భూముల కోసం రైతులను భయపెడుతున్నారు:కల్పన | Uppuleti Kalpana Comments on Chandrababu rule | Sakshi
Sakshi News home page

భూముల కోసం రైతులను భయపెడుతున్నారు:కల్పన

Published Wed, Dec 31 2014 5:43 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

ఉప్పులేటి కల్పన - Sakshi

ఉప్పులేటి కల్పన

విజయవాడ: ఏపీ రాజధాని ప్రతిపాధిత ప్రాంతంలో భూసేకరణ కోసం రైతులను భయపెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. ఆమె ఈ రోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్రంలో చంద్రబాబు పాలన అరాచకం సృష్టిస్తోందన్నారు. అధికార పార్టీ చెప్పిందే చట్టం, శాసనం అన్నవిధంగా పాలన సాగుతోందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడినా, అవి చట్టపరమైనట్లుగా మాట్లాడుతున్నారన్నారు.


టీడీపీ వచ్చిన ఏడు నెలల కాలంలో 22 మంది వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆమె చెప్పారు. తుళ్లూరు పంటపొలాల ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రైతులను భయపెట్టడం కోసమే టీడీపీ నేతలు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కల్పన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement