జన్మభూమిని టీడీపీ నీరుగారుస్తోంది: ఉప్పులేటి కల్పన
విజయవాడ: జన్మభూమి జరుగుతున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమం టీడీపీ ప్రచారం కార్యక్రమంగా సాగుతోందని ఆమె అన్నారు. జన్మభూమి కార్యక్రమ ఉద్దేశాలను టీడీపీ నీరుగారుస్తోందని కల్పన విమర్శించారు.
జన్మభూమి ప్రభుత్వ కార్యక్రమంలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను ఆపార్టీ నేతలు ధిక్కరిస్తున్నారని ఉప్పులేటి కల్పన అన్నారు. ఓటమి పాలైన టీడీపీ నేతల చేతుల మీదుగా ఫించన్ల పంపిణీ జరుగుతోందని ఆమె అన్నారు.
టీడీపీ నేతలు ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు.