హైదరాబాద్: బెజవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ ముఠాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధాలు ఉన్నాయని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మట్లాడుతూ.. బడా బాబులను వదిలేసి చిన్నచిన్న వ్యాపారులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఉప్పులేటి కల్పన విమర్శించారు.
కాగా, గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సీప కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు అసెంబ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
'కాల్‌మనీ ముఠాతో బాబుకు సంబంధాలు'
Published Thu, Dec 17 2015 10:53 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement