మచిలీపట్నం: కృష్ణాజిల్లా పామర్రు మండలం కొమరవోలులో శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపైకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వచ్చారు. ఆమెతో పాటు వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కృష్ణకుమారి కూడా వేదికపైకి రావడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. దాంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు.