
సాక్షి, కృష్ణా జిల్లా : జిల్లాలోని ఉయ్యూరు నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సమస్యలపై ప్రశ్నించిన వైస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారధిపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైవీబి రాజేంద్రప్రసాద్‌లు నోరుపారేసుకున్నారు. దీంతో వైస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. సమస్యలపై ప్రజాప్రతినిధులను ప్రశ్నించింనందుకు టీడీపీ కార్యకర్తలు వీది రౌడిల్లా వ్యవహరించారు. దీంతో ఒక్కసారిగి సభ వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అదుపు చేసి, పార్థసారధిని సభ నుంచి బయటకు పంపేశారు.
రాజుపాలెంలో రచ్చరచ్చయిన జన్మభూమి
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రచ్చ రచ్చయింది. గ్రామంలో జరిగిన రూ. 40లక్షల మరుగుదొడ్ల నిర్మాణం అవినీతిపై విచారణ జరిపించాలంటూ గ్రామస్తులు సభను అడ్డుకున్నారు. అవినీతిపై విచారణ జరిపించేవరకూ సభ జరపొద్దని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో పోలీసుల, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మరుగుదొడ్ల అవినీతిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే సభ నుంచి వెళ్లిపోయారు.
విజయవాడ జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం
విజయవాడలోని 59వ డివిజన్‌లో గురువారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని అధికారులను వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శైలజ నిలదీశారు. దీంతో మహిళా కార్పొరేటర్ శైజలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జన్మభూమి కార్యక్రమం ముందు నిరసనకు దిగారు. టీడీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment