హైదరాబాద్ : డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ... రుణాలు అందక డ్వాక్రా మహిళలు అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో డ్వాక్రా మహిళలను వేధిస్తున్నారన్నారు. తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు.