జిల్లాలోని ఉయ్యూరు నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సమస్యలపై ప్రశ్నించిన వైస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారధిపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైవీబి రాజేంద్రప్రసాద్‌లు నోరుపారేసుకున్నారు. దీంతో వైస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.