
ఆ వార్తలు అవాస్తవం: కల్పన
విజయవాడ: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవని వైఎస్సార్ సీపీ నాయకురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా తనపై వార్తలు ప్రచురించిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన హెచ్చరించారు. తాను ఎప్పటికీ వైఎస్సార్ సీపీలో ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.
టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారథి అన్నారు. వైఎస్సార్ సీపీని ఎవరూ వీడడటం లేదని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తన కొడుకుపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.