మురికి కాల్వలో చెత్త తీసిన చంద్రబాబు
విజయవాడ : మహాత్మగాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీ పవిత్రమైన రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని ఆయన గురువారమిక్కడ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు నూతన రాజధాని విజయవాడలో పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు తిలకం దిద్దుతూ మహిళలు స్వాగతం పలికారు. మరోవైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మురికి కాలువలో చెత్త తీశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు
ఆ తర్వాత స్వచ్ఛ భారత్ ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం సింగ్ నగర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీరు పంపిణీ జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. మాకినేని బసవపూర్ణయ్య స్టేడియంలో వికలాంగులు, వృద్ధులకు పెంచిన పింఛన్ పథకం ప్రారంభించారు.