'దళిత విద్యార్థులనే సస్పెండ్ చేయడం దారుణం' | Ysrcp MLA Kalpana demands for high level committee enquiry for rohith suicide | Sakshi
Sakshi News home page

'దళిత విద్యార్థులనే సస్పెండ్ చేయడం దారుణం'

Published Tue, Jan 19 2016 4:23 PM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

'దళిత విద్యార్థులనే సస్పెండ్ చేయడం దారుణం' - Sakshi

'దళిత విద్యార్థులనే సస్పెండ్ చేయడం దారుణం'

హైదరాబాద్: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు.

మంగళవారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ...దళిత విద్యార్థులనే కారణంతో హెచ్సీయూలో సోషల్ బాయ్కాట్ చేయడం దారుణమన్నారు. యూనివర్సిటీ కులాల కంపు రావణ కాష్టంగా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  రోహిత్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని....మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. ఈ  ఘటనపై ఉన్నత స్ధాయి కమిటీని నియమించి నిజాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement