేషన్‌లో ఉంచడం కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నిం చారు.

నేను ఎమ్మెల్యేని తనను గౌరవించాలని అన్న పదాన్ని అధికార పార్టీ నాయకులు తప్ప డు దారి పట్టించి భూమాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే తన ఆరోగ్యం బాగోలేదని, వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే దా నిని కూడా టీడీపీ నాయకుల సలహాతో ఒప్పుకోకపోవడం అన్యాయన్నారు. భూమానాగిరెడ్డికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు బాధ్య త వహించాల్సి వస్తుందని కల్పన హెచ్చరించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ మొబీన్, జిల్లా పార్టీ నాయకులు బొప్పన స్వర్ణలత, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement