స్వచ్ఛ భారత్ కోసం..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సబ్బవరం మండలం ఆరిపాకలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్‌కు కట్టుబడి ఉంటామని మంత్రులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు.
త్వరలో పంచగ్రామాల సమస్య పరిష్కారం
పెందుర్తి/సబ్బవరం: పెందుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం ఆరిపాక వద్ద సోమవారం జరిగిన సభలో సీఎంకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి నియోజకవర్గ సమస్యలను వివరించారు. దీనికి స్పందించిన చంద్రబాబు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కోర్టు గొడవలు ఉన్నందున జాప్యం జరుగుతోందని చెప్పా రు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వమే ఆ సమస్య పరిష్కరిస్తుందని చెప్పారు. 578 జీవో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా చర్య లు తీసుకుంటామన్నారు. సబ్బవరంలోని 30 పడకల ఆస్పత్రి, పెందు ర్తి పీహెచ్‌సీని ఆధునికీకరించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందిస్తామన్నారు.
డిగ్రీ కళాశాలల మంజూరు అంశాల ను పరిశీలిస్తున్నామన్నారు. సబ్బవరంలో ఉన్న 700 ఎకరాల ప్రభుత్వ భూముల్లో యూనివర్సి టీ లేదా భారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించి స్థానికంగానే వా రికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధు లు, అధికారులు సమన్వయంతో ప్రణాళిక లు వేసుకుని పనిచేయాలని సూచించారు.
ఆరిపాకకు రూ.కోటి మంజూరు: సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ అభివృద్దికి రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ నిధులకు మరో రూ.కోటి సమకూర్చుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక సర్పంచ్ శరగడం సాయి అన్నపూర్ణ, ఎంపీటీసీలకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు సరిగా జరగకపోతే మంజూరు చేసిన నిధులు తిరిగి వసూలు చేస్తామని హెచ్చరించారు. పలువురు లబ్ధిదారులకు సీఎంపింఛన్లు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరువాక, శిశుసంక్షేమ శాఖ, ఉద్యానశాఖ, గ్రా మీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు.
జిల్లాలో వివి ద అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహా యక సంఘాల పాత్రను ఆ సంఘాల ప్రతి నిధి నాగమణి ముఖ్యమంత్రికి వివరించా రు. సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న సీ ఎం గర్భిణులకు పసుపు కుంకుమలు అందజేసి ఆశీర్వదించారు. ఇంకుడు గుంతల ఆవశ్యకత, కుటుంబ వ్యవసాయం ప్రాజెక్ట్‌లపై తొమ్మిదో తరగతి విద్యార్థులు వరలక్ష్మి, గీతిక ముఖ్యమంత్రి వద్ద ప్రసంగించారు.