విప్‌గా చింతమనేనిని తప్పించండి
చింతమనేనివి దురహంకారపూరిత వ్యాఖ్యలు
బహిరంగ క్షమాపణ చెప్పాలి
సిగ్గులేకుండా పింఛన్లు తీసుకోండి అంటూ ప్రజలను అంటారా?: వైసీపీ నేత కల్పన
హైదరాబాద్: ‘సిగ్గులేకుండా పింఛన్లు తీసుకోండి’ అంటూ ప్రజలనుద్దేశించి దురహంకారపూరిత వ్యాఖ్యలు చేసి న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఏలూరు మండ లం మాదేపల్లి గ్రామంలో సోమవారం జరిగిన జన్మభూమి సభలో మాట్లాడిన ప్రభాకర్.. ‘‘సిగ్గులేకుండా పింఛన్లు తీసుకోండి. ఆ తరువాత చంద్రబాబు ఫొటోకు నమస్కారం పెట్టి వెళ్లం డి’’ అని పింఛన్‌దారులకు చెప్పడం అభ్యంతరకరమని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను చులకన చేసి మాట్లాడినందుకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు.
మంగళవారం ఆమె వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక అధికార టీడీపీ విధానమా అన్నది స్పష్టం చేయాలని కోరారు. వ్యక్తిగతమైనవైతే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో ఈ దురహం కార మే టీడీపీ విధానమని అనుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇతర పార్టీల వారు సర్పంచ్‌లుగా ఉన్న గ్రామా ల్లో కూడా అక్కడి టీడీపీ నేతల జోక్యంతోనే జాబితాలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణా లు పొందడానికి సిద్ధంగా ఉన్న 2013 సంవత్సరం లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలన పేరుతో ప్రభుత్వం ఆపేయడం దారుణమన్నా రు. పింఛన్లతో సహా అన్ని రకాల సంక్షేమ పథకాల్లో అర్హులైన వారిని పక్కనబెట్టి పచ్చచొక్కాలు తొడుకున్న వారికే ఇస్తున్నారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ వారికే పథకాలు ఇస్తామని చెప్పడం గర్హనీయమన్నారు.