ఉప్పులేటి కల్పనపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తక్షణమే పార్టీ ఫిరాయించిన ఉప్పులేటి కల్పనపై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యదర్శిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు పార్టీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.