సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో సామాన్య ప్రజలు గళం విప్పుతున్నారు. తమ సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలుపుతున్నారు.
అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలం కోమటికుంట్లలో బుధవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జనం అధికారులపై తిరగబడ్డారు. తమ సమస్యలను పరిష్కరించలేని జన్మభూమి కార్యక్రమం తమకు వద్దంటూ ఆందోళనకు దిగారు. జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్న గ్రామస్తులు తాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన సమస్యలనే పరిష్కరించలేని వారు మళ్లీ జన్మభూమి కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా గ్రామంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టవద్దంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు, జన్మభూమి ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment