Janmabhoomi program
-
ఏపీ వ్యాప్తంగా జన్మ భూమి కార్యక్రమంలో జనాగ్రహం
-
కర్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమంలో ఖాళీ బిందెలతో నిరసన
-
‘జన్మభూమి’లో పార్థసారధిపై దౌర్జన్యం
-
‘జన్మభూమి’లో పార్థసారధిపై దౌర్జన్యం
సాక్షి, కృష్ణా జిల్లా : జిల్లాలోని ఉయ్యూరు నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సమస్యలపై ప్రశ్నించిన వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారధిపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైవీబి రాజేంద్రప్రసాద్‌లు నోరుపారేసుకున్నారు. దీంతో వైస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. సమస్యలపై ప్రజాప్రతినిధులను ప్రశ్నించింనందుకు టీడీపీ కార్యకర్తలు వీది రౌడిల్లా వ్యవహరించారు. దీంతో ఒక్కసారిగి సభ వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అదుపు చేసి, పార్థసారధిని సభ నుంచి బయటకు పంపేశారు. రాజుపాలెంలో రచ్చరచ్చయిన జన్మభూమి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రచ్చ రచ్చయింది. గ్రామంలో జరిగిన రూ. 40లక్షల మరుగుదొడ్ల నిర్మాణం అవినీతిపై విచారణ జరిపించాలంటూ గ్రామస్తులు సభను అడ్డుకున్నారు. అవినీతిపై విచారణ జరిపించేవరకూ సభ జరపొద్దని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో పోలీసుల, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మరుగుదొడ్ల అవినీతిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే సభ నుంచి వెళ్లిపోయారు. విజయవాడ జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం విజయవాడలోని 59వ డివిజన్లో గురువారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని అధికారులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శైలజ నిలదీశారు. దీంతో మహిళా కార్పొరేటర్ శైజలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు జన్మభూమి కార్యక్రమం ముందు నిరసనకు దిగారు. టీడీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
జన్మభూమి కార్యక్రమంలో ఆధికారులను నిలదీసిన గ్రామస్తులు
-
ఆకివీడు జన్మభూమి కార్యక్రమంలో రసాభాస
-
రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న ప్రజలు
-
జన్మభూమి కార్యక్రమంలో సోంత పార్టీ నుంచే నిరసన సెగ
-
అధికారులపై తిరగబడ్డ జనం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో సామాన్య ప్రజలు గళం విప్పుతున్నారు. తమ సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలం కోమటికుంట్లలో బుధవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జనం అధికారులపై తిరగబడ్డారు. తమ సమస్యలను పరిష్కరించలేని జన్మభూమి కార్యక్రమం తమకు వద్దంటూ ఆందోళనకు దిగారు. జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్న గ్రామస్తులు తాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన సమస్యలనే పరిష్కరించలేని వారు మళ్లీ జన్మభూమి కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా గ్రామంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టవద్దంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు, జన్మభూమి ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
జన్మ భూమి కార్యక్రమంలో వ్యక్తి ఆత్మహత్యయత్నం
-
రాజమండ్రి జన్మ భూమి కార్యక్రమంలో రగడ
-
తూర్పు గోదావరి జన్మ భూమి కార్యక్రమంలో రగడ
-
మంత్రిగారికి కోపమొచ్చింది
అమృతలూరు (వేమూరు): పేదరాలి ఇల్లును కూల్చారని సానుభూతి లేదు.. జూదాన్ని అరికడదామన్న ఆలోచన లేదు.. వాస్తవాలు రాసిన విలేకరిపై కేసు నమోదు చేయాలని సాక్షాత్తూ రాష్ట్ర సాంఘిక, గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనందబాబు జన్మభూమి సభలో అనడంతో, సభకు వచ్చిన జనం అవాక్కయ్యారు. వివరాలిలా ఉన్నాయి. సాక్షి దినపత్రికలో సోమవారం ‘మంత్రి ఇలాకాలో అరాచకాలు’ అనే శీర్షికన కథనం వెలువడింది. ఉన్న గూడు కోల్పోయిన పేద వృద్ధురాలి వేదన, గ్రామంలో జూదం తీవ్రతతో జరిగిన ఘటనపై ఈ కథనం ప్రచురితమైంది. ఈ కథనం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. చుండూరు మండలం అంబేడ్కర్ నగర్లో సోమవారం జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి హాజరైన మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తనపై ప్రచురించిన వార్తపై విచారించి, ఆ విలేకరిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కేసులు సైతం నమోదు చేయమన్నారు. లేదంటే తానే రంగంలోకి దిగుతానని సభా సమక్షంలో మంత్రి పోలీసులను హెచ్చరించడంతో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యచకితులయ్యారు. మంత్రి హామీతో బాధితులకు బెదిరింపులు... సాక్షాత్తూ మంత్రి సభలో మాట్లాడిన తీరును ఆసరాగా తీసుకున్న వంగివరపు గురవయ్య, కమలాకర్ వెంటనే బాధితుల వద్దకు వెళ్లి మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన అంజమ్మ, ఆమె కుమారుడు వాసు మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు. -
పశ్చిమగోదావరి జన్మ భూమి సభలో ఉద్రిక్తత
-
కొత్తపేట జన్మభూమి కార్యక్రమం రసాభాస
-
తొలిరోజే సెగ !
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన జన్మభూమి కార్యక్రమం తొలిరోజు సోమవారం జిల్లాలో పలు చోట్ల రసాభాసగా మారింది. ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలను తక్షణం రద్దు చేయాలని పలుచోట్ల స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించగానే ఏడాది క్రితం తాము రేషన్‌కార్డులు, వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఎందుకు మంజూరు చేయలేదని ఆయా వర్గాల ప్రజలు నిలదీశారు. జన్మభూమి సభలలో గొడవలు జరుగుతాయని భావించిన చోట ప్రభుత్వం ముందుగానే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. జన్మభూమి కమిటీలు రద్దు చేయాలంటూ ధర్నా... జగ్గయ్యపేట మండలం అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల్లో జన్మభూమి– మాఊరు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం నాయకులు పలువురు జన్మభూమి కమిటీలను తక్షణం రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్ (తాతయ్య), అధికారుల సమక్షంలోనే ధర్నాకు దిగారు. ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న వారిని అధికారులు బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి ధర్నా చేస్తున్న వారిని పక్కకు తోసేశారు. అర్హులైన వారికి కూడా పింఛన్లు, తెల్లకార్డులు అందకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు బహిరంగంగానే విమర్శించారు.కార్యక్రమంలో తహసీల్దార్ కె. నాగేశ్వరరావు, ఎంపీడీవో వై . శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరి గోపాలరావు, పిడికిటి కోటేశ్వరరావు, గింజుపల్లి శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు డోర్నాల నాగయ్య, అరుణ్‌కుమార్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల పహరాలో....! విజయవాడ 23వ డివిజన్ కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తారనే అనుమానంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు ఎవరువస్తున్నారో నిఘాపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ సభ ముగిసిందని అనిపించడంతో ప్రజలు పెదవివిరిచారు. జిల్లాలో పలుచోట్ల పోలీసు బందోబస్తు నడుమే తొలిరోజు జన్మభూమి కార్యక్రమాలు జరిగాయి. రేషన్ కార్డులకు బదులు ప్రొసీడింగ్స్ .... జిల్లాలో తొలిరోజు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పలుచోట్ల స్థానికులు పాల్గొని తాము ఏడాది క్రితం తెల్లరేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నామని ఇప్పటి వరకు ఇవ్వలేదందటూ అధికారుల్ని నిలదీశారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కార్డుల మంజూరు ప్రొసీడింగ్స్‌ను ఇచ్చి పంపారు. బందరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా ఆయనకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్ల సెగ తగిలింది. పలువురు పేదలు తాము ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పింఛన్లు, తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని చెప్పారు. దీంతో వారికి మంత్రి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. -
ఇదెక్కడి పరేషన్
కాకినాడ కలెక్టరేట్ :దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది అధికార యంత్రాంగం పరిస్థితి. జిల్లాలో మూడు విడతలుగా జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. గత రెండు దల్ల్లో నిర్వహించిన జన్మభూమిలో దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం.. జిల్లాలో 1,34,680 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. వాటిని ఈ నెల 2 నుంచి 11 వరకూ నిర్వహించిన జన్మభూమిలో వాటిని పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని వివిధ గ్రామాలు, వార్డుల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు.. రేషన్ కార్డులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కొందరికి మాత్రమే కార్డులందాయి. అవి కూడా తప్పుల తడకలుగా ఉన్నాయి. యజమాని ఫొటో మాత్రమే కొన్ని కార్డుల్లో ముద్రితమైంది. కుటుంబ సభ్యుల పేర్లు కార్డులో ఉన్నప్పటికీ, వారి ఫొటోలు లేవు. మరికొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లే లేవు. అవన్నీ సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు మినహా చర్యలు శూన్యం. కార్డుల్లో మార్పులుచేర్పుల కోసం తహశీల్దార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. తహశీల్దార్ కార్యాలయంలోనే తప్పులు సరిచేస్తామని అధికారులు చెబుతుంటే, అవగాహన లేని కొంతమంది సిబ్బంది లబ్ధిదారులను మీ-సేవ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడ కొత్తకార్డులు రావని చెబుతుండడంతో మళ్లీ తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. పాత కార్డుదారులు మీ-సేవకే వెళ్లాలి జన్మభూమి కార్యక్రమంలో (జేఏపీ) రేషన్ కార్డు మంజూరైన వారు తప్పుల సవరణ, మార్పులుచేర్పుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి మాత్రమే వెళ్లాలి. గతంలో పంపిణీ చేసిన ఏఏఓ, డబ్ల్యూఏపీ, ఆర్ఏపీ, టీఏపీ కార్డుదారులు తమ కార్డులో మార్పులుచేర్పుల కోసం మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. -
జన్మభూమి పండగ రూ.కోటి దండగ
- తూతూ మంత్రంగా ముగిసిన గ్రామసభలు - నిర్వహణ పేరిట భారీగా నిధులు డ్రా - ‘కోడ్' ఉన్నా కొత్త పింఛన్లు పంపిణీ సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వం మంజూరుచేసిన కోటి రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసినట్లు అధికారులు లెక్కలు చూపడం తప్ప తప్ప జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన రెండో విడత జన్మభూమి - మా ఊరు ఆదివారంతో ముగిసింది. ఈ సభల్లో డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేసి సంబంధిత పత్రాలను అట్టహాసంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉన్న పింఛన్లలో కోతేసి వాటి స్థానంలో కొత్తగా మంజూరుచేసిన పింఛన్లను కూడా ఈ సభల్లోనే పంపిణీ చేయాలనుకున్నారు. నీరు- చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలతో పాటు నెల వారీగా పంపిణీ చేసే పింఛన్లు, పీడీఎస్ సరకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని తలపోశారు. సభల నిర్వహణ కోసం జిల్లాకు ఏకంగా రూ.కోటి మంజూరు చేశారు. అర్బన్ ప్రాంతాల్లో కమిషనర్లు, రూరల్‌లో మండల పరిషత్ అధికారుల అకౌంట్లకు ఈ నిధులు జమ చేశారు. సభలకు ప్రజాప్రతినిధులు దూరం ఇంతలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమం మొక్కుబడి తంతుగానే ముగిసింది. కొత్త పింఛన్లతో పాటు, డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాలకు రూ.3 వేల జమచేసే కార్యక్రమాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ప్రభుత్వ భజన, రాజకీయ ఉపన్యాసాలకు ఆస్కారం లేకపోవడంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సభల పట్ల ఆసక్తి చూపలేదు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక పర్యటన కూడా రద్దయింది. ఇక జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్న పాత్రుడులు ఒకటి రెండు సభలకే పరిమితమయ్యారు.స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సభల జోలికి పోలేదు. జరగకపోయినా.. జరిగినట్టు.. పెదబయలు మండలం పెదకొడపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్లు నిర్మించడం లేదంటూ ఆగ్రహంతో తొలిరోజు సభను బాయ్ కాట్ చేశారు. మిగిలిన 924 పంచాయతీలతో పాటు జీవీఎంసీ, ఇతర మున్సిపాలటీల్లోని 190 వార్డుల్లో సభలు జరిగాయని లెక్క తేల్చేరు. ఈ మేరకు జన్మభూమి నిర్వహణకు మంజూరైన కోటీ ఖర్చయినట్టుగా లెక్కలు చూపారు. కానీ వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన 1144 సభల్లో కనీసం మూడో వంతు సభలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. అవి కూడా మొక్కుబడిగానే సాగాయి. సభలు జరిగిన చోట పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. సభలు జరగకపోయినా.. జరిగినట్టు రికార్డుల్లో పేర్కొంటూ..సభల నిర్వహణకు టెంట్లు, ఇతరసౌకర్యాల పేరిట మండలాలకు కేటాయించిన సొమ్మును పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్టు ఓచర్లు పెట్టి డ్రాచేశారు. సమస్యలు పరిష్కారం మాటెలా ఉన్నా కోటి రూపాయలను మాత్రం ఖర్చుచేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. అర్జీలు 20 వేలే! జిల్లా వ్యాప్తంగా 1113 సభలు నిర్వహించినట్టుగా లెక్కలు చెబుతున్న అధికారులు నెల వారీగా పంపిణీ చేసే రేషన్ సరకులతో పాటు లక్షా 63 వేల 156 మందికి రూ.16.33 కోట్ల విలువైన పింఛన్లను పంపిణీ చేసినట్టు అధికారులు ప్రకటించారు. -
'జన్మభూమి' కార్యక్రమాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
విజయనగరం (జీఎంవలస) : విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బసగంగి గ్రామంలో ప్రజలు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. చింతలబెలగాం గ్రామంలో తమకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ వారు ఆదివారం జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పలుచోట్ల జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
జన్మభూమిలో జనాగ్రహం
జిల్లావ్యాప్తంగా తొలిరోజు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రజలు కొన్ని చోట్ల అడ్డుకోగా, మరికొన్ని చోట్ల బహిష్కరించారు. తాగునీరు, పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డులు లేకుండా జన్మభూమి కార్యక్రమానికి ఎందుకొచ్చారంటూ అధికారులను నిలదీశారు. దీంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. సాక్షి, చిత్తూరు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమం రద్దయినట్లు ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా తమకు ఆదేశాలు రాలేదంటూ అధికారులు పలుచోట్ల జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. అధికారపార్టీ నేతలు సైతం నిబంధనలను తుంగలో తొక్కి జన్మభూమిలో పాల్గొన్నా అధికారులు అడ్డుచెప్పలేదు. పలమనేరు రూరల్ మండలం మొరం గ్రామంలో అర్హులైన వారి పింఛన్లు తొలగించారంటూ అధికార పార్టీ నేతలే జన్మభూమి సభను అడ్డుకున్నారు. పింఛన్లు ఇచ్చేంత వరకు గ్రామంలో సభ జరగనివ్వమని హెచ్చరించారు. ప్రజలతో తిట్లు తినాల్సి వస్తోందని, గ్రామంలో తలెత్తుకుని తిరగలేకున్నామని స్థానిక నేతలు అధికారులను నిలదీసి చివాట్లు పెట్టారు. నగరి మున్సిపాలిటీ 1,2,3 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభలను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వలేమన్నప్పుడు సభలెందుకంటూ మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్‌ను నిలదీశారు. సభను జరగనివ్వమంటూ భీష్మించుకు కూర్చొన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. అనంతరం సభలను బహిష్కరించి వెళ్లిపోయారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని పీఎస్ అగ్రహారంలో జరిగిన సభలో అధికారులు లేకుండా టీడీపీ నేతలు కొందరు వేదికపై కూర్చోవడంతో వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ శ్యామ్‌సుందర్ వారిని నిలదీశారు. అధికారులు లేకుండా జన్మభూమి ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచి వారు లేచి వెళ్లిపోయారు. పీలేరులో తాగునీటి సమస్యను ఎంతచెప్పినా పరిష్కరించడం లేదంటూ స్థానికప్రజలు అధికారులను నిలదీశారు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో జరిగిన సభలో పింఛన్లు పంపిణీ చేయకుండా మొక్కుబడిగా సభను ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ఎంపీపీ, జడ్పీటీసీలను ప్రశ్నించడంతో సభ ఆగిపోయింది. శ్రీకాళహస్తి పట్టణంలో తొలిరోజు ఏడు వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాలను అధికారులు మొక్కుబడిగా నిర్వహించారు. మంత్రి వస్తున్నారంటూ ఉదయం 9 గంటలకే సభ అంటూ పింఛన్‌దారులతోపాటు గర్భవతులను సభల వద్దకు తరలించారు. 11 గంటలైనా మంత్రి రాకపోవడంతో అసహనానికి గురైన ప్రజలు అధికారులపై చిందులు తొక్కారు. మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. దీంతో కమిషనర్ జన్మభూమి ప్రారంభించారు. ఇంతలో మంత్రి వేరే వార్డులో ఉన్నారని తెలుసుకుని అర్థాంతరంగా కమిషనర్ మంత్రి వద్దకు పరుగులు పెట్టడంతో ప్రజలు చీవాట్లు పెట్టారు. జన్మభూమి సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య గొడవ జరిగింది. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండల కేంద్రంలో అధికారులు మొక్కుబడిగా జన్మభూమి నిర్వహించి అర్జీలు తీసుకుని వెళ్లిపోయారు. చిత్తూరురూరల్ ఆనగల్లులో జన్మభూమి సభ మొక్కుబడిగా సాగింది. సభకు వచ్చిన కొద్దిపాటి మహిళలు సైతం రుణమాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాలు ఇవ్వలేదంటూ నేతలను నిలదీశారు. -
ఉన్నవి పీకేశారు... కొత్తవి ఇవ్వలేదు
శ్రీకాకుళం పాతబస్టాండ్ :పాతరోజులు గుర్తుకొస్తున్నాయి.. కొత్త రేషన్‌కార్డు కావాలంటే ఒకరి కార్డు రద్దు చేయాలన్నది నాడు బాబు హయాంలో ఉన్న కండిషన్... ఇప్పుడూ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. గడచిన బాబు ఏడాది పాలనలో పాత రేషన్‌కార్డులు పరిశీలన పేరుతో తొలగించారు. కొత్తవాటి కోసం అర్జీలు పెరుగుతున్నా మంజూరు చేసిన పాపాన పోలేదు. ప్రజలు నిరంతరం మీ సేవలోనూ, తహశీల్దారు కార్యాలయాల్లోనూ, గ్రామాలకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు, ఆధికారులకు అర్జీలు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే వడబోత పేరుతో జిల్లాలో దాదాపు 32వేల కార్డులను అనర్హత పేరుతో తొలగించేసిన సర్కారు వాటి పునరుద్ధరణకు సవాలక్ష ఆంక్షలు పెడుతోంది. చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో పిల్లల ఉచిత విద్య, ఉపకార వేతనాలు, సంక్షేమ రుణాలు వంటివాటికి నోచుకోలేకపోతున్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో జరిగిన తొలివిడత జన్మభూమి కార్యక్రమంలో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ వేలాది మంది కొత్త కార్డుల కోసం దర ఖాస్తుచేసుకున్నారు. అంతే కాకుండా నేరుగా తహశీల్దారు కార్యాలయానికి ఇచ్చినవారూ ఉన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో 52,376 మంది కొత్త రేషన్ కార్డులకోసం కుటుంబాలతో కూడిన ఫొటోలు, ఆధార్ కార్డులు, ఓటరు కార్డు ఇతర ఆధారాలతో దరఖాస్తుచేసుకున్నారు. అవన్నీ తహశీల్దారు కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. వీటిలో కొన్ని పరిశీలనలో ఉండగా, మరికొన్ని అన్లైన్ దశలో ఉన్నాయి. ఈ ప్రక్రియకు ముందు ఈ దరఖాస్తులను ఆయా గ్రామాల్లోగల జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదిస్తేనే కొత్తకార్డు కోసం అన్లైన్లో సిపార్సు చేస్తారు. కొత్త రేషన్ కార్డులకు కూడా జనాబా ప్రాతిపతిక అని నెపంతో ఆర్హులకు కూడా కోత పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
మరుగున పడ్డాయి..
‘స్వచ్ఛభారత్’లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వాలు... నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడంతో నిర్మాణాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అదీగాక ప్రజల అవగాహన లేమితో పాటు... ఏ శాఖ నిధులు విడుదల చేస్తుందనే విషయమై సరైన స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం అంతగా దృష్టి కేంద్రీకరించని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4,709 మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. * మరుగు దొడ్ల నిర్మాణంపై ఆసక్తి చూపని జనం * నిధుల విడుదలలో తీవ్ర జాప్యం * కట్టాల్సినవి 97,547... పూర్తి చేసినవి 4,709 * ఏ శాఖ నుంచి నిధులిస్తారో వెల్లడించని వైనం * పట్టించుకోని అధికారగణం మచిలీపట్నం : ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలని ప్రతి గ్రామ సభలోనూ కనీసం అరగంట సమయం కేటాయించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అయినా ప్రజల్లో అనుకున్నంత స్పందన రాలేదు. నిధుల లేమి ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 10వేలు మాత్రమే ఇచ్చేవారమని, ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 12వేలకు పెంచామని ప్రభుత్వం పదే పదే చెప్పినా వీటి నిర్మాణం మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. ఇటీవలి కాలం వరకు ఇసుక కొరత మరుగుదొడ్ల నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లలో 50శాతానికి పైగా వినియోగంలో లేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 97,547 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు పూర్తి చేసినవి కేవలం 4,709 మాత్రమే. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సిబ్బంది, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇందుకోసం ఏ శాఖ నుంచి నిధులు కేటాయిస్తారనే అం శంపై ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని పలువురు ఎంపీడీవోలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేశామని రానున్న కాలంలో ఈ వ్యవహారాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స్థలం కొరత, వాస్తు భయం... గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ సొంత మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రజలు వెనకంజ వేయాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్డి నిర్మించాలంటే నాలుగేసి వరలతో రెండు ట్యాంకులు నిర్మించాలనే నిబంధన విధించారు. మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు ఇంటి ఆవరణంలో ఉంటే వాస్తు దోషం తగులుతుందనే అపోహతో వీటి నిర్మాణానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్డి అసలు లేని వారు దీనిని నిర్మించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే రూ. 12వేలు చాలవని, మరో రూ. 2 నుంచి రూ. 3వేలు అదనంగా ఖర్చు చేయాలనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. గతంలో కొందరు వ్యక్తులు మరుగుదొడ్లు నిర్మించడానికే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఈ సారి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో పని లేకుండా ఎవరికి వారే స్వచ్ఛందంగా మరుగుదొడ్లు నిర్మించుకుంటే విడతల వారీగా నగదు మంజూరు చేస్తామని చెబుతున్నా... ముందస్తుగా పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇసుక కొరతతో జాప్యం... ఒక మరుగుదొడ్డి నిర్మించాలంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రూ. 14,040 ఖర్చవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. 870 ఇటుకలు, 30 అడుగుల ఇసుక, 9 అడుగుల పెద్దకంకర, 8 వరలు, రెండు మూతలు, రెండు అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల పొడవు ఉన్న తలుపు, 10 అడుగుల పీవీసీపైపు, ఐదు అడుగుల రేకు, బేసిన్, పైప్‌లైన్ అవసరం. నలుగురు మేస్త్రీలకు ఖర్చు రూ. 1600లని ఇంజనీర్లు నిర్ణయించారు. మరుగుదొడ్డి నిర్మించుకునే వారే పనిచేసుకుంటే రూ. 1600 ఖర్చు కలిసి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయితే నాలుగు అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు, దొడ్డి లోపల భాగం వైపు జాగా ఉండేలా మరుగుదొడ్డి నిర్మించాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకోవాలనే నిబంధన ఉండటంతో ఇటీవల కాలం వరకు ఇసుక కొరత తదితర కారణాల వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ అంశం అమలులోకి రాలేదు. అయితే అధికారుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్డి సొంతంగా నిర్మించుకున్న వారికి బిల్లులు రాని సంఘటనలుఉన్నాయి. ఇదిలా ఉండగా మరుగుదొడ్ల నిర్మాణంలో పాత కాలం నాటి పద్ధతులను ఉపయోగిస్తుండడంతో నేటికీ రోడ్ల వెంట దుర్గంధం వెదజల్లుతోంది. ఇటీవల అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నరేంద్రమోడీ తాను ప్రధాన మంత్రిగా ఉండి దేశంలో మరుగుదొడ్లు నిర్మించే అంశంపై దృష్టిసారించాల్సి వస్తోందని చెప్పడం గమనార్హం. నేపథ్యమిదీ... సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రాం (సీఆర్ఎస్పీ)ను 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం. మహిళల గౌరవాన్ని కాపాడడం. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు అందేలా చూడడం, మురుగునీటి నిర్మూలన చేయడం. 1999 నుంచి ఈ కార్యక్రమాన్ని విసృ్తతం చేశారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్ఎల్డబ్ల్యూఎం), కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు. పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం పాటించిన పంచాయతీలకు నిర్మల్ గ్రామ్ పురస్కార్‌ను అందజేయాలని నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా ఫార్ములా అమలు చేసేనా? గతంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వాణిమోహన్ మరుగుదొడ్ల నిర్మాణంపై కఠిన నిర్ణయాలే తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డుపై సరుకులు తీసుకోవాలంటే మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన విధించటంతో ఆ జిల్లాలో 80శాతానికి పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని అధికారులు అంటున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రెండునెలల గడువు ఇచ్చి మూడవ నెలలో మరుగుదొడ్డి నిర్మాణం చేయని కుటుంబాలన్నింటికీ రేషన్ నిలిపివేయడంతో రాజకీయ నాయకుల నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చినా వాటిని పక్కన పెట్టడంతో ఆ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం ప్రక్రియ కొంతైనా ముందడుగు వేసిందనే వాదనను అధికారులు వినిపిస్తున్నారు. లక్ష్యాలివే.... * గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. * 2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో కచ్చితమైన పారిశుద్ధ్యాన్ని పాటించి నిర్మల్ భారత్‌గా తీర్చిదిద్దడం. * ప్రజలు ఆనారోగ్యం పాలు కాకుండా అవగాహన కల్పించడం. * గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం. * పర్యావరణ పరిరక్షణపై విసృ్తత ప్రచారం చేయడం. * ప్రతి గృహానికీ మరుగుదొడ్డి నిర్మించడం. * ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి, సన్న, చిన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ద్వారానే మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వడం. * ప్రభుత్వ భవనాలు, పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించడం. -
స్వచ్ఛ భారత్ కోసం..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సబ్బవరం మండలం ఆరిపాకలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్‌కు కట్టుబడి ఉంటామని మంత్రులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. త్వరలో పంచగ్రామాల సమస్య పరిష్కారం పెందుర్తి/సబ్బవరం: పెందుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం ఆరిపాక వద్ద సోమవారం జరిగిన సభలో సీఎంకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి నియోజకవర్గ సమస్యలను వివరించారు. దీనికి స్పందించిన చంద్రబాబు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోర్టు గొడవలు ఉన్నందున జాప్యం జరుగుతోందని చెప్పా రు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వమే ఆ సమస్య పరిష్కరిస్తుందని చెప్పారు. 578 జీవో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా చర్య లు తీసుకుంటామన్నారు. సబ్బవరంలోని 30 పడకల ఆస్పత్రి, పెందు ర్తి పీహెచ్‌సీని ఆధునికీకరించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందిస్తామన్నారు. డిగ్రీ కళాశాలల మంజూరు అంశాల ను పరిశీలిస్తున్నామన్నారు. సబ్బవరంలో ఉన్న 700 ఎకరాల ప్రభుత్వ భూముల్లో యూనివర్సి టీ లేదా భారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించి స్థానికంగానే వా రికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధు లు, అధికారులు సమన్వయంతో ప్రణాళిక లు వేసుకుని పనిచేయాలని సూచించారు. ఆరిపాకకు రూ.కోటి మంజూరు: సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ అభివృద్దికి రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ నిధులకు మరో రూ.కోటి సమకూర్చుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక సర్పంచ్ శరగడం సాయి అన్నపూర్ణ, ఎంపీటీసీలకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు సరిగా జరగకపోతే మంజూరు చేసిన నిధులు తిరిగి వసూలు చేస్తామని హెచ్చరించారు. పలువురు లబ్ధిదారులకు సీఎంపింఛన్లు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరువాక, శిశుసంక్షేమ శాఖ, ఉద్యానశాఖ, గ్రా మీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. జిల్లాలో వివి ద అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహా యక సంఘాల పాత్రను ఆ సంఘాల ప్రతి నిధి నాగమణి ముఖ్యమంత్రికి వివరించా రు. సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న సీ ఎం గర్భిణులకు పసుపు కుంకుమలు అందజేసి ఆశీర్వదించారు. ఇంకుడు గుంతల ఆవశ్యకత, కుటుంబ వ్యవసాయం ప్రాజెక్ట్‌లపై తొమ్మిదో తరగతి విద్యార్థులు వరలక్ష్మి, గీతిక ముఖ్యమంత్రి వద్ద ప్రసంగించారు. -
కొమరవోలు జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత
మచిలీపట్నం: కృష్ణాజిల్లా పామర్రు మండలం కొమరవోలులో శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపైకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వచ్చారు. ఆమెతో పాటు వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కృష్ణకుమారి కూడా వేదికపైకి రావడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. దాంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. -
చాలా చూశా.. పక్కకు నెట్టండి!
-
చాలా చూశా.. పక్కకు నెట్టండి!
ఐకేపీ యానిమేటర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం ‘పశ్చిమ’లో జన్మభూమి- మా ఊరు కార్యక్రమం రసాభాస సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఏయ్ పోలీస్.. వాళ్లను పక్కకు నెట్టండి. లేదంటే పక్కన కూర్చోబెట్టండి. ఇలాంటివి చాలా చూశా. ఖాళీ, పనికిమాలిన పార్టీలు చేసే రాజకీయాలకు నేను భయపడను’ పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కలవపూడిలో శనివారం జన్మభూమి సభ సందర్భంగా జీతాల కోసం నినదించిన ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) యానిమేటర్లను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. సీఎం ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు మహిళలని కూడా చూడకుండా ఐకేపీ యానిమేటర్లను ఈడ్చిపారేశారు. కలవపూడిలో జరిగిన జన్మభూమి కార్యక్రమం లో చంద్రబాబు మైక్ తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టగానే గ్యాలరీలో కూర్చున్న ఐకేపీ యానిమేటర్లు 16 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో చంద్రబాబు వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులను యానిమేటర్లు ప్రతిఘటించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు టీడీపీ కార్యకర్తలు యానిమేటర్లపై దాడికి యత్నించ డంతో యానిమేటర్ల జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామలారాణి స్పృహ కోల్పోయారు. అయినా యానిమేటర్లు వెనక్కు తగ్గలేదు. వీరికి డ్వాక్రా మహిళలు మద్దతుగా నిలిచారు. ఎస్పీ రఘురామిరెడ్డి ఇద్దరు యానిమేటర్లను సీఎం వద్దకు పంపినా శాంతించలేదు. సభను చెడగొట్టడానికే వచ్చారంటూ సీఎం వారిపై మండిపడ్డారు. ఒకవైపు ఐకేపీ యానిమేటర్ల ఆందోళన జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం దొడ్డిపట్లలో జన్మభూమి సభలో పాల్గొన్నారు. సీఎం వెంట కార్యక్రమంలో మంత్రులు మాణిక్యాలరావు, సుజాత, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
డోంట్ కేర్
ఇదో జన్మభూమి కార్యక్రమం. ఇందులో అధికారులు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రమే పాల్గొనే ఓ అధికార కార్యక్రమం. కానీ చీరాల నియోజకవర్గంలో ఛీత్కార రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారులు అడ్డుపడినా, పోలీసులు అభ్యంతరాలు పెట్టినా డోంట్‌కేర్ అంటూ చీరాల టీడీపీ ఇన్‌ఛార్జి పోతుల సునీత దౌర్జన్యాలకు పాల్పడడంతో ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. రెండు రోజులుగా ఇదే తరహా బెదిరింపులకు దిగుతుండడంతో దీర్ఘకాలిక సెలవులే శరణ్యమంటున్నారు సిబ్బంది. చీరాల:రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఒంటెత్తు పోకడలతో జన్మభూమి గ్రామసభలు రణరంగాలుగా మారుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం సంగతేమో కాని..దూషణలు, కుమ్ములాటలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలం కదా... మమ్మల్ని ఎవరేంచేస్తారు...అనే అహంకార ధోరణితో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చీరాల గాంధీనగర్‌లో సోమవారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదంతో ఘర్షణ నెలకొనడంతో అధికారులు సభను రద్దు చేశారు. టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీత గ్రామంలో జరుగుతున్న జన్మభూమి గ్రామసభకు హాజరై నేరుగా వేదికపైకి వచ్చి కూర్చున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికపై ఉండాలనే నిబంధన ఉన్నా సునీత వేదికపై కూర్చోవడాన్ని గ్రామ సర్పంచ్ తాతా సుబ్బారావు, ఈవోఆర్డీ పీ శంకరరెడ్డి, ఉపసర్పంచ్ వెంకయ్య, ఇతర పాలకవర్గ సభ్యులు ఆక్షేపించారు. ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయలేని కారణంగా..ఈవోఆర్డీ వేదికపై నుంచి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల అధికారులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వేదికపై ఉన్న సునీత మాత్రం జన్మభూమిని నిర్వహించాలని పట్టుబట్టారు. దీనికి గ్రామసర్పంచ్ సుబ్బారావు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సునీత సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు. ఁనేను అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ని..నేను చెప్పిందే చేయాలి...సభ జరగాల్సిందే...ఒప్పుకోకపోతే వెళ్లిపో సభను నేను జరుపుతాననిరూ. సర్పంచ్‌ని అగౌరవంగా దూషించారు. ఒక దశలో అధికారులు, పోలీసులు చూస్తుండగానే సర్పంచ్‌పై దాడికి యత్నించారు. వయస్సులో పెద్దవాడినైనా తనను టీడీపీ నేత సునీత దూషించడం, హెచ్చరికలు జారీచేయడంతో తీవ్రమనోవే దనకు గురైన సర్పంచ్ జన్మభూమిని గ్రామంలో రద్దు చేస్తున్నానని, అధికారులు, ప్రజలు తనను క్షమించాలని కోరారు. సునీత మాత్రం బలవంతంగా మైకును తీసుకుని సభలో మాట్లాడారు. దీన్ని అడ్డుకోబోతున్న ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు, టీడీపీ నేత సునీత వర్గీయుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఒక దశలో పరిస్థితి చేయిదాటిపోయేలా ఇరువర్గాల నాయకులు బలప్రదర్శనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పి ఆందోళనకారులను పంపించి వేశారు. సభ లో కేవలం గ్రామస్తులు, అధికారులు మాత్రమే ఉండాలని సీఐ భీమానాయక్ మైకులో హెచ్చరించినా పోతుల సునీత వర్గీయులు, టీడీపీ విభాగాల నాయకులు మాత్రం సభాప్రాంగణాన్ని వదల్లేదు. దీంతో మళ్లీ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అయితే టీడీపీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున వచ్చి కయ్యానికి కాలుదువ్వారు. నాయకులు రావడంతో అధికారులు గాంధీనగర్‌లో జరగాల్సిన జన్మభూమిని రద్దు చేశారు. మండల స్థాయి అధికారులను, పోలీసులను సైతం పోతుల సునీత బహిరంగంగానే అగౌరవంగా మాట్లాడటంతో సభలో గందరగోళం నెలకొంది. సునీత వాఖ్యలకు నిరసనగా అధికారులంతా సభను వాకౌట్ చేశారు. ఒన్‌టౌన్ సీఐ భీమానాయక్, ఎస్సైలు శ్రీహరి, రామానాయక్, పోలీసు సిబ్బంది, ప్రత్యేక పోలీసులు 20 మంది వచ్చి ఆందోళనకారులను పంపించివేశారు. తహశీల్దార్ బి.సత్యనారాయణతో సునీత మాట్లాడుతూ సీఏం ఆదేశాలున్నాయని అందుకే సభలకు వస్తున్నానని, అడ్డుచెప్పేహక్కు మీకు లేదన్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ జన్మభూమి అధికారిక కార్యక్రమమని, మీకు వేదికపైకి వచ్చే హక్కులేదనితేల్చి చెప్పగా జన్మభూమి వేదికల్లో పాల్గొనేందుకు మంత్రి వద్ద నుంచి అనుమతి పత్రం తీసుకుని వచ్చి పాల్గొంటానని..అప్పుడు ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సునీత హెచ్చరించడం గమనార్హం. ‘జన్మభూమి’కి మేం రాం..రాం ! = మూకుమ్మడి సెలవు పెట్టే యోచనలో మండల అధికారులు = ఉన్నతాధికారులకు ఫిర్యాదు చీరాలటౌన్: చీరాల మండల స్థాయి అధికారులు జన్మభూమి కార్యక్రమానికి రాలేమంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు రాజకీయ నేతల ఘర్షణలు, వాగ్వాదాల కారణంగా ఁజన్మభూమిరూ.కి రావాలంటేనే జంకుతున్నారు. మండలంలో జన్మభూమి- మా ఊరు గ్రామసభలు ప్రారంభమైన తొలి రోజు నుంచీ నేతల తీరుతో రణరంగాలుగా మారడంతో అధికారులంతా మూకుమ్మడి సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగర్ కాలనీ, గాంధీనగర్ పంచాయతీల్లో జరగాల్సిన జన్మభూమి కార్యక్రమాలు నేతల ఘర్షణలతో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, తహశీల్దార్‌తో సహా ఇతర శాఖల అధికారులు సెలవు పెట్టే ఆలోచనలో ఉన్నారు. సోమవారం జరిగిన పరిణామాలతో విసుగు చెందిన అధికారులు కలెక్టర్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా మంత్రికి, ముఖ్యమంత్రి పేషీకి, జన్మభూమి ప్రత్యేకాధికారులకు సంఘటనలపై వివరంగా తెలియజేస్తూ లిఖితపూర్వకంగా అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు. జన్మభూమి కార్యక్రమాలకు అడ్డు తగలకుండా గట్టి బందోబస్తు అందించి, సజావుగా జరిపేందుకు చర్యలు చేపడితేనే తాము వస్తామని లేకుంటే సామూహిక సెలవులు తీసుకుంటామని మండల అధికారులు తెలిపారు. మనస్తాపానికి గురై సభను రద్దుచేశా గ్రామ ప్రథమ పౌరుడినైన నన్ను ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ సునీత అగౌరవపరిచారు. వేదికపైకి వచ్చినందుకు అడ్డుచెప్పిన నన్ను దూషించినందుకు నిరసనగా జన్మభూమి సభను రద్దుచేశా. గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు మాత్రమే సభకు హాజరై పోలీసులు సహకారం ఉంటేనే సభను నిర్వహిస్తా. - తాతా సుబ్బారావు, గాంధీనగర్ సర్పంచ్ -
జన్మభూమిని టీడీపీ నీరుగారుస్తోంది: ఉప్పులేటి కల్పన
విజయవాడ: జన్మభూమి జరుగుతున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమం టీడీపీ ప్రచారం కార్యక్రమంగా సాగుతోందని ఆమె అన్నారు. జన్మభూమి కార్యక్రమ ఉద్దేశాలను టీడీపీ నీరుగారుస్తోందని కల్పన విమర్శించారు. జన్మభూమి ప్రభుత్వ కార్యక్రమంలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను ఆపార్టీ నేతలు ధిక్కరిస్తున్నారని ఉప్పులేటి కల్పన అన్నారు. ఓటమి పాలైన టీడీపీ నేతల చేతుల మీదుగా ఫించన్ల పంపిణీ జరుగుతోందని ఆమె అన్నారు. టీడీపీ నేతలు ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాహాబాహీ
చీరాల: జన్మభూమి కార్యక్రమం చీరాలలో అపహాస్యమైంది. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన వేదిక కాస్తా..వీధి తగాదాకు నెలవైంది. తమ గోడు చెప్పుకుందామని వచ్చిన ప్రజలు రాజకీయ నేతల మధ్య జరిగిన ఘర్షణ చూసి..వీరా తమ తలరాత మార్చే నేతలంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రొటోకాల్ రేపిన వివాదంతో ఎమ్మెల్యే ఆమంచి, టీడీపీ ఇన్చార్జ్ పోతుల సునీతల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నేతలు, వారి అనుచరులు అధికారుల ముందే పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కాలనీలో ఏర్పాటు చేశారు. సభలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో జీ సాంబశివరావు ప్రారంభించి వేదికపైకి సర్పంచ్ దుడ్డు రూపవతి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తహశీల్దార్ బీ సత్యనారాయణలను పిలిచారు. తర్వాత సర్పంచ్ రూపావతిని అధ్యక్షత వహించాలని ఎంపీడీవో కోరారు. అప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీత వేదిక వద్ద ఉన్నారు. ఆమంచి వర్గీయులు ‘ఆమంచి జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీడీపీ సర్పంచ్ రూపావతి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీతను వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఎటువంటి ప్రొటోకాల్ లేకున్నా..సునీతను వేదికపైకి ఆహ్వానించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాల్సిన ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ని వేదికపైకి పిలవడంపై తొలుత మాటల యుద్ధం నడవగా..చివరకు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలను పిలవడం ఏమిటని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అయితే సర్పంచ్ మాత్రం ‘నేనే గ్రామానికి పెద్ద. మా నేత వేదికపైకి వస్తే మీకేంటి’ అని అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీనికి ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ ఇది రాజకీయ కార్యక్రమం కాదని..ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆమంచి, పోతుల వర్గీయులు కుర్చీలు, కర్రలతో దాడులకు దిగారు. ఆమంచి వర్గీయులు కొందరు సర్పంచ్‌పై దాడి చేశారు. సునీత వర్గీయులు కూడా ఆమంచి వర్గీయులపై దాడులు చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుని, తోసుకున్నారు. ఆమంచి, సునీత మధ్య దూషణల పర్వం కొనసాగింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆగ్రహానికి గురైన సునీత విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆమంచి వర్గీయురాలు అనుకొని చేయిచేసుకోవడంతో పాటుగా దుర్భాషలాడారు. టూటౌన్ సీఐ అబ్దుల్సుబాన్, ఎస్సై రాములు నాయక్, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ మహిళా కానిస్టేబుల్‌పై సునీత దాడిచేస్తున్నా నిలువరించలేకపోయారు. చివరకు సునీతను పోలీసులు పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. జన్మభూమి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్యెల్యే పట్టుబట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఈనెల 10 తేదీకి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒన్‌టౌన్ సీఐ బీమానాయక్ సునీత, ఆమంచిలతో చర్చించి గ్రామ సభ నుంచి వెళ్లాలని సూచించగా ఇరువర్గాలు ఒకరి తరువాత ఒకరు సభాప్రాంగణం నుంచి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఘర్షణలో గ్రామసర్పంచ్ డి.రూపవతిపై ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు దాడిచేయడంతో గాయాలయ్యాయి. దీంతో సర్పంచ్‌ని వైద్యసేవల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె పోలీసులకు ఫిర్యాదు చే శారు. పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న ఘర్షణలో ఎమ్యెల్యే ఆమంచి సోదరుడు స్వాములు కూడా ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా ఏఎస్పీ వి.రామానాయక్ గ్రామాన్ని సందర్శించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సర్పంచ్ డి.రూపవతిని పరామర్శించి సంఘటన వివరాలు సేకరించారు. చంద్రబాబు ఆదేశాలతోనే జన్మభూమిలో పాల్గొంటున్నాం: పోతుల సునీత జన్మభూమి- మాఊరు కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జులు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకే జన్మభూమిలో పాల్గొన్నాం. కానీ ఎమ్యెల్యే ఆమంచి చేతకాని వ్యక్తిగా ప్రవర్తించారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకుని మా పార్టీ వారిపై దాడి చేయించారు. అధికారులను బెదిరించారు. ఇటువ ంటి వ్యక్తులకు భయపడేది లేదు. పోలీసులు సర్పంచ్‌పై దాడిచేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇది పార్టీ కార్యక్రమమా? - ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ జన్మభూమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం. టీడీపీ సమావేశంలాగా సునీత వేదికపైకి రావడం సరికాదు. అధికారుల అలసత్వం, అవగాహనా లోపం వలనే ఇలా జరిగింది. శనివారం దేవినూతల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ సునీతను వేదికపైకి ఆహ్వానించకుండా ఉండాల్సింది. ఇకపై ఆమె మరో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాల వేదికపైకి రాకుండా ఉండాలి. సర్పంచ్ రూపావతి జన్మభూమి కార్యక్రమాన్ని ఆటంకపరిచారు. జన్మభూమిలో పంచాయతీ అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నాం. మరలా ఇదే గ్రామంలో జన్మభూమిలో పాల్గొని అభివృద్ధికి చర్యలు చేపడతాను. -
జన్మభూమికి పింఛన్ల సెగ!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గ్రామాల్లో పింఛన్ల రగడ మొదలైంది. అధికార పార్టీ నేతలు కక్షగట్టి తీసేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. నోటికాడ కూడును లాక్కున్నారని ఆగ్రహిస్తున్నారు. ఆవేదన ఆపుకోలేక జన్మభూమి కార్యక్రమంలో అధికారులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గొడవలు జరిగే ఆస్కారముంది. గ్రామాలకొచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులను బాధితులు చుట్టుముట్టే అవకాశం ఉందని ఇంటెలిజెన్స అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎక్కడెక్కడ నిలదీసే అవకాశం ఉందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జన్మభూమికి ఆటంకం కల్గించొద్దని, అర్హుల జాబితాలో మళ్లీ చేర్చుతామని బాధితులను వేడుకుంటున్నారు. జిల్లాలో మొన్నటి వరకు 2లక్షల 79వేల 700మందికి పింఛన్లు అందేవి. అయితే, ఇటీవల నిర్వహించిన పింఛన్ల పరిశీలన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 32వేల మందిని అనర్హులుగా తేల్చారు. వారందరికీ పింఛన్లు నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని అర్హతలున్నా ఒక కుటుంబంలో ఒకరికే పింఛను ఇస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఉమ్మడి కుటుంబంలో ఉన్న వేలాది మంది వృద్ధులు, వికలాంగులు పింఛన్లకు దూరమవుతున్నారు. అలాగే, భర్త చనిపోయినట్టు ధ్రువీకరణ పత్రాలు చూపించలేదన్న సాకుతో వేలాది మంది వితంతువుల పింఛన్లు కూడా నిలిపేశారు. జిల్లాలో ఏ గ్రామానికెళ్లినా ఇదే గోడు వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సందర్భంలో జన్మభూమి కార్యక్రమం జరుగుతుండడంతో తమ కు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు బాధితులకు మంచి అవకాశం దొరికినట్టు అయ్యింది. గ్రామానికి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకోవచ్చని, అవసరమైతే నిలదీయవచ్చని భావిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని ఇప్పటికే విపక్షాలు భరోసా ఇచ్చాయి. దీంతో జన్మభూమిలో గొడవలు జరిగే అవకాశం ఉందని, గతంలో మాదిరి గా అధికార బృందాలను చుట్టుముట్టొచ్చన్న క్షేత్రస్థాయి పరిస్థితులను ఇంటెలిజెన్స పోలీసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇప్పటికే బాధితులు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి ఆందోళనలు చేశారని, ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నోటికొచ్చినట్టు తిడుతున్నారని, పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున కథనాలొచ్చాయని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారాన్ని చేరవేసినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆవేదనతో ఉన్న బాధితులకు నచ్చచెప్పాలని, ఒకవేళ అర్హులై ఉండి తొలగింపు జరిగితే మళ్లీ చేరుస్తామంటూ సర్దిచెప్పి పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆందోళన చేసే అవకాశం ఉన్న పింఛను బాధితులను కలుస్తున్నారు. జన్మభూమి ప్రశాంతంగా జరిగిపోవాలన్న ఉద్దేశంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ...బొబ్బిలి మం డలం ఎరకందొరవలస గ్రామానికిచెందిన బడ్నాన అప్పలస్వామి(70), నరసమ్మ(66) దంపతులకు రేషన్‌కార్డులో వయస్సు తక్కువ ఉందని పింఛను తీసేయగా, వీరికి జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’ మెయిన్ పేజీలో ‘పెన్షనర్ల గుండెల్లో టెన్షన్’శీర్షికతో ప్రచురించింది. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు రంగంలోకి జిల్లా అధికారులను వివరణ కోరినట్టు తెలిసింది. దీంతో యుద్ధప్రాతిపదికన ఎరకందొరవలస గ్రామ కార్యదర్శిని బాధితుల వద్దకు పంపించి, పింఛను వచ్చేసిందని చెప్పండని, అర్హుల జాబితాలో చేర్చుతామని, జన్మభూమిలో ప్రస్తావించొద్దని చెప్పినట్టు తెలియవచ్చింది. అయితే, బాధిత దంపతులు జన్మభూమిలో కచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. ఇదే తరహాలో మిగతా ప్రాం తాల్లో ఆగ్రహంతో ఉన్న పింఛను బాధితులను అధికారులు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. జన్మభూమికి ఆటంకాలు కలగకుండా పోలీసుల సాయంతో నిర్వహించాలని చూస్తున్నారు. మొత్తానికి గ్రామాల్లో నెలకొన్న పింఛన్ల రగడతో జన్మభూమిలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయోనన్న భయం అధికారులకు పట్టుకుంది. -
ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు
సాక్షి, ఏలూరు : టీడీపీ సర్కారు మార్కు జన్మభూమి కార్యక్రమం కొత్తగా మన ఊరు అనే పేరు తగిలించుకుని మరోసారి ప్రజల మధ్యకు రాబోతోంది. గురువారం నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఏకకాలంలో ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పేదల ముంగిటకే సంక్షేమ ఫలాలు తీసుకువెళ్లేందుకు.. దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. వీటికి ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో వారంతా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల సాధనకు దీని ద్వారా శ్రీకారం చుడుతున్నారు. పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర వంటి కార్యక్రమాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించనున్నారు. పెంచిన పింఛను మొత్తాలను జన్మభూమి గ్రామసభల్లోనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పశు వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. కార్యక్రమం జరిగే 14 రోజుల్లో ఏదో ఒక రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వస్తారు. తొలి రోజు ఇలా... తొలిరోజు జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో జన్మభూమి-మన ఊరు కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తారు. అక్టోబర్ 3న విజయదశమి సెలవు కావడంతో ఆ రోజు కార్యక్రమాలకు విరామం ఇచ్చా రు. 4నుంచి నవంబర్ 20 వరకూ (ఆదివారాలు సెలవు) నిర్విరామంగా గ్రామ సభలు నిర్వహిస్తారు.పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి విభాగాలు వీటి నిర్వహణ బాధ్యతల్ని వహిస్తారుు. ప్రతిరోజు ప్రతి మండలంలోని రెండు గ్రామాల్లో రెండు బృందాలు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తాయి. ఒక బృందానికి ఎంపీడీవో, మరో బృందానికి తహసిల్దార్ నేతృత్వం వహిస్తారు. గ్రామ, మండల స్థాయి అధికారులతో పాటు స్థానిక నేతలు ప్రతి బృందంలో ఉంటారు. పట్టణాల్లో నిత్యం రెండు వార్డుల్లో జన్మభూమి-మన ఊరు జరుగుతుంది. ఇక్కడా రెండు బృందాలు ఏర్పా టు చేస్తారు. ఒక బృందంలో కమిషనర్, మరో బృం దంలో కమిషనర్ స్థాయి అధికారి ఉంటారు. ‘మా తెలుగు తల్లి’ గీతాలాపనతో... ప్రతిరోజు ‘మా తెలుగుతల్లి’ గీతాలపనతో మొదల య్యే కార్యక్రమం రోజంతా జరుగుతుంది. స్థానికులతో బృంద చర్చలు జరుపుతారు. ఏదైనా మండలం లో 28 కంటే ఎక్కువ గ్రామాలుంటే అక్కడ రెండు కం టే ఎక్కువ బృందాలను ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ, మునిసిపల్ వార్డుల అభివృద్ధికి సంబంధించి ‘విజన్ డాక్యుమెంటరీ’ని, వార్షిక ప్రణాళికలను ఈ బృందాలు రూపొందించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఇన్చార్జిగా, జిల్లా పంచాయతీ అధికారి సహాయకారిగా వ్యవహరిస్తారు. మునిసిపాలిటీల్లో కమిషనర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు ఇన్చార్జిలుగా ఉంటారు. ఏడు మిషన్లు ఇవే... ఐదు గ్రిడ్లు ఇలా సాంఘిక సాధికారత, ప్రాథమిక రంగం, విజ్ఞానం-నైపుణ్యాల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, వసతుల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, సేవా రంగం అభివృద్ధి అంశాలను ఏడు మిషన్లుగా ప్రభుత్వం పేర్కొంది. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ గ్రిడ్లను ఐదు గ్రిడ్లుగా సూచిస్తూ వీటి అభివృద్ధికి చర్యలు చేపట్టేందుకు జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంటోంది.