
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతులు రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా మైనర్ ఇరిగేషన్ ఈఈ తిప్పేస్వామి పై శింగనమల టీడీపీ నేతలు ముంటి మడుగు కేశవరెడ్డి, రంగారెడ్డి దాడి చేశారు. తుంగభద్ర నీటి విషయంలో మేము చెప్పినా వినవా అంటూ ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ల సమక్షంలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు.
టీడీపీ నేతల దౌర్జన్యానికి నిరసనగా విధులను బహిష్కరించిన ఇరిగేషన్ ఉద్యోగులు. జిల్లా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment