
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు జైలు శిక్ష పడ్డ తర్వాత కూడా ఎమ్మెల్యేగా కొనసాగడం చట్ట విరుద్ధమని వైఎస్సార్‌సీపీ నేత పేర్నినాని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
భీమడోలు కోర్టు చింతమనేనికి రెండేళ్ల జైలు శిక్ష విధించిందని.. 1951 ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం ఆయనను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలన్నారు. తీర్పు వచ్చి రెండు రోజులు గడిచినా అసెంబ్లీ కార్యదర్శి ఎందుకు స్పందించడం లేదని పేర్నినాని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment